బుల్లీ బాయి, సుల్లీ డీల్స్: యాప్‌లో ముస్లిం మహిళల వేలం ప్రధాన సూత్రధారి 18 ఏళ్ల యువతి.. అరెస్ట్ చేసిన పోలీసులు

బుల్లి బాయి

ఫొటో సోర్స్, Getty Images

వంద మందికి పైగా ముస్లిం మహిళలను అమ్మకానికి పెట్టిన యాప్‌ కేసులో పోలీసులు 18 ఏళ్ల యువతిని, 21 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.

బెంగళూరుకు సంబంధించిన ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ వివరాలను అధికారులు వెల్లడించలేదు.

యువకుడిపై ఏయే ఆరోపణలు నమోదు చేశారో తెలీడం లేదు. కానీ ఇతడు బుల్లీ బాయి యాప్‌ 'క్లోజ్ ఫాలోయర్' అని తేలినట్లు పోలీసులు బీబీసీకి చెప్పారు.

మరోవైపు, అరెస్టైన 21 ఏళ్ల యువకుడి పేరు విశాల్ కుమార్ అని ముంబయి పోలీసులు చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ కేసులో ప్రధాన నిందితురాలైన 18 ఏళ్ల యువతిని ఉత్తరాఖండ్‌లో అరెస్ట్ చేశారని, నిందితులు ఇద్దరికీ ఒకరి గురించి ఇంకొకరికి తెలుసని వారు వివరించినట్లు తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బుల్లీ బాయి యాప్‌కు సంబంధించి ప్రధాన నిందితురాలైన యువతి మూడు అకౌంట్లు నిర్వహిస్తోందని, సహ నిందితుడు విశాల్ కుమార్ ఖల్సా సుప్రీమసిస్ట్ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసినట్లు పోలీసులు చెప్పారని ఏఎన్ పేర్కొంది.

డిసెంబర్ 31న అతడు మిగతా అకౌంట్ల పేర్లను సిక్కుల పేర్లతో ఉండేలా మార్చాడని, ఫేక్ ఖల్సా అకౌంట్లులా చూపించారని ముంబయి పోలీసులు వివరించినట్లు తెలిపింది.

మరోవైపు పోలీసులు అరెస్ట్ చేసిన విశాల్ కుమార్‌ను తప్పుగా ఈ కేసులో ఇరికించారని నిందితుడి తరఫు న్యాయవాది అన్నట్లు ఏఎన్ఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"నా క్లయింటును జనవరి 10 వరకూ పోలీస్ కస్టడీకి పంపించారు. ఈ కేసులో నా క్లయింట్‌ను తప్పుగా ఇరికించారు. పోలీసులు సెర్చ్ వారెంట్ పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు" అని విశాల్ కుమార్ లాయర్ డి.ప్రజాపతి చెప్పినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

ఈ యాప్‌ను గిట్‌హబ్ వెబ్ ప్లాట్‌ఫాం నుంచి హోస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తర్వాత యాప్‌ను తొలగించారు.

ప్రముఖ ముస్లిం మహిళా జర్నలిస్టులు, కార్యకర్తల ఫొటోలను వారి అనుమతి లేకుండానే ఈ యాప్‌లో ఉపయోగించారు. వారు అమ్మకానికి ఉన్నట్టు ఫేక్ ఆక్షన్ నిర్వహించారు.

ముస్లిం మహిళలను ఇలా ఆన్‌లైన్లో వేలానికి పెట్టడం ఇది రెండోసారి. 80 మందికి పైగా ముస్లిం మహిళలు ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేసిన ఫొటోలు ఉపయోగించిన సుల్లీ డీల్స్ అనే వెబ్‌సైట్ గత ఏడాది జులైలో వారి ఫేక్ ప్రొఫైల్స్ తయారుచేసింది. వారిని 'డీల్స్ ఆఫ్ ది డే'గా వర్ణించింది.

ఈ రెండు కేసుల్లో ముస్లిం మహిళను కించపరచాలని, అవమానించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. వీరిలో చాలా మంది మహిళలు నరేంద్ర మోదీ పాలనలో పెరుగుతున్న హిందుత్వవాద జాతీయవాదంపై తమ గళం వినిపించారు.

సుల్లీ అనేది ముస్లిం మహిళలను అవమానించేలా హిందూ రైట్ వింగ్ గ్రూపులు ఉపయోగించే ఒక అవమానకరమైన హిందీ పదం. బుల్లీ అనేది కూడా అలాంటిదే.

