ఇంట్లోకి దూసుకెళ్లిన ఇరాన్ విమానం... 15 మంది మృతి

ఫొటో సోర్స్, EPA
ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర సమీపంలో ఒక కార్గో విమానం ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారని ఇరాన్ ఆర్మీ తెలిపింది.
టెహ్రాన్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని కరాజ్ నగరంలో ఉన్న ఫత్ విమానాశ్రయంలో బోయింగ్ 707 కార్గో విమానం రన్‌వే పై నుంచి సమీపంలో ఉన్న నివాస ప్రాంతంవైపు దూసుకెళ్లింది. అలా ఒక ఇంటిలోపలికి వెళ్లి ఆగిపోయింది. వాతావరణం సరిగా లేకపోవటమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో విమాన ఇంజనీర్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 15 మంది చనిపోయారు. అయితే, నేలపై ఉన్న వారెవరూ ఈ ప్రమాదంలో చనిపోలేదు.
ప్రమాదానికి గురైన విమానంలో ఉండే వాయిస్ రికార్డర్ 'బ్లాక్ బాక్స్' దుర్ఘటన ప్రాంతంలో లభించిందని స్థానిక మీడియా తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం ఇరాన్‌దేనని, చనిపోయినవారంతా ఇరాన్ దేశస్థులేనని ఆర్మీ అధికార ప్రతినిధి దేశ జాతీయ టీవీకి చెప్పారు.
మధ్య ఇరాన్ ప్రావిన్సు అల్‌బోర్జ్‌లోని ఈ ఫత్ విమానాశ్రయం ఇరాన్ సంపన్న 'రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందినది.
ఈ విమానం కిర్జిస్థాన్ రాజధాని నగరం బిష్కెక్ నుంచి మాంసాన్ని రవాణా చేస్తోంది.
ఫత్ విమానాశ్రయం, సమీపంలోనే ఉన్న పయం అంతర్జాతీయ విమానాశ్రయాలకు మధ్య ఉన్న నివాస ప్రాంతంలోని గృహాల మధ్య ప్రమాదానికి గురైన విమాన శకలాలు కాలిపోయాయి.
విమానం ఇళ్లను ఢీకొన్నప్పుడు ఆ ఇళ్లల్లో ఎవ్వరూ లేరని స్థానిక మీడియా పేర్కొంది.

ఫొటో సోర్స్, EPA
ఇరాన్‌లో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఇరాన్‌కు చెందిన అసెమన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి జార్గోస్ పర్వతాలను ఢీకొట్టింది. ఆ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది చనిపోయారు. దీంతో అసెమన్ విమానాల రాకపోకలను నిలుపుదల చేశారు.
2014 ఆగస్టులో సెపహన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్టొనొవ్ విమానం టెహ్రాన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. అందులో 40 మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాదంలో 39 మంది చనిపోయారు. ఇంజిన్ వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణమని భావించారు.
ఏళ్లపాటు కొనసాగిన అమెరికా కఠిన ఆంక్షల వల్ల ఇరాన్ కొత్త విమానాలను, కీలకమైన విడి భాగాలను కొనుగోలు చేసుకోలేకపోయింది.
అయితే, 2015లో ఇరాన్, అమెరికాల మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది. కానీ, గతేడాది మేలో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ పర్వతాల్లో కూలిన విమానం: 66మంది మృతి
- పైలట్లకు ఇంగ్లిష్ రాకపోవడమే విమాన ప్రమాదాలకు కారణమా?
- 2018లో పెరిగిన విమాన ప్రమాద మరణాలు.. ఒక్క ఏడాదే 556 మంది చనిపోయారు
- జనాభా 80 లక్షలు... మాట్లాడే భాషలు 800
- ‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
- ‘గ్యాస్’ ప్రాబ్లమ్? ఎందుకిలా వదులుతారు? దీన్ని ఆపొచ్చా?
- మేడ మీదే విమానం తయారీ
- అత్యధిక సమయం ప్రయాణించే నాన్‌స్టాప్ విమానం ఇదే
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- #గమ్యం: విమానాశ్రయాల్లో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- సిక్కిం: సుందర పర్వత సీమల్లో అద్భుత విమానాశ్రయం
- ‘మకర జ్యోతి’ నిజమా? కల్పితమా?
- కోడిగుడ్డు: 2.6 కోట్ల మంది ఎందుకు దీన్ని లైక్ చేశారు?
- తెలంగాణ క్యాబినెట్: పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు ఎప్పుడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











