ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదం: రాంగోపాల్ వర్మ వర్సెస్ పేర్ని నాని.. ఎవరి లాజిక్ ఏంటి?

రాంగోపాల్ వర్మ, పేర్ని నాని

ఫొటో సోర్స్, varma/perni nani

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ట్విటర్ వేదికగా.. దర్శకుడు రాంగోపాల్‌వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిల మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది.

ట్విటర్ వేదికగా వర్మ అడిగిన ప్రశ్నలకు మంత్రి నాని జవాబులు చెప్పారు. ఆ జవాబుల్లోని అంశాలపై వర్మ మళ్లీ స్పందిస్తూ ట్వీట్లు చేశారు.

ఆసక్తికరమైన ఆ సంభాషణలు ఇవీ...

రాంగోపాల్‌వర్మ: గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారూ.. మీరు లేదా మీ ప్రతినిధులు ఈ కింది ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని నేను వినమ్రంగా కోరుతున్నాను. సినిమాలు సహా ఏ ఉత్పత్తికైనా మార్కెట్ ధరను నిర్ణయించటంలో నిర్దిష్టంగా ప్రభుత్వం పాత్ర ఏమిటి సర్?

పేర్ని నాని: గౌరవనీయులైన రాంగోపాల్‌వర్మ గారూ... మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?

ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు. అది వినోద సేవ మాత్రమే. ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు.

సీఎం జగన్

ఫొటో సోర్స్, FB/ANDHRA PRADESH CM

ప్రభుత్వ జోక్యం

రాంగోపాల్‌వర్మ: గోధుమలు, బియ్యం, కిరోసిన్ వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఉన్నట్లయితే.. సంతులనానికి ఇటు కానీ, అటు కానీ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చుననేది నేను అర్థం చేసుకుంటాను. కానీ ఇది సినిమాలకు ఎలా వర్తిస్తుంది సర్?

పేర్ని నాని: ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.

సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.

ప్రాథమిక సూత్రం

రాంగోపాల్‌వర్మ: ఆహార ధాన్యాల్లోనైనా సరే బలవంతంగా ధరలు తగ్గించటం రైతులు మోటివేషన్ కోల్పోయేలా చేస్తుందని, తద్వారా కొరత తలెత్తుందని, నాణ్యత లోపిస్తుందని ఎకనమిక్స్ ప్రాధమిక సూత్రం. ఇదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది సర్.

పేర్ని నాని: బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.

పేర్ని నాని ట్విటర్

ఫొటో సోర్స్, Twitter/Perni Nani

సబ్సిడీ

రాంగోపాల్‌వర్మ: సినిమా కూడా పేదలకు నిత్యావసరం అని మీరు భావించేట్లయితే.. ప్రభుత్వం వైద్య, విద్య సర్వీసులకు మిగతా మొత్తాన్ని ప్రభుత్వం జేబు నుంచి చెల్లించి ఇస్తున్నట్లుగా.. ప్రభుత్వం దీనికి ఎందుకు సబ్సిడీ ఇవ్వదు?

పేర్ని నాని: సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే... మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు రాంగోపాల్‌వర్మ గారూ.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఫార్ములా

రాంగోపాల్‌వర్మ: అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, మహేష్‌బాబు వంటి హీరోల ధరలు.. నిర్మాణ వ్యయానికి – ట్రాక్ రికార్డ్ ఆధారంగా రాబడి అంచనాకు మధ్య ఉండే తేడాయే మినహా.. మరోటి కాదని మీ గౌరవనీయమైన బృందం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా.

పేర్ని నాని: హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు రాంగోపాల్‌వర్మ గారూ.

థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అధికారం

రాంగోపాల్‌వర్మ: మీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది కింది నుంచి మద్దతు ఇవ్వాలని కానీ, మా నెత్తినెక్కి కూర్చోవటానికి కాదని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ధన్యవాదాలు.

పేర్ని నాని: మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?

రాంగోపాల్ వర్మ

ఫొటో సోర్స్, twitter/Ram gopal varma

మంత్రి జవాబులపై వర్మ ప్రతిస్పందన...