వీడియో క్యాప్షన్, ఆధునిక ముస్లిం మహిళ బురఖా ధరించాలా? వద్దా?

సుల్లీ డీల్స్‌పై కేసులు నమోదు చేయలేదు

సుల్లీ డీల్స్ కేసులో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకూ ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

తాజాగా బుల్లీ బాయి యాప్ గురించి వార్తలు రావడంతో సుల్లీ డీల్స్ కేసులో లక్ష్యంగా మారిన హసీబా అమీన్ 2021లో తాను ఇచ్చిన ఫిర్యాదుపై దిల్లీ పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం బుల్లీ బాయి యాప్‌కు లక్ష్యంగా మారిన మహిళల ఫిర్యాదుల ఆధారంగా మూడు రాష్ట్రాల పోలీసులు ఈ యాప్‌పై దర్యాప్తు ప్రారంభించారు.

సోమవారం ముంబయి సైబర్ పోలీసులు బెంగళూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు యువకుడిని ముబయికి తీసుకొచ్చారు.

ఈ కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక మహిళను కూడా ప్రశ్నిస్తున్నట్లు ముంబయి పోలీసులు బీబీసీకి చెప్పారు.

బుల్లీ బాయి యాప్‌లో ఉన్న మహిళల ఫొటోల్లో ఒక బాలీవుడ్ నటి, కనిపించకుండా పోయిన ఒక విద్యార్థిని 65 ఏళ్ల తల్లి కూడా ఉన్నారు.

ఈ యాప్‌లో తమ ఫొటోలు పెట్టి నకిలీ వేలం నిర్వహించిన స్క్రీన్ షాట్లను చాలా మంది తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది చాలా మందికి ఆగ్రహం తెప్పించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

సుల్లీ డీల్స్ గురించి గత ఏడాది ఫిర్యాదు చేసిన కశ్మీరీ జర్నలిస్ట్ ఖురాతులైన్ రెహ్బర్ ఈసారీ యాప్‌లో తన పేరు కూడా చేర్చారని తెలిసి అసహ్యంగా అనిపించిందని చెప్పారు.

గిట్‌హబ్ ప్లాట్‌ఫాం ఈ యాప్‌ను అప్‌లోడ్ చేసిన యూజర్‌ను బ్లాక్ చేసిందని, పోలీసులు సైబర్ సంస్థలతో కలిసి చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం చెప్పారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది దీనిపై స్పందించారు. "ప్లాట్‌ఫాంను బ్లాక్ చేయడంతోపాటూ అలాంటి సైట్లను సృష్టిస్తున్నవారిని శిక్షించడం చాలా ముఖ్యం" అన్నారు.

సుల్లీ డీల్స్ యాప్ రూపొందించిన వారిని ఇప్పటికీ శిక్షించకపోవడం వల్లే ఇప్పుడు కొత్త యాప్‌ను తయారుచేశారని ఆమె ఏఎన్ఐతో అన్నారు. 2021లో సుల్లీ డీల్స్ యాప్ వెలుగులోకి వచ్చినపుడు తాను సమాచార మంత్రికి రాసిన లేఖలు కూడా షేర్ చేశారు.

"కంపెనీ దర్యాప్తు తర్వాత, ఇలాంటి కార్యకలాపాలు మా విధానాలను ఉల్లంఘించినట్లేనని తెలీగానే, ఆ యూజర్ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది" అని గిట్‌హబ్ ప్రతినిధి తెలిపారు.

భారత్‌లో మహిళలు ఎంత గళం వినిపిస్తే, అంత ఎక్కువగా వారు లక్ష్యంగా మారుతున్నారని తేలిందని భారత్‌లో ఆన్‌లైన్ వేధింపులపై 2018 ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన రిపోర్టు చెప్పింది.

మతపరమైన మైనారిటీలు, వెనుకబడిన కులాల మహిళల పట్ల ఈ వేధింపులు పెరిగాయని తెలిపింది.

భారత దేశంలో పోలరైజ్డ్ రాజకీయ వాతావరణం ఉండడంతో ముస్లిం మహిళలపై ట్రోలింగ్ ఇటీవల ఏళ్లలో మరింత దారుణంగా మారిందని విమర్శకులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, నైజీరియా: ఆ మహిళ చెప్పులు తయారు చేసే పని ఎంచుకున్నారు.. ఎందుకంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)