హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?

హ్యాండ్ శానిటైజర్

ఫొటో సోర్స్, KOEN VAN WEEL

ఫొటో క్యాప్షన్, హ్యాండ్ శానిటైజర్
    • రచయిత, స్టెఫానీ హెగార్టీ
    • హోదా, పాపులేషన్ కరస్పాండెంట్, బీబీసీ

ప్రపంచవ్యాప్తంగా శానిటైజర్లకు కొరత ఏర్పడింది. ఆన్‌లైన్‌లోనూ అరుదుగా దొరుకుతున్నాయి. అది కూడా కొద్ది మంది విక్రేతలే వీటిని విక్రయిస్తుండడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి.

కరోనావైరస్ సోకకుండా ఉండాలంటే తరచూ చేతులు కడుక్కోవాలని.. శానిటైజర్‌ రాసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

కానీ, శానిటైజర్ దొరకడమే గగనమైపోయింది.ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఒక చిన్న శానిటైజర్ సీసా కావాలంటే 38.5 కోట్ల లీటర్ల శానిటైజర్ అవసరమవుతుంది.

కరోనావైరస్ ప్రబలడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా కేవలం 3 లక్షల లీటర్ల శానిటైజర్ మాత్రమే తయారయ్యేదని ‘ఆరిటన్ అడ్వైజరీ అండ్ ఇంటిలిజెన్స్’కు చెందిన మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు.

అంటే ఇప్పుడు అవసరం అనుకుంటున్న 38.5 కోట్ల లీటర్లలో ఇది వెయ్యో వంతు కంటే కూడా తక్కువ.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

‘సోల్డ్ అవుట్’

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల కోసం కనుక ఆన్‌లైన్లో చూస్తే అన్నీ ‘సోల్డ్ అవుట్’ అనే కనిపిస్తాయి.

బ్రిటన్‌లో అమెజాన్ వైబ్‌సైట్లో చూస్తే కొద్దిరోజుల కిందట వరకు ఒక విక్రయ సంస్థ అమ్మేది.. అర లీటరు సీసా 30 పౌండ్ల(సుమారు రూ.2700) ధర ఉండేది. ఫిబ్రవరి నాటి ధరతో పోల్చితే ఇది 10 రెట్లు ఎక్కువ.

ఇప్పుడు 20 పౌండ్ల ధర ఉన్నప్పటికీ అది కూడా కరోనా ప్రబలడానికి ముందున్న ధర కంటే బాగా ఎక్కువ.

ఇలా అధిక ధరకు విక్రయిస్తున్న అమ్మకందారులను విమర్శించడం సులభమే, నిజానికి ఆ వస్తువు కింద చాలామంది తమ రివ్యూల్లోనూ ధర అధికంగా ఉందంటూ విరుచుకుపడుతున్నారు.

కానీ, ఆ శానిటైజర్‌ను విక్రయిస్తున్న కంపెనీ ‘హెర్ట్స్ టూల్స్’ మాత్రం ఇదంతా అనుకున్నంత సులభమైన వ్యవహారం కాదంటోంది.

సోల్డ్ అవుట్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సోల్డ్ అవుట్

‘‘తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నాం మేం. ఈ పరిస్థితిని మేం సొమ్ము చేసుకుంటున్నామని జనం అంటున్నారు. కానీ, అది నిజం కాదు. నష్టాలు పాలవకుండా సరిపడా లాభాలు మాత్రమే తీసుకుంటున్నాం’’ అన్నారు ఆ సంస్థకు చెందిన పాల్ స్టీఫెన్సన్.

‘హెర్ట్స్ టూల్స్’ నిజానికి నిర్మాణ రంగంలో వాడే పరికరాలను విక్రయించడం, అద్దెకివ్వడం చేస్తుంటుంది. కానీ, వినియోగదారులు శానిటైజర్లు కావాలని కోరుతుండడంతో వాటి విక్రయం ప్రారంభించిందీ సంస్థ.

అయితే, ధర రోజురోజుకీ పెరిగిపోతుండడంతో తగినన్ని దొరకడం లేదని.. ఈ రోజు కొన్న ధరకు రేపు కొంటామని తాము కూడా చెప్పలేకపోతున్నామని స్టీఫెన్సన్ అన్నారు.శానిటైజర్ తయారీలో వాడే ప్రధాన పదార్థం ఆల్కహాల్ ధర భారీగా పెరగడమే దీనికి కారణమంటున్నారాయన.

‘హెర్ట్స్ టూల్స్’ తాను విక్రయిస్తున్న శానిటైజర్లను యూకేలోని చర్మ సౌందర్య సాధనాల తయారీ సంస్థ జిడాక్ లేబరెటరీస్ నుంచి కొంటోంది.

జిడాక్‌కు రోజుకు 1,50,000 సీసాల శానిటైజర్లను తయారుచేసే సామర్థ్యం ఉంది. కానీ, గత రెండు వారాలుగా ఉత్తత్తి తగ్గిపోయింది.

అందుకు కారణం ఇథనాల్, ఆల్కహాల్‌లు సరిపడా దొరక్కపోవడమే.