ట్విట్టర్‌లో తాను అడిగిన ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని ఇచ్చిన సమాధానాలపై రాంగోపాల్‌వర్మ మళ్లీ స్పందించారు. ఆయన వ్యాఖ్యలివీ...

‘‘నాని గారు.. చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ.. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్‌ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ.. అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది.

మీరు ఎడారిలో నీళ్ళు లేని పరిస్థితి లో ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు. కానీ అది పరిస్థితిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు అనుకుంటే మార్కెట్ అనేది ఉన్నదే దానికి.. కార్ కావాలనే కోరికని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడానికే రకరకాల లగ్జరీ కార్లు తయారు చేసి ఆకర్షిస్తారు. అది తప్పని గవర్నమెంట్ వాటికి అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం.

ముడి పదార్థం 500 రూపాయలు కూడా ఖర్చవ్వని ఒక పెయింటింగ్‌ని, కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే దాంట్లో ఉన్న బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అడ్వాన్స్మెంట్ అనేది కంటిన్యువస్‌గా అన్ని వస్తువులు ఇంకా, ఇంకా బెటర్‌గా ఉండేలా ప్రయత్నించడం.. బెటరా అవునా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.’’

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ట్రాన్సపరెన్సీ మాత్రమే ప్రభుత్వానికి అవసరం...

‘‘కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్‌పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం.. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్‌కి తెలియకుండా చేసే క్రైమ్.. ఓపెన్‌గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది?

ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢిల్లీలలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్‌లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి. వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై.

గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్యం గోధుమ లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర చాలా పడిపోయినప్పుడు కానీ ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ ప్రేక్షకుల లో కానీ ఎక్కడ వచ్చిందండీ?

లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు... అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు... ఆ ట్రాన్సాక్షన్ లీగల్‌గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది.’’

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

థియేటర్లు వ్యాపార సంస్థలు...

‘‘థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని మీకు ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగంలో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో కానీ ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు.

థియేటర్లనేవి, 1905 జూన్ 19న నికెలోడియోన్ అనే ప్రపంచంలోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు.. అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు.. కావాలంటే మీ గవర్నమెంట్‌లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి.

సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్.. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా తను ఉన్న పొజిషన్ కన్నా పైకి ఎదగాలని కోరుకుంటాడు.. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు. మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు.. మీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటాడు.

అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్‌తో.. ఆ బెటర్‌గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే

థియేటర్‌లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు? వివిధ హోటల్సు లో ఆ ఆ హోటల్ వాళ్ళు వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు.’’

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

మంత్రిగా మీకు, మీ డ్రైవర్‌కు తేడా లేదా?

‘‘పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్‌కి కూడా తేడా లేదా?

పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు.. కానీ దానికోసం పేదల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న ధనికుల్ని పేదల్ని చెయ్యకూడదు.. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.

నానీ గారు నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ని.. ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ డీ కూడా తెలియదు.. కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వంలో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్‌తో నేను టీవీ డిబేట్‌కి రెడీ.. మా సినిమా ఇండస్ట్రీకి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ మిసండర్‌స్టాండింగ్ తొలగిపోవడానికి ఇది చాలా అవసరం అని నా అభిప్రాయం.. థ్యాంక్యూ’’ అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

‘‘నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యలకి సంభందించిన వివరణ ఇస్తాను. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ రాంగోపాల్‌వర్మ చివరి చేసిన ట్వీట్‌‌కు మంత్రి బదులిస్తూ.. ‘‘ధన్యవాదములు రాంగోపాల్‌వర్మ గారూ.. తప్పకుండా త్వరలో కలుద్దాం’’ అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

తర్వాత వర్మ కూడా గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని నుంచి సానుకూల స్పందన వచ్చిందని, ఇక ఈ అనవసర వివాదానికి ఇక్కడితో తెర దించాలని అనుకుంటున్నానని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)