కరోనా వైరస్ ప్రపంచీకరణకు ముగింపు పలుకుతుందా? దేశాలన్నీ స్వదేశీ బాట పడతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాంటీ బ్లూమ్
- హోదా, బీబీసీ బిజినెస్ రిపోర్టర్
గత 25 సంవత్సరాల్లో ప్రపంచీకరణ అనే పదం నిత్యం వాడే పదాల్లో ఒకటిగా మారిపోయింది.
కానీ, ఇదేమి కొత్తగా పుట్టుకొచ్చిన విధానం కాదని, వందల ఏళ్లుగా సుదూర ప్రాంతాల మధ్య వాణిజ్యం జరుగుతూనే ఉందని చరిత్ర తెలిసిన ఆర్థికవేత్తలు ఎవరైనా చెబుతారు.
మధ్య యుగంలో దేశాల మధ్య జరిగిన సుగంధ ద్రవ్యాల వాణిజ్యం, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార శైలిని పరిశీలించి చూస్తే ఈ విషయం సులభంగా అర్ధం అయిపోతుంది. కానీ, గత కొన్నేళ్లలో ప్రపంచీకరణ ఊహించని రీతిలో పెరిగిపోయింది.
సులభతరమైన రవాణా సౌకర్యాలు, వరల్డ్ వైడ్ వెబ్, కోల్డ్ వార్ ముగింపు, కొత్త వాణిజ్య ఒప్పందాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచీకరణ అనే ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టి ప్రపంచంలో ఆవల వైపు ఏమి జరుగుతుందో తెలుసుకునే అవసరాన్ని గతంలో ఎన్నడూ లేనంత విధంగా కలగచేశాయి.
అందుకే ప్రపంచ దేశాలని భయపెడుతున్న కొవిడ్-19 అంత తొందరగా ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది.
గత 17 ఏళ్లలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ ప్రధాన ఆర్థికవేత్త ప్రొఫెసర్ బీటా జావెరిక్ అన్నారు.
"వెనక్కి తిరిగి చూసుకుంటే, 2003లో సార్స్ వ్యాధి తలెత్తినప్పుడు, ప్రపంచ ఉత్పత్తుల్లో చైనా వాటా 4 శాతం ఉండేది. అదిప్పుడు 16 శాతం అయింది. అంటే చైనాలో ఏమి జరిగినా దాని ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాల మీద పడుతుంది" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యూకేలో ఉన్న ప్రతి పెద్ద కార్ల ఉత్పత్తి సంస్థలన్నీ మూతపడ్డాయి. ఎందుకంటే కార్ల ఉత్పత్తికి కావాల్సిన పరికరాల కోసం వాళ్ళు అనేక దేశాల మీద ఆధారపడతారు. ఇది ప్రపంచీకరణ ఫలితం.
చైనాలో నెలకొన్న పరిస్థితులు గతంలో కంటే కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపిస్తాయి. ప్రపంచీకరణతో ఇంకా చాలా లోతైన సమస్యలు ఉన్నాయి.
ప్రపంచీకరణతో పాటు వచ్చే సమస్యలని పెంచుకుంటూ పోయామని, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇయన్ గోల్డిన్ అన్నారు.
“2008లో తలెత్తిన బ్యాంకుల విపత్తు, ద్రవ్య విపత్తు సమయంలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తాయి. ఇంటర్నెట్ పై సైబర్ దాడులు కూడా ఒక సమస్య. కొత్త ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో, అంతకంటే ఎక్కువ ముప్పు కూడా ఉంది. ఇదొక బటర్‌ఫ్లై డిఫెక్ట్” అని అయన అన్నారు.
ఒక వైపు ప్రపంచీకరణ ఆదాయాలు పెరగడానికి, ఆర్ధిక వ్యవస్థల్ని అభివృద్ధి చేయడానికి, లక్షలాది ప్రజలను కరువు నుంచి బయటపడేయడానికి ఉపయోగపడితే మరో వైపు ఆరోగ్య పరమైన సమస్యలు, ఆర్ధిక సమస్యలని కూడా తెచ్చిపెట్టింది.
ప్రపంచీకరణపై కరోనా ఎలా ప్రభావం చూపిస్తుంది?
పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే చాలా సంస్థలు తాము ఎలాంటి ముప్పుని ఎదుర్కొంటున్నారో అర్ధం చేసుకున్నాయని లండన్ బిజినెస్ స్కూల్లో పని చేస్తున్న ఎకనమిక్స్ ప్రొఫెసర్ రిచర్డ్ పోర్ట్స్ అన్నారు.
"కరోనా వైరస్ ప్రభావంతో వస్తువుల సరఫరా నిలిచిపోవడంతో, ప్రజలు స్వదేశంలో ఆ వస్తువులను ఎవరు సరఫరా చేస్తారా అని దృష్టి పెట్టడం ప్రారంభించారు" అని ఆయన అన్నారు.
“ఇప్పటికే ప్రపంచీకరణ కొనితెచ్చిన ముప్పుని చూడటం వలన స్వదేశీ ఉత్పత్తులపైనే ఆధారపడటానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు” అని పోర్ట్స్ అన్నారు.
ప్రొఫెసర్ జవరిక్ దీనిని సమర్ధించారు. పశ్చాత్య దేశాల్లో ఉత్పత్తి పరిశ్రమలు తిరిగి దేశీయ ఉత్పత్తులపై దృష్టి పెడతాయని అన్నారు.
కరోనావైరస్ నేపథ్యంలో ముఖ్యంగా యూఎస్, చైనా మధ్య తలెత్తిన వాణిజ్య కలహాల కారణంగా, కంపెనీలు తమ పనులని తిరిగి తమ తమ దేశాల్లో ప్రారంభించడం మొదలు పెడతాయని అభిప్రాయపడ్డారు.
ఏ దేశంలో కావల్సిన ఉత్పత్తులు ఆ దేశాల్లోనే తయారైతే అనిశ్చితి ఉండదు. జాతీయ వాణిజ్య విధానం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది వస్తువులను సరఫరా చేసే ఉత్పత్తిదారులని స్వదేశంలోనే పెంచుతుంది.
ఇది పాశ్చాత్త్య దేశాలకి అంత శుభవార్త కాదు ఎందుకంటే వాళ్ళు ప్రపంచీకరణ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నారు.
ప్రపంచీకరణ అంటే, మనుషులను, జ్ఞానాన్ని, సమాచారాన్ని ఒకరికొకరు పంచుకోవడం. అంతే తప్ప తయారైన ఉత్పత్తులను ప్రపంచమంతా సరఫరా చేయడం కాదు. ఈ విషయంలో బ్రిటన్ తెలివైన విధానాన్ని అవలంబించింది.
ఇప్పుడున్న పరిస్థితులని చూస్తుంటే, టూరిజం, యూనివర్సిటీ లాంటి సర్వీస్ రంగాలు ఒక్కసారిగా కుదేలయినట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విద్యా సంవత్సరం తర్వాత విదేశీ యూనివర్సిటీల్లో జరిగే అడ్మిషన్లు తగ్గిపోతాయని భయం ఉంది. ఇదొక పెద్ద ఎగుమతుల పరిశ్రమ. చాలా యూనివర్సిటీలు చైనీస్ విద్యార్థుల మీద ఆధారపడి ఉంటాయి.
విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ యూనివర్సిటీలలో చేరడానికి కూడా ప్రపంచీకరణ దోహదం చేసింది. అలాగే, ధనికులు, పర్యటకం ద్వారా తమ డబ్బును పాశ్చాత్త్య దేశాల్లో వెదచల్లేవారు.
ప్రపంచీకరణ స్తంభిస్తే ఈ రెండు రంగాలు బాగా నష్టపోతాయి. 2019 సరఫరా చైన్‌కి ఒక బ్రేక్ పెట్టిందని ప్రొఫెసర్ గోల్డిన్ అన్నారు.
అయితే, 3డి ప్రింటింగ్, ఆటోమేషన్, కొన్ని ప్రత్యేక డిమాండ్లు, సత్వర సరఫరా లాంటి అవసరాన్ని కొవిడ్-19 మరింత పెంచింది.
అయితే, ఈ మార్పులు నిజంగా జరుగుతాయా, అవి ఎంత వరకు వెళతాయి, వాటిని ఎలా నిర్వహిస్తారు అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న.
మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండవ ప్రపంచ యుద్ధం కానీ.. వాటి తర్వాత నెలకొన్న పరిస్థితులే మళ్ళీ నెలకొంటాయా అనే సందేహాలకు ప్రొఫెసర్ గోల్డిన్ దగ్గర కొన్ని సమాధానాలు ఉన్నాయి.
“1918 తర్వాత లాగే ఇప్పుడు కూడా బలహీనమైన అంతర్జాతీయ సంస్థలు పుట్టడం, జాతీయవాదం పెరగడం, కరువుకి దారి తీయవచ్చు. లేదా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినట్లు మరింత అంతర్జాతీయ సహకారం, ఐక్య రాజ్య సమితి లాంటి సంస్థల పటిష్టం, వాణిజ్యం, ధరలపై ఒక సాధారణ ఒప్పందం (జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్), మార్షల్ ప్లాన్, బ్రెట్టన్ వుడ్స్ లాంటివి పుట్టచ్చు’’.
ప్రొఫెసర్ గోల్డిన్ ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. అయితే, దీనిని ఎవరు ముందుకు నడిపిస్తారనే అంశంపై సందేహాలు ఉన్నాయి.
“ఆశ పెట్టుకోవచ్చు కానీ, వైట్ హౌస్ దాటి నాయకత్వాన్ని చూడలేకపోతున్నాం" అని అయన అన్నారు. “చైనా ఈ విషయంలో ముందుండదు. యూరప్‌కి బ్రిటన్ నాయకత్వం వహించలేదు.”
ప్రొఫెసర్ పోర్ట్స్ కూడా ఇదే విచారాన్ని వ్యక్తం చేశారు. 2009లో లండన్‌లో జరిగిన జి20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అంతర్జాతీయ సహకారానికి 1 ట్రిలియన్ డాలర్ల నిధిని ప్రకటించారు. ఇప్పుడు జి20 కి నాయకత్వం వహించే వారెవరూ లేరు. అమెరికా ఎక్కడా ఈ వేదిక మీద కన్పించటం లేదు.
అయితే, ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచీకరణ ఆగిపోతుందా?
ఆగకపోవచ్చు. ఆర్ధిక అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది కానీ పూర్తిగా ఆగిపోవడం జరగదు.
మనం ఈ పరిస్థితుల నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా అనేదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న పెద్ద ప్రశ్న.
ఇప్పటికైనా ప్రపంచీకరణలో ఉన్న సమస్య మూలాల్ని గుర్తించి వాటిని నివారించేందుకు కృషి చేస్తామా?
అలా చేయడానికి కావల్సిన నాయకత్వం, సహకారంలో అయితే కొరత కనిపిస్తోంది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: చైనా కిట్లను, మాస్కులను తిరస్కరిస్తున్న యూరప్ దేశాలు
- కరోనావైరస్: భారత్ లో కోవిడ్-19 ను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు
- కరోనావైరస్: కోవిడ్ రోగుల కోసం రూ. 50 వేలకే వెంటిలేటర్ చేయడం సాధ్యమేనా... భారత యువ ఇంజనీర్ల కృషి ఫలిస్తుందా?
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన వైరస్, 12 వేలు దాటిన మృతులు... తప్పు ఎక్కడ జరిగింది?
- నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ మర్కజ్: కరోనావైరస్ వ్యాప్తి చర్చలో కేంద్ర బిందువుగా మారిన తబ్లీగీ జమాత్ ఏం చేస్తుంది?
- కరోనావైరస్ వల్ల చిన్నపిల్లలకు, టీనేజర్లకు కూడా ముప్పు ఉందా?
- కరోనావైరస్: దిల్లీ నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ సదస్సుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంది వెళ్ళారు?
- కార్ల్ మార్క్స్ చెప్పిన ఈ నాలుగు సిద్ధాంతాలకు నేటికీ తిరుగులేదు
- కరోనావైరస్: చైనాను దాటిపోయిన భారత్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
- కరోనావైరస్: ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ కోవిడ్-19 కేసులు నమోదవడానికి కారణాలేంటి?
- కరోనావైరస్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – ప్రభుత్వ మార్గదర్శకాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








