కరోనావైరస్: ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ కోవిడ్-19 కేసులు నమోదవడానికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సచిన్ గొగోయ్
- హోదా, బీబీసీ మానిటరింగ్
కరోనావైరస్ కేసుల విస్తృతిని అదుపులో ఉంచడంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఈశాన్య రాష్ట్రాల రికార్డు మెరుగ్గా ఉంది. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈనెల 14న ప్రకటించిన గణాంకాలను పరిశీలిస్తే అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు వైరస్‌ను నియంత్రించడంలో బాగా పని చేస్తున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం ఆ 8 రాష్ట్రాల్లో సుమారు 4 కోట్ల57 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రతి 1,81,624 మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే వైరస్ సోకింది. కానీ మిగిలిన దేశ జనాభా విషయానికొచ్చేసరికి ఈ గణాంకాలు భయాన్ని కల్గించేలా ఉన్నాయి. ప్రతి 15,514 మందిలో ఒకరు వైరస్ బారిన పడ్డారు.
మే 14 నాటికి నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్‌లో మాత్రమే కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 రాష్ట్రాల్లో అత్యధికంగా త్రిపురలో 155 కేసులు గుర్తించగా, 80 కేసులతో ఆ తర్వాత స్థానంలో అసోం ఉంది. 13 కేసులతో మేఘాలయా మూడో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Barcroft Media
గీత దాటని జనం, సమర్థవంతంగా లాక్ డౌన్ అమలు
భౌతిక దూరం పాటించడంలోనూ, లాక్ డౌన్ సమయంలో క్రమశిక్షణగా వ్యవహరించడంలోనూ అటు మీడియా నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ప్రజలు ప్రశంసలందుకున్నారు. దేశంలో ఎక్కడ చూసినా లాక్ డౌన్ ఉల్లంఘనలు సర్వ సాధారణమైపోయినా అక్కడ మాత్రం ప్రజలకు ఎక్కడా నియమాలను అతిక్రమించలేదు.
కోవిడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వ్యవహరించిన తీరును దేశమంతా ఆదర్శంగా తీసుకోవాలని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి జితేందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ప్రజల తీరు కారణంగానే అక్కడ కేసుల సంఖ్య తక్కువగా ఉందని స్థానిక ఆంగ్ల వెబ్‌సైట్‌తో ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు భౌతిక దూరాన్ని ఎలా పాటిస్తున్నారో తెలిపే చాలా వీడియోలు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మణిపూర్ రాష్ట్రంలో నిత్యావసరాల కోసం జనం చాలా పద్ధతిగా క్యూలైన్లలో నిల్చొని భౌతిక దూరం పాటిస్తూ ఒక్కొక్కరూ వెళ్లి తీసుకోవడం, వాటిని అందించే వారు కూడా చేతులు జోడించి వారికి నమస్కరిస్తున్న వీడియో ఈ మధ్య కాలంలో విశేషంగా ప్రాచుర్యం పొందింది.
అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు మణిపూర్‌లో ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఏకంగా 80 ప్రత్యేక కుటీరాలను నిర్మించారన్న వార్త కూడా మీడియాలో వచ్చింది.
లాక్ డౌన్ సందర్భంగా మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో నిర్మానుష్యంగా మారిన రోడ్ల ఫోటోలను చాలా మంది ఫేస్ బుక్‌లో షేర్ చేసారు. విశేషమేంటంటే అక్కడ ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క కేసు నమోదయ్యింది.
నిజానికి మిజోరాంలోని మిజో సామాజిక వర్గం భౌతిక దూరం అన్న మాటకే పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ల సమాజంలో రోజూ ఒకరినొకరు కలవడం అన్నది తప్పనిసరి వ్యవహారం. అయినప్పటి కోవిడ్-19 మహమ్మారి వల్ల వచ్చే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా లాక్ డౌన్‌ను పాటించామని స్థానికులు చెప్పినట్టు మరో న్యూస్ వెబ్ సైట్ ఈస్ట్ మోజో తెలిపింది.

ఫొటో సోర్స్, TWITTER/HIMANTABISWA
క్రియాశీలంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా క్రియాశీలంగా వ్యవహరించాయి. సుమారు 3 కోట్ల జనాభా ఉన్న అతి పెద్ద ఈనాశ్య రాష్ట్రం అసోంలో ఈ బాధ్యతను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వ శర్మ తీసుకున్నారు. ఆయనే ముందుండి నడిపించారు.
