వివిధ దేశాల్లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలు: ‘ఆడవాళ్లు బయటకు వచ్చే రోజు మగవాళ్లు రాకూడదు.. భార్యలు భర్తల్ని విసిగించొద్దు’

కుక్కను బయటకు తీసుకెళ్లేందుకు ఒక గంట అనుమతి ఇచ్చిన సెర్బియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కుక్కలను బయటకు తీసుకెళ్లేందుకు ఒక గంట అనుమతి ఇచ్చిన సెర్బియా

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టాడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు రక రకాల పద్ధతులని అవలంబిస్తున్నాయి. కొన్ని చోట్ల తీవ్ర నిర్బంధం విధిస్తే, కొన్ని చోట్ల తేలికపాటి నిర్బంధనలు, మరి కొన్ని చోట్ల కొన్ని వినూత్న విధానాలతో కూడిన నిర్బంధనలు విధిస్తున్నారు.

వివిధ విదేశాలు అవలంబిస్తున్న వినూత్న విధానాలను బీబీసీ పరిశీలించింది.

పనామా

మధ్య అమెరికా దేశం పనామా చాలా కఠినమైన నిర్బంధాన్ని ప్రకటిస్తూ, ప్రజల కదలికలను లింగం ఆధారంగా విభజించింది. పనామాలో ఇప్పటికి 1000కి పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి.

పురుషులు, స్త్రీలు, వేర్వేరు రోజుల్లో రోజుకి రెండు గంటలు మాత్రమే బయటకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆదివారం నాడు మాత్రం ఎవరూ బయటకి వెళ్ళడానికి వీలు లేదు.

‘ఈ నిర్బంధం కేవలం మీ ప్రాణాలు కాపాడడానికే’ అని పనామా రక్షణ మంత్రి యుఆన్ పినో ఒక పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.

పనామాలో లింగం ఆధారంగా ఆంక్షలు విధించారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పనామాలో లింగం ఆధారంగా ఆంక్షలు విధించారు

కొలంబియా

కొలంబియాలో ప్రజలు వారి జాతీయ గుర్తింపు సంఖ్య ఆధారంగా బయటకి వెళ్లే అవకాశం కల్పించారు.

ఉదాహరణకి ఒక ప్రాంతంలో 0,7,4 ముగింపు సంఖ్యలతో గుర్తింపు కార్డు ఉన్నవారు సోమవారం బయటకి వెళితే, 1,8,5 సంఖ్యతో ఉన్నవారు బుధవారం వెళ్లే వీలుంటుంది.

బొలీవియా కూడా ఇదే విధానాన్ని అమలు చేసే ఆలోచనలో ఉంది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

సెర్బియా

సెర్బియా రాత్రి 8 నుంచి 9 వరకు కుక్కలని బయటకి తీసుకుని వెళ్లవచ్చని సడలింపు ఇచ్చింది. కానీ, కుక్కల యజమానులు నుంచి వచ్చిన నిరసనతో ఆ సమయాన్ని పూర్తిగా సడలించింది.

కుక్కలని సాయంత్రం బయటకి తీసుకుని వెళ్లకపోతే, మూత్రాశయ సమస్యలు వచ్చి, అవి ఇంటిలో మరింత అపరిశుభ్రకర పరిస్థితులకి దారి తీయవచ్చని ఒక వెటర్నిరీ డాక్టర్ చెప్పారు.

సామాజిక దూరం పాటించడం చాలా దేశాల్లో ఇప్పుడు సర్వ సాధారణం కానీ బెలారస్ లో మాత్రం కాదు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సామాజిక దూరం పాటించడం చాలా దేశాల్లో ఇప్పుడు సర్వ సాధారణం కానీ బెలారస్ లో మాత్రం కాదు

బెలారస్

బెలారస్ అధ్యక్షుడు అలెక్సాన్డెర్ లుకాషుంకో కరోనావైరస్ పట్ల పెద్దగా దృష్టి సారించలేదు. వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన సలహాని కొట్టి పడేసి, వైరస్ గాలిలో ఎగురుతున్నట్లు కనిపించటం లేదని వేళాకోళం చేసారు.

