కోవిడ్-19: వెంటిలేటర్లు ఏమిటి? అవి ఎందుకు ముఖ్యం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్లోరా కర్మికయెల్, మరియానా స్ప్రింగ్
- హోదా, బీబీసీ ట్రెండింగ్
కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో ఆసుపత్రులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వాలు వేలాదిగా వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నాయి.
కోవిడ్-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు ప్రాణాలు పోసే ప్రక్రియలో వెంటిలేటర్లు కీలక పాత్ర పోషిస్తాయి.
వెంటిలేటర్ ఏంటి? అదేం చేస్తుంది?
ఊపిరితిత్తులు పనిచేయనంతగా వ్యాధి ముదిరినప్పుడు, శరీరానికి అవసరమైన శ్వాస అందించే పనిని వెంటిలేటర్లు చూసుకుంటాయి.
వ్యాధితో పోరాడి, నయం అయ్యేందుకు అవసరమైన సమయాన్ని రోగి శరీరానికి ఇస్తాయి.
ఇందుకు పలు రకాల వైద్యపరమైన వెంటిలేషన్‌ను ఉపయోగిస్తుంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) లెక్కల ప్రకారం కరోనావైరస్ కారణంగా సోకుతున్న కోవిడ్-19 వ్యాధి బారినపడ్డ ప్రజల్లో 80 శాతం మంది ఆసుపత్రిలో చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటున్నారు.
అయితే, ప్రతి ఆరుగురు రోగుల్లో ఒకరు మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురై శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి తీవ్రమైన కేసుల్లో.. కరోనావైరస్ ఊపిరితిత్తుల్ని పాడు చేస్తోంది. దీనిని శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి, మరిన్ని రోగనిరోధక కణాలను పంపేలా రక్త నాళాలను విస్తరిస్తుంది.
దీనివల్ల ఊపిరితిత్తుల్లోకి రక్తం చేసి, ఊపిరాడటం కష్టమైపోతుంది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి.
ఈ పరిస్థితి నుంచి శరీరాన్ని కాపాడేందుకు ఒక వెంటిలేటర్ మెషీన్ ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ ఆక్సిజన్‌ను పంపిస్తుంది.

ఫొటో సోర్స్, DYSON
రోగి శరీర ఉష్ణోగ్రతకు సరిపోయేలాగా ఈ గాలికి వేడిని, తేమను జతచేసే హుమిడిఫైయర్ పరికరం కూడా ఈ వెంటిలేటర్‌లో ఉంటుంది.
పేషెంట్ల శ్వాసను పూర్తిగా మెషీన్ నియంత్రిస్తుంది కాబట్టి వారి శ్వాసకోశ కండరాలు విశ్రాంతి తీసుకునేలాగా వైద్యం అందుతుంది.
అయితే, స్వల్ప లక్షణాలున్న రోగులకైతే వెంటిలేషన్‌ను ఫేస్ మాస్కులు, ముక్కు మాస్కులు, నోటి మాస్కుల ద్వారా గాలిని, ఇతర వాయువుల మిశ్రమాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపిస్తారు.
ఒక గొట్టం ద్వారా ఆక్సిజన్‌ను పంపించే హుడ్స్ ను కూడా కోవిడ్-19 రోగుల కోసం వాడుతుంటారు. శ్వాసలోని తుంపర్లతో గాలి ద్వారా సంక్రమించే వైరస్‌ల ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈ తరహా విధానాన్ని ఉపయోగిస్తారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్‌ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు


ఫొటో సోర్స్, INTERSURGICAL
దీన్నే బయటి నుంచి (నాన్ ఇన్‌వేసివ్) వెంటిలేషన్ ఇచ్చే విధానం అంటారు. ఈ విధానంలో గొట్టాలను రోగి గొంతులోకి పంపించాల్సిన అవసరం ఉండదు.
శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల్లోకి తీసుకెళ్లి వెనువెంటనే మెడికల్ వెంటిలేషన్‌పై పెడతారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా చూడటానికే సాధారణంగా వారు ఇలా చేస్తారు.
ఇంటెన్సివ్ కేర్ సొసైటీకి చెందిన డాక్టర్ షాండిపోన్ లాహా బీబీసీతో మాట్లాడుతూ.. కోవిడ్-19 బారినపడిన చాలామంది పేషెంట్లకు మెషీన్ ద్వారా వెంటిలేషన్ అందించాల్సిన అవసరం పడదని, ఇంటివద్దనే వారికి చికిత్స అందించొచ్చని, లేదంటే ఆక్సిజన్ తీసుకునేందుకు మద్దతు అందించొచ్చని చెప్పారు.
వెంటిలేటర్లను ఉపయోగించేప్పుడు దీర్ఘకాల ప్రభావాలతో బాధపడుతున్నది ఎవరో తెలియకపోవడం వంటి కొన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ పేషెంట్ల శరీరంలోకి ఆక్సిజన్ పంపించేందుకు ఏకైక మార్గం వెంటిలేటర్ అని ఆయన తెలిపారు.

ఎక్కువ వెంటిలేటర్లు అవసరం అవుతాయనుకున్నప్పుడు వాటిని సరిపడా సరైన వైద్య సిబ్బంది లభించడం కూడా మరొక సమస్య అని డాక్టర్ లాహ వివరించారు.
''వెంటిలేటర్ అనేది ఒక సంక్లిష్టమైన భూతం. దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే రోగిని ప్రమాదంలో పడేస్తుంది. సాంకేతిక అంశాలు సవాళ్లతో కూడుకుని ఉంటాయి. వాటి గురించి అవగాహన ఉన్న మత్తుమందు నిపుణుల వంటి వారిని వాడుకోవచ్చు. నిజానికి వారికి ఉండే నైపుణ్యాలు భిన్నమైనవి. థియేటర్లో వారు కొంత మెరుగైన రోగుల్నే ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తుంటారు. ఐసీయూల్లో ఉండే పేషెంట్ల ఆరోగ్యం మరింత దిగజారి ఉంటుంది.''
యూకేలో ప్రస్తుతం 8,175 వెంటిలేటర్లు ఉన్నాయని ప్రభుత్వ ఆరోగ్య సంస్థ చెప్పింది. దాదాపు 30 వేల వెంటిలేటర్లు అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తక్షణం 10 వేల వెంటిలేటర్లను కొనుగోలు చేస్తోంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- దిల్లీ: కరోనావైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి.. ‘మొదటి మూడు రోజులు మాటలు కూడా సరిగా రాలేదు’
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో'
- కరోనావైరస్: 'కశ్మీర్లో 7 నెలలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేదు, వైరస్ వార్తలు, జాగ్రత్తలు తెలుసుకునేదెలా?'
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