దేశంలోనే అతి తక్కువ కేసులు నమోదైనప్పటికీ రాష్ట్ర ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరించింది. తమ వైద్య సిబ్బంది కోసం నేరుగా చైనా కంపెనీలతో మాట్లాడి పీపీఈ కిట్లను తెప్పించుకున్న తొలి రాష్ట్రం అసోం. ఆ రాష్ట్రంలో తొలి కేసు నమోదయ్యే నాటికి అంటే మార్చి 30 నాటికే 700 పడకల క్వారంటైన్ కేంద్రాన్ని ఓ స్టేడియంలో ఏర్పాటు చేసిందంటే కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆ రాష్ట్రం ఎంత సన్నద్ధతను చూపిందో అర్థమవుతోంది.
అయితే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని కోవిడ్ కేసుల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసే పేరుతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి హెలీకాప్టర్లో తిరుగుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మిగిలిన ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో కఠినమైన విధానాలను అవలంబించాయి. ఉదాహరణకు మార్చి 25 నుంచి దేశంలో లాక్ డౌన్ మొదలయ్యింది. కానీ అంత కన్నా దాదాపు 19 రోజుల ముందే అంటే మార్చి 6 నుంచే తమ రాష్ట్రంలోకి విదేశీయల రాకపోకల్ని సిక్కిం నిషేధించింది. ఏ ఒక్కరైనా వైరస్ స్క్రీనింగ్ పరీక్షల్నిచేయించుకోకుండా తమ రాష్ట్రంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ మే 7న హెచ్చరించినట్టు ఎన్డీటీవి ఆంగ్ల ఛానెల్ వెల్లడించింది.
ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ త్రిపురలో అత్యధికంగా 155 కేసులు నమోదయ్యాయి. నిజానికి ఏప్రిల్ నెలాఖరునాటికి ఆ రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కోవిడ్ రోగులు వ్యాధి బారి నుంచి విజయవంతంగా బయటపడిన తర్వాత కోవిడ్ రహిత రాష్ట్రంగా తమను తాము ప్రకటించుకుంది త్రిపుర. ఎన్డీటీవీ రిపోర్ట్ ప్రకారం త్రిపురలోని పది లక్షల మంది జనాభాలో1,051 మందికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది జాతీయ సగటుతో పోల్చితే రెట్టింపు కన్నా ఎక్కువ. అయితే అక్కడ బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ క్యాంప్‌లో ఒక్కసారిగా కేసులు బయటపడటంతో ఆ రాష్ట్రంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య భారీగా పెరిగింది.
లాక్ డౌన్ సమయంలో ఇక్కడ పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించారు. లాక్ డౌన్‌ను పాటించని వారిని స్థానిక పోలీసులు కొడుతున్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగానే వైరల్ అయ్యాయి. వారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి కూడా.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్నేషనల్ కనెక్టివిటి తక్కువగా ఉండటం కలిసొచ్చింది
సింగపూర్, థాయిలాండ్, భూటాన్ వంటి దేశాలకు మాత్రమే ఈశాన్య రాష్ట్రాల నుంచి నేరుగా రాకపోకల సదుపాయం ఉంది. బహుశా అక్కడ తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
“తీవ్రంగా ప్రభావితమైన చైనా, ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాలతో దేశంలోని ఇతర నగరాలకు ఉన్నట్టు నేరుగా రాకపోకల సౌకర్యం ఈశాన్య రాష్ట్రాలకు లేదు. అందుకే ఈ ప్రాంతంలో వైరస్ చాలా ఆలస్యంగా అడుగుపెట్టింది” అని అసోంలోని DY-365 న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న సీనియర్ పాత్రికేయులు కుమద్ దాస్ చెప్పారు.
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన మేథావి వర్గాలు కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. “ అంతర్జాతీయ విమానాశ్రాయాలు ఎక్కువగా లేకపోవడం, విదేశాల నుంచి నేరుగా రాకపోకలకు అవకాశాలు లేకపోవడం ఈశాన్య రాష్ట్రాలకు వరంగా మారింది” అని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: చైనాను దాటిపోయిన భారత్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
- కరోనావైరస్: ఆరోగ్యసేతు యాప్ వివాదాస్పదం కావడానికి కారణాలేంటి?
- విశాఖ గ్యాస్ లీక్: తుప్పు పట్టిన పైపులు, అనుమతులు లేని కార్యకలాపాలు... ప్రమాద కారణాలపై బీబీసీ పరిశోధన
- కరోనావైరస్: గర్భంతో ఉన్న విద్యార్థి సఫూరా జర్గర్‌ను ఎందుకు జైల్లో పెట్టారు?
- కరోనావైరస్ లాక్డౌన్: జైలు నుంచి విడుదలైనా ఇంటికి వెళ్ళలేకపోతున్న ఖైదీ కథ
- 1857 సిపాయిల తిరుగుబాటు: దిల్లీ నగరం ‘మృత్యు తాండవం’ చూసిన రోజు
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన ఐదు ఫుడ్ టిప్స్
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం: స్టైరీన్ ప్రభావం పర్యావరణంపై ఎంత కాలం ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