ఒక ఇండోర్ ఐస్ హాకీ మ్యాచ్ చూడటానికి వచ్చిన సందర్శకులని చూపిస్తూ స్టేడియం లోపల ఉన్న చల్లదనం వైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడుతుందని ఒక టీవీ రిపోర్టర్‌తో అన్నారు.

కరోనా వైరస్ కంటికి కనపడనంత మాత్రాన ఇది వ్యాప్తి చెందకుండా ఉంటుందనేది చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

బెలారస్ మాత్రం తమ దేశంలో జరిగే క్రీడా కార్యక్రమాలపై ఎటువంటి నిషేధం విధించలేదు.

"ఇక్కడేమి వైరస్ లు లేవు’’ అని లుక షెన్కో అన్నారు.

‘‘అవి మీ చుట్టూ ఎగరడం చూశారా? మీరు చూశారా? నేను కూడా చూడలేదు. ఇదొక ఫ్రిడ్జ్. ఇక్కడున్నది ఐస్, అంటే ఫ్రిడ్జ్. ఇదే వైరస్‌కి మందు" .

తరచుగా వోడ్కా తాగుతూ ఆవిరి స్నానం చేస్తే వైరస్ మాయమైపోతుందంటూ నిపుణుల సలహాలకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు.

స్వీడన్

స్వీడన్ లో 4500కి పైగా కరోనా కేసులు నమోదు అయినప్పటికీ మిగిలిన యూరోప్ దేశాలు అవలంబించిన విధానాలు ఏవి స్వీడన్ పాటించలేదు.

ప్రజలే అర్ధం చేసుకుని మెలుగుతారని, వారికి ఏది మంచిదో వారే నిర్ణయించుకుంటారని స్వీడన్ ప్రభుత్వం భావిస్తోంది.

50 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలని నిషేధించారు. కానీ, 16 ఏళ్ల లోపు పిల్లల స్కూళ్ళకి మాత్రం సెలవులు ప్రకటించలేదు.

పబ్‌లు ఇంకా తెరిచే ఉన్నాయి. ప్రజలు సాధారణ పరిస్థితుల లానే బయట తిరుగుతున్నారు.

ఈ విధానం పట్ల భిన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నప్పటికీ, స్వీడన్ అవలంబిస్తున్న విధానం తిప్పి కొడుతుందా లేదా అనేది కేవలం సమయం మాత్రమే చెప్పగలదు.

సూపర్ మార్కెట్లలో మాస్క్‌లు వేసుకోవడం తప్పనిసరని ఆస్ట్రియా ఆదేశాలు జారీ చేసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూపర్ మార్కెట్లలో మాస్క్‌లు వేసుకోవడం తప్పనిసరని ఆస్ట్రియా ఆదేశాలు జారీ చేసింది

మలేషియా

మలేషియా ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా ప్రజలకి ఇచ్చిన సందేశం తీవ్ర నిరసనలు ఎదుర్కొంది.

దేశంలో అమలులో ఉన్న పాక్షిక నిర్బంధం సమయంలో మహిళలని తయారు కావాలని, మేకప్ వేసుకోవాలని, భర్తలని విసిగించవద్దని మలేషియా మహిళా మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన పోస్టర్ల పట్ల తీవ్ర నిరసన ఎదురైంది.

వీటి పట్ల సోషల్ మీడియాలో ఎదురైన నిరసనలతో మంత్రిత్వ శాఖ ఆ పోస్టర్లను ఉపసంహరించింది.

ఆస్ట్రియా

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అవసరం లేకుండా మాస్క్‌లు వేసుకోనక్కర లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసినప్పటికీ ఆస్ట్రియా ప్రభుత్వం మాత్రం ఆ దేశపు సూపర్ మార్కెట్లలో మాస్క్‌లు వేసుకోవడం తప్పనిసరని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిబంధనల్ని ఆస్ట్రియా ఛాన్సలర్ సెబాస్టియన్ క్రజ్ జారీ చేశారు. ఆసియాలో మాస్కులు వాడటం తరచుగా కనిపించే ప్రక్రియ అయినప్పటికీ యురోపియన్ దేశాల్లో మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేసిన దేశాల్లో ఆస్ట్రియా నాల్గవది. చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, బోస్నియా, హెర్జెగోవినా దేశాలు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.