కరోనా లాక్‌డౌన్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – నెదర్లాండ్స్ ప్రభుత్వ మార్గదర్శకాలు

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ మహమ్మారి సమయంలో సాన్నిహిత్యం పెంచుకోవాలని, ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోవాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం దేశంలోని ఒంటరి వ్యక్తులకు కొత్త మార్గదర్శకాలు జారీచేసింది.
ఒంటరిగా జీవిస్తున్న వారు మరో వ్యక్తితో ఒప్పందం చేసుకోవాలని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ ద ఎన్విరాన్‌మెంట్ (ఆర్ఐవీఎం) చెప్తోంది.
అయితే.. జంటలో ఎవరైనా ఒకరికి కరోనావైరస్ ఉందని అనుమానం ఉంటే సెక్స్‌లో పాల్గొనవద్దని సలహా ఇచ్చింది.
ఒంటరి మనుషులకు సెక్స్ సలహాలు ఏమీ లేవని విమర్శలు రావటంతో ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.
నెదర్లాండ్స్‌లో మార్చి 23వ తేదీ నుంచి సామాజిక దూరం ఆంక్షలు, ‘లక్షిత’ లాక్‌డౌన్ అమలులో ఉన్నాయి.
అయితే ఈ నిబంధనలు పొరుగు దేశాల కన్నా తక్కువ కఠినంగా ఉన్నాయి. సామాజిక దూరం పాటించేట్లయితే చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి ఉంది.
ఈ నేపథ్యంలో మే 14వ తేదీన ఆర్ఐవీఎం జారీ చేసిన మార్గదర్శకాల్లో.. ‘‘ఒంటరి వ్యక్తులు శారీరక సంబంధం కూడా కావాలని కోరుకోవటం అర్థం చేసుకోతగ్గతదే’’ అని పేర్కొంది.
ఒంటరి వ్యక్తులు లైంగిక సంబంధాల్లో పాల్గొనదలచుకున్నట్లయితే.. కరోనావైరస్ సోకే ముప్పును తగ్గించటానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పింది.
‘‘ఈ పని చేయటం ఎంత మంచిదో కలిసి చర్చించండి. ఉదాహరణకు.. మీకు వ్యాధి లేకపోయినట్లయితే మీరు శారీరక లేదా లైంగిక సంబంధం కావాలనుకుంటున్న వ్యక్తిని (సెక్స్ బడ్డీని) కలవండి’’ అని సూచించింది.
‘‘ఆ వ్యక్తితో మాట్లాడి మంచి ఏర్పాట్లు చేసుకోండి. మీరిద్దరూ వేరే వ్యక్తులు ఇంకా ఎంత మందిని కలుస్తారు అనే అంశాలను పరిగణనలోకి తీసుకోండి. మీరు ఎంత ఎక్కువ మందిని కలిస్తే.. కరోనావైరస్ వ్యాపించే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది’’ అని పేర్కొంది.

ఫొటో సోర్స్, REUTERS
తమ దీర్ఘకాలిక భాగస్వాములు తమకు కరోనావైరస్ సోకిందని అనుమానించే వారి కోసం కూడా ఆర్ఐవీఎం సలహాలు జారీ చేసింది.
‘‘మీ భాగస్వామి కరోనావైరస్ సోకిందనే అనుమానంతో ఐసొలేషన్‌లో ఉన్నట్లయితే.. వారితో సెక్స్‌లో పాల్గొనకండి’’ అని చెప్పింది.
‘‘మీతో మీరు కానీ, ఇతరులతో కానీ దూరం నుంచి సెక్స్ చేసుకోవటం సాధ్యమవుతుంది. లైంగిక ఉద్రేకాన్నిచ్చే కథలు, కలిసి హస్తప్రయోగం చేసుకోవటం వంటివి సాధ్యమయ్యే పరిష్కారాలు’’ అని కూడా సూచించింది.
నెదర్లాండ్స్ లాక్‌డౌన్‌ను తొలగించటానికి ఐదు దశల ప్రణాళికలో మొదటి దశను సోమవారం నాడు ప్రారంభించింది.
తొలి దశలో భాగంగా మే 11 నుంచి లైబ్రరీలు, హెయిర్‌డ్రెసర్లు, నెయిల్ బార్లు, బ్యూటీషియన్లు, మసాజ్ సెలూన్లు, వృత్తిపరమైన థెరపీ అందించే కేంద్రాలను తెరవటానికి అనుమతించారు.
కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్యను తగ్గించటంలో దేశం పురోగతి సాధించిందని ప్రధానమంత్రి మార్క్ రూట్ చెప్పిన అనంతరం ఆంక్షల సడలింపు మొదలైంది.
నెదర్లాండ్స్‌లో గత 24 గంటల్లో కొత్తగా 200 కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ మొత్తంగా 43,880 మందికి కరోనావైరస్ నిర్ధారణ అయింది. దాదాపు 5,500 మంది చనిపోయారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్‌డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- కరోనావైరస్: వుహాన్‌లో ప్రజలందరికీ 10 రోజుల్లో పరీక్షలు చేయడం చైనాకు సాధ్యమేనా?
- కరోనావైరస్: కోయంబేడు మార్కెట్ నుంచి కోనసీమకు... ‘ఏపీలోని 10 జిల్లాలకు దిగుమతి’
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








