కరోనావైరస్ లాక్ డౌన్ నిబంధనలను సడలించేందుకు సిద్ధమైన ఇటలీ

ఫొటో సోర్స్, EPA
మార్చి రెండో వారం తర్వాత నుంచి రోజువారీ మరణాల సంఖ్య అతి తక్కువగా నమోదు అవుతుండటంతో ఏడు వారాలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ నిబంధనలను సడలించేందుకు ఇటలీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
మే 4 నుంచి లాక్ డౌన్ నిబంధనల సడలింపు మొదలు పెడతామని ఇటలీ ప్రధాని గిసెప్పీ కాంటే వెల్లడించారు. ఆరోజు నుంచి పరిమిత సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతిస్తామని, కానీ మాస్కులు తప్పక ధరించాలని ఆయన తెలిపారు.
పార్కులను తెరిచినా స్కూళ్లను మాత్రం సెప్టెంబర్ నుంచే తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యూరప్‌లోని స్విట్జర్లాండ్, స్పెయిన్ కూడా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి.
ఆదివారంనాడు ఇటలీలో 260మంది వైరస్ కారణంగా చనిపోయారు. మార్చి 14 తర్వాత ఒకరోజులో సంభవించిన అతి తక్కువ మరణాలు ఇవే. ఇప్పటి వరకు యూరప్‌లోనే అత్యధికంగా ఇటలీలో 26,644 మంది వైరస్ కారణంగా మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ గణాంకాలను సేకరిస్తున్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ చెప్పినదాని ప్రకారం ఇటలీలో మొత్తం 1,97,675 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య తగ్గుతుండటం, వ్యాధి వ్యాప్తి కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఇకపై నిబంధనలు క్రమక్రమంగా సడలించాలని ఇటలీ నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇటలీ ప్రధాని ఏం ప్రకటించారు?
కరోనావైరస్ లాక్ డౌన్ నిబంధనల సడలింపులో రెండో దశ గురించి ఇటలీ ప్రధాని కాంటే టెలివిజన్ ద్వారా ప్రజలకు సూచనలు చేశారు. అవేంటంటే...
ప్రజలు తమ ప్రాంతాల్లో సంచరించవచ్చు. కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదు.
అంత్యక్రియల కార్యక్రమాలు మళ్లీ మొదలవుతాయి. బహిరంగ ప్రదేశాల్లోనే ఖననం చేయాలి. ఈ సమయంలో 15 కన్నా ఎక్కువమంది ఉండకూడదు.
అథ్లెట్లు వ్యక్తిగత శిక్షణను ప్రారంభించవచ్చు. ఆటగాళ్లు ఇళ్ల దగ్గర కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లో ఆటలు ఆడుకోవచ్చు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

టేక్ అవే సర్వీసుల కోసం బార్లు, రెస్టారెంట్లు మే 4 నుంచి తెరుస్తారు. అయితే ఈ ఫుడ్‌ను ఇళ్లల్లో లేదా ఆఫీసుల్లో మాత్రమే తీసుకోవాలి.
హెయిర్ డ్రెస్సర్స్, బ్యూటీ సెలూన్లు, బార్లు, రెస్టారెంట్లు డైన్ ఇన్ సర్వీసుల కోసం జూన్ 1 వరకు ఆగాల్సిందే.
మొదటి దశ సడలింపుల్లో రిటెయిల్ షాపులు ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు. రెండో దశలో మే 18 నుంచి మ్యూజియమ్‌లు, లైబ్రరీలు కూడా తెరవచ్చు.
క్రీడాకారుల గ్రూప్ ట్రైనింగుకు మే 18 నుంచి అనుమతి ఇస్తారు.
ఇక ఇటలీ ప్రీమియర్ ఫుట్ బాల్ లీగ్ సైరీ ఏ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ప్రేక్షకులు లేకుండా నిర్వహణపై కూడా ఎలాంటి ప్రకటన లేదు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
అయితే రాబోయే రోజుల్లో కూడా సామాజిక దూరం నియమాలను కఠినంగా కొనసాగించాలని ప్రధాని కాంటే స్పష్టం చేశారు. చర్చి కార్యక్రమాలు కూడా పూర్తిగా బంద్ చేశారు. ప్రజలంతా మూడు మీటర్ల దూరాన్ని పాటించాలని ప్రధాని సూచించారు.
"మనం నిబంధనలను పాటించకపోతే మళ్లీ మరణాల రేటు పెరగడం మొదలవుతుంది. మనం ఆర్ధికంగా చాలా సమస్యల్లో కూరుకుపోతాం. మీరు ఇటలీని ప్రేమిస్తున్నట్లయితే సామాజిక దూరాన్ని పాటించండి'' అని ప్రధాని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటలీలో ఏం జరిగింది?
మార్చి 9 నుంచి ఇటాలియన్లు ఇళ్లలోనే లాక్ డౌన్ అయ్యారు. వాళ్లు వారి ఇంటికి సమీపంలోని వీధుల్లోకి వెళ్లడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.
ఇటలీ ఏప్రిల్ 14 నుంచి లాక్ డౌన్ నిబంధనల సడలింపులో మొదటి దశను ప్రారంభించింది. కొన్నిషాపులు, బుక్ స్టోర్స్, డ్రై క్లీనింగ్ సెంటర్లు, స్టేషనరీ స్టోర్లు ఓపెన్ అయ్యాయి. తక్కువమంది జనం పోగయ్యే అవకాశాలున్న వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు.
"ప్రస్తుతం నరకంలో ఉన్నట్లున్న ఈ లాక్ డౌన్‌కు సడలింపులు ఇస్తుండటంతో ప్రజలు ఊరిపి పీల్చుకుంటున్నారు. కానీ జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది" అని రోమ్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి మార్క్ లావెన్ అంటున్నారు.
ఒకవేళ ఇన్ ఫెక్షన్ మళ్లీ విజృంభిస్తే ఈ నిబంధనలను తిరిగి అమలు చేసేందుకు ప్రభుత్వానికి అన్ని అధికారాలున్నాయని మార్క్ లావెన్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: వెంటిలేటర్లు ఏంటి? అవి ఎందుకు ముఖ్యం?
- భారత్‌లో చిన్నారుల ఆరోగ్యంపై లాక్ డౌన్ ప్రభావం చూపుతుందా?
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనావైరస్: చేతులు కడుక్కోవడం, దాని వెనుక చరిత్ర
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
- కరోనావైరస్: లాక్డౌన్ సమయంలో మద్యం ప్రియులు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