శానిటైజర్ తయారీ

ఫొటో సోర్స్, PA MEDIA

ఫొటో క్యాప్షన్, శానిటైజర్ తయారీ

ధరలు భారీగా పెరిగాయి

32 వేల సీసాల శానిటైజర్లు తయారుచేయడానికి సరిపడే టన్ను ఇథనాల్‌ను గతంలో 700 డాలర్లకే కొనేవారు ఇప్పుడు 7 వేల నుంచి 10 వేల డాలర్ల ధర పలుకుతోంది.

పారిశ్రామిక ఆల్కహార్ సరఫరా చేసే కొందరు డిస్ట్రిబ్యూటర్లకు బీబీసీ ఫోన్ చేసింది.

వారిలో ఒకరు మాట్లాడుతూ.. సరఫరా చేయడానికి సరకు లేక సంస్థను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చెప్పారు.

రోజురోజుకీ ఆర్డర్లు పెరిగిపోతున్నాయని.. కానీ, వారికి సరఫరా చేయడానికి తమ వద్ద సరకు లేకపోవడంతో ఆర్డర్లు తీసుకోవడం లేదని మరో డిస్ట్రిబ్యూటర్ చెప్పారు.

కొలంబోలో ఒక పెళ్లిలో హ్యాండ్ శానిటైజర్ వాడుతున్న అతిథులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొలంబోలో ఒక పెళ్లిలో హ్యాండ్ శానిటైజర్ వాడుతున్న అతిథులు

తయారీ సంస్థలు ఆ దేశాల్లోనే..

శానిటైజర్లలో ఇథనాల్ కానీ ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ కానీ వాడుతారు. ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌ను పారిశ్రామిక అవసరాలు నెరవేర్చే స్థాయిలో తయారుచేసే సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి.

భారీ మొత్తంలో ఐసోప్రొఫైల్‌ను తయారుచేసే సంస్థలన్నీ చైనా, యూకే, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్‌లో ఉన్నాయి.

ఫ్రాన్సులో తయారయ్యే ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ మొత్తం దేశంలోనే ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. మిగతా దేశాలూ అదే మార్గం అనుసరించొచ్చు.

అయితే, ‘‘అంతా ఒక్కటిగా ఉండాల్సిన ఐరోపాలో ఇలా చేయడం దారుణం’’ అన్నారు నెదర్లాండ్స్‌కు చెందిన రసాయనాల సరఫరా సంస్థ ‘డచ్2’కి చెందిన స్టీవెన్ విలెక్స్.

ఏ దేశంలోనైనా ఐపోప్రొఫైల్ ఆల్కహాల్ సొంత నిల్వలు లేకపోతే అక్కడ ముందుముందు శానిటైజర్లు దొరకడం గగనమే అంటున్నారాయన.

అబ్సొల్యూట్ వోడ్కా తయారుచేసే పెర్నార్డ్ రికార్డ్ కంపెనీ కానీ, జానీ వాకర్ విస్కీ తయారుచేసే డియాగో కానీ.. ఇంకా లండన్, న్యూయార్క్, మనీలా వంటి నగరాల్లోని ఎన్నో మద్యం తయారీ సంస్థలు కానీ తమ వద్ద ఉన్న ఆల్కహాల్‌ను శానిటైజర్ తయారీ సంస్థలకు ఇవ్వడమో.. లేదంటే తామే సొంతంగా శానిటైజర్ తయారుచేయడమో చేస్తున్నాయి. దీనికి కారణం ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ కొరతే.

భారత ప్రభుత్వం కూడా తన దేశంలోని మద్యం తయారీ సంస్థలు, చెరకు పరిశ్రమను వారి వద్ద ఉన్న ఇథనాల్‌ను శానిటైజర్లు తయారుచేసే కంపెనీలకు ఇవ్వాలని ఆదేశించింది.

ఫ్రాన్స్ శానిటైజర్

ఫొటో సోర్స్, Getty Images

‘సరిపడా ఉంది కానీ..’

అమెరికాలోని చిపావా వ్యాలీ ఇథనాల్ కంపెనీకి చెందిన చాద్ ఫ్రీసే మాట్లాడుతూ.. ‘శానిటైజర్లు తయారుచేయడానికి కావాల్సినంత ఆల్కహాల్ ఉంది కానీ, అది వేర్వేరు రంగాల్లో వాడుతున్నారు’’ అన్నారు.

చాద్ కర్మాగారం ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. తమ వద్ద తయారయ్యే ఆల్కహాల్‌లో వీలైనంత ఎక్కువ మొత్తాన్ని శానిటైజర్ తయారీ కంపెనీలకు పంపుతోంది.

అయితే, చాద్ కంపెనీ ముందే చేసుకున్న ఒప్పందాల ప్రకారం మరికొందరికి పంపాల్సి ఉంది.‘‘కావాల్సినంత ఆల్కహాల్ ఉత్పత్తవుతోంది. కానీ, అది సరైన చోటికి చేరడం లేదని అనుకుంటున్నాను.

ఆల్కహాల్ తయారీ సంస్థలకు ముందే ఒప్పందాలు ఉంటాయి. దాని ప్రకారం వారు పంపుతారు. కొందరు డియాగియోకు సరఫరా చేస్తారు, మరికొందరు వేరే సంస్థకు సరఫరా చేస్తారు. అంతేకానీ, హ్యాండ్ శానిటైజర్లను తయారుచేసేవారికి కాదు’’ అన్నారాయన.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)