కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - బ్రిటన్ పరిశోధకులు

కరోనావైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పినవారిలో రుచి, వాసన సామర్థ్యం తగ్గిందని తెలిపినవారు 59 శాతం మంది ఉన్నారు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చని బ్రిటన్ పరిశోధకులు అంటున్నారు.

కోవిడ్-19 అనుమానిత లక్షణాలున్న నాలుగు లక్షలకుపైగా మంది ఓ మొబైల్ యాప్‌లో ఇచ్చిన సమాచారాన్ని లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన బృందం విశ్లేషించి, ఈ విషయం చెప్పింది.

జలుబు లాంటి సాధారణమైన శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడు కూడా రుచి, వాసన సామర్థ్యాలు తగ్గిపోతుంటాయి.

కరోనావైరస్ సోకినవాళ్లలో జ్వరం, దగ్గు ప్రధానంగా కనిపించే లక్షణాలని నిపుణులు చెబుతున్నారు.

సుదీర్ఘంగా దగ్గు, అధిక శరీర ఉష్ణోగ్రతతో బాధపడుతున్నవాళ్లు ఇళ్లకే పరిమితం కావాలని, కరోనావైరస్‌ వ్యాపించే ముప్పును ఇలా తగ్గించవచ్చని అంటున్నారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

విశ్లేషణలో ఏం తేలింది?

కరోనావైరస్ సోకినప్పుడు ఏయే లక్షణాలు ఉండే అవకాశం ఉందన్నదాని గురించి సమాచారం సేకరించాలని కింగ్స్ కాలేజీ పరిశోధకులు భావించారు.

ఓ మొబైల్ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని వారు సేకరించారు.

కరోనావైరస్ లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నవారైనా ఈ యాప్‌లో సమాచారం సమర్పించాలని కోరారు.

వాళ్లు ఏం చెప్పారంటే..

  • 53 శాతం మంది తాము నిస్సత్తువ (అలసట)తో ఉన్నట్లు చెప్పారు
  • 29 శాతం మంది సుదీర్ఘంగా దగ్గు ఉందని తెలిపారు
  • 28 శాతం మంది ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పారు
  • 18 శాతం మంది రుచి, వాసన సామర్థ్యాలు తగ్గాయని అన్నారు
  • 10.5 శాతం మంది జ్వరం ఉందని తెలిపారు

ఆ నాలుగు లక్షల మందిలో 1,702 మంది తాము కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. వారిలో కరోనావైరస్ ఉన్నట్లు తేలిందని 579 మంది, లేదని తేలిందని 1,123 మంది చెప్పారు.

తమకు కరోనావైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పినవారిలో రుచి, వాసన సామర్థ్యం తగ్గిందని తెలిపినవారు 59 శాతం మంది ఉన్నారు.

రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడాన్ని ప్రధాన లక్షణాల్లో చేర్చేందుకు ఇంకా తగినన్ని ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడాన్ని ప్రధాన లక్షణాల్లో చేర్చేందుకు ఇంకా తగినన్ని ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు

రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడాన్ని కూడా కోవిడ్-19 ప్రధాన లక్షణాల్లో చేర్చాలా?

దీనికి ఇంకా తగినన్ని ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా కోవిడ్-19 లక్షణాల్లో వీటిని చేర్చలేదు.

కరోనావైరస్ సోకినవారికి రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడంలో ఆశ్చర్యమేమీ లేదని బ్రిటన్‌లోని గొంతు, ముక్కు, చెవి వైద్యుల సంఘం ఈఎన్‌టీ యూకే వ్యాఖ్యానించింది. అయితే, ఇవి వారిలో మాత్రమే ప్రత్యేకంగా కనిపించే లక్షణాలు కావని పేర్కొంది.

జ్వరం, దగ్గు లాంటి ప్రధాన లక్షణాలు ఉన్నవారు అదనంగా రుచి, వాసన సామర్థ్యాలు తగ్గితే మరింత జాగ్రత్తపడాలని కింగ్స్ పరిశోధకులు చెబుతున్నారు.

‘‘మిగతా లక్షణాలున్నవారి కన్నా.. వాటికి అదనంగా రుచి, వాసన సామర్థ్యాలు కోల్పోయినవాళ్లకు కోవిడ్-19 ఉండే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు మా సమాచారం చెబుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అలాంటి వాళ్లు స్వీయ నిర్బంధం పాటించాల్సిన అవసరం ఉంది’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ అన్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)