టేకాఫ్ సమయంలో గోడను ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం

ఫొటో సోర్స్, AIR INDIA
కేరళలోని తిరుచ్చి నుంచి దుబాయి బయల్దేరిన ఎయిర్ ఇండియా పాసింజర్ విమానం.. రన్ వే నుంచి టేకాఫ్ తీసుకుంటూ విమానాశ్రయ గోడను ఢీకొట్టింది.
దీంతో విమానాన్ని ముంబై మళ్లించారు. అక్కడ అది సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఎయిర్ ఇండియా IX 611 విమానంలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
విమానం పైలట్లు ఇద్దరికీ కలిపి 6,500 గంటలు విమానం నడిపిన అనుభవం ఉందని ఎయిర్ ఇండియా చెప్పింది. వారిద్దరిని విధుల నుంచి పక్కనపెట్టామని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఎయిర్ ఇండియా భారత ప్రభుత్వ జాతీయ సంస్థ.
తిరుచ్చి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం తమ బోయింగ్ 737 విమానం టేకాఫ్ తీసుకున్నపుడు.. ‘‘విమానాశ్రయ ప్రహరీ గోడను తాకి ఉంటుందని విమానాశ్రయ అధికారులు గుర్తించార’’ని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఆ విమానం స్వల్పంగా దెబ్బతింది. ‘‘ఈ విషయాన్ని విమానం పైలట్‌కు తెలియజేశారు. విమానం వ్యవస్థలు మామూలుగానే పనిచేస్తున్నాయని పైలట్ నివేదించారు’’ అని ఎయిర్ ఇండియా పేర్కొంది. అనంతరం విమానాన్ని ముంబై నగరానికి మళ్లించారు.

ఫొటో సోర్స్, AIR INDIA
ఈ సంఘట గురించి విమానయాన నియంత్రణ సంస్థకు నివేదించారు. దర్యాప్తులో సహకరిస్తున్నామని ఎయిర్ ఇండియా చెప్పింది.
కొద్ది రోజుల కిందట జెట్ ఎయిర్‌వేస్ విమానంలో పైలట్లు కాబిన్ ప్రెజర్‌ను ఆన్ చేయటం మరచిపోవటంతో.. 30 మందికి పైగా ప్రయాణికులు అస్వస్థతకు గురై చికిత్స పొందాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే.
భారతదేశంలో సుదీర్ఘ కాలంగా నడుస్తున్న విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ ఇండియా 2007 నుంచి లాభాలు చూడటం లేదు.
ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థను ప్రైవేటీకరించాలన్న ప్రణాళికకు 2017 జూన్‌లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మెజారిటీ వాటాను అమ్మజూపినా కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాలేదు.
ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేవారు.. ఈ సంస్థ అప్పుల్లో సగం అంటే.. 500 కోట్ల డాలర్ల అప్పును కూడా భరించాల్సి ఉంటుంది.
మా ఇతర కథనాలు:
- ఎయిర్ ఇండియా: ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు - మంచివీ, చెడ్డవీ
- ఆసియాలో విమానయానాన్ని ఎవరు శాసిస్తున్నారు?
- 'తిత్లీ' తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్
- చరిత్ర: "నన్ను మీరు మభ్య పెట్టలేరు, నేను ఆయన శరీరంలో 34 బుల్లెట్లు దించాను"
- క్వీన్ నేని: ఆమెను గెలవలేక బ్రిటిషర్లు చేతులెత్తేశారు
- తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?
- సింగపూర్ టూ అమెరికా... 19 గంటల నాన్‌స్టాప్ జర్నీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








