సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, PMO
2019లో ఆమోదం పొందిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు.
సీఏఏ(సవరణ)కు సంబంధించిన నిబంధనలను నోటిఫై చేశామని అమిత్ షా పేర్కొన్నారు. ఈ చట్టాన్ని అమలు పరచడానికి అవసరమైన నియమ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ నిబంధనలకు అమల్లోకి వస్తే 2014 డిసెంబర్ 31 తర్వాత పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వలస వచ్చిన హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం దక్కే అవకాశం ఏర్పడుతుందని హోంశాఖ తన ట్వీట్‌లో పేర్కొంది.
ఇందుకోసం పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఏమిటీ బిల్లు
ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
అప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యం ఉన్న పార్లమెంటు దిగువసభ (లోక్‌సభ)లో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే.. ఈశాన్య భారతదేశంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన తర్వాత ఎగువ సభ (రాజ్యసభ)లో ఇది ఆమోదం పొందలేదు.
ముఖ్యంగా.. ఆగస్టు నెలలో ప్రకటించిన జాతీయ పౌరుల జాబితాలో దాదాపు ఇరవై లక్షల మంది నివాసులకు చోటు కల్పించని అస్సాం రాష్ట్రంలో నిరసనలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఈ పౌరసత్వ సవరణ చట్టం, ఆ పౌరుల జాబితా రెండూ ఒకటి కాకపోయినప్పటికీ.. ఆ జాబితాకు ఈ చట్టానికి సంబంధం ఉందని జనం భావిస్తున్నారు.
జాతీయ పౌరుల జాబితా (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ - ఎన్ఆర్‌సీ) అనేది.. 1971 మార్చి 24వ తేదీ నాటికి - అంటే పొరుగుదేశమైన బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారటానికి ఒక రోజు ముందు నాటికి - తాము ఈ రాష్ట్రానికి వచ్చామని నిరూపించుకోగలగిన ప్రజల జాబితా.
ఆ జాబితాను ప్రచురించటానికి ముందు ఎన్‌ఆర్‌సీని బీజేపీ సమర్థించుకుంటూ వచ్చింది. కానీ.. తుది జాబితాను ప్రచురించటానికి కొన్ని రోజుల ముందు అందులో తప్పులు ఉన్నాయంటూ వైఖరి మార్చుకుంది.
దానికి కారణం.. బీజేపీకి బలమైన ఓట్ల పునాదిగా ఉన్న బెంగాలీ హిందువులు చాలా మందిని కూడా ఆ జాబితా నుంచి మినహాయించారు. వారి పరిస్థితి 'అక్రమ వలసదారులు'గా మారే పరిస్థితి తలెత్తింది.

ఫొటో సోర్స్, ANI
హింసకు గురవుతున్న మైనారిటీల కోసం: అమిత్ షా
హింసకు గురవుతున్న మైనారిటీలకు ఇండియాలో సీఏఏ ద్వారా పౌరసత్వం రానుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
''మోదీ ప్రభుత్వం ఇవాళ పౌరసత్వ (సవరణ) రూల్స్ 2024ను నోటిఫై చేసింది. ఈ నియమాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరంగా హింసకు గురవుతున్న మైనారిటీలకు మన దేశంలో పౌరసత్వాన్ని పొందేలా చేస్తాయి. ఆ దేశాల్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన వాగ్దానాన్ని గ్రహించి, ఈ నోటిఫికేషన్‌తో నరేంద్ర మోదీ నెరవేర్చారు'' అని ఎక్స్ వేదికగా తెలిపారు.
సీఏఏ నోటిఫై చేయడంతో దిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ముస్లింలే లక్ష్యం: అసదుద్ధీన్
సీఏఏపై అభ్యంతరాలు అలాగే ఉన్నాయని, ముస్లింలే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ అన్నారు.
''సీఏఏ అనేది విభజన వాదం, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించాలని కోరుకునే గాడ్సే ఆలోచనను ప్రతిబింబిస్తోంది. హింసకు గురైన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి కానీ, మతం లేదా జాతీయతపై పౌరసత్వం ఆధారపడి ఉండకూడదు.
ఐదేళ్లుగా ఈ నిబంధనలను ఎందుకు పెండింగ్‌లో ఉంచారు, ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఎన్‌పీఆర్-ఎన్ఆర్‌సీతో పాటు, సీఏఏ ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించింది, ఇతర ప్రయోజనాలు లేవు.
సీఏఏ ఎన్‌పీఆర్ ఎన్ఆర్‌సీలని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయులకు దీన్ని మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదు'' అని ఎక్స్‌లో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

ఫొటో సోర్స్, Getty Images
సీఏఏను వ్యతిరేకిస్తాం: మమతా బెనర్జీ
దేశంలో సీఏఏ అమలును వ్యతిరేకిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశంలో వివక్ష ఉంటే మౌనంగా ఉండబోనని ఆమె కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో సీఏఏ- ఎన్ఆర్‌సీలు సున్నితమైన సమస్యలని, లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో అశాంతి వ్యాప్తి చెందకూడదని మమత అభిప్రాయపడ్డారు.
"మీకు ధైర్యం ఉంటే సీఏఏను ముందుగానే అమలు చేసి ఉండేవారు, ఎన్నికల సందర్భంగా ఎందుకు? నేను ఎవరి పౌరసత్వాన్ని కోల్పోనివ్వను" అని మమత విలేకరుల సమావేశంలో అన్నారని బీబీసీ అసోసియేట్ కరస్పాండెంట్ ప్రభాకర్ మణి తివారీ తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
ఈ చట్టం ఏం చెప్తోంది?
పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 11న పార్లమెంటులో ఆమోదం పొందింది.
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం ఈ సవరణ లక్ష్యం.
అయితే, ఇందులో ముస్లింలను చేర్చలేదు. ఇది వివాదానికి కారణమైంది.
ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం చెప్పగా, తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముస్లిం వర్గాలు ఆరోపించాయి.
మరోవైపు ఈ చట్టం దేశ సెక్యులర్ భావనను ఉల్లంఘిస్తోందని కొందరు ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరూ మతం ఆధారంగా వివక్ష చూపకూడదు.
అయితే ఈ చట్టంలో ముస్లింలకు పౌరసత్వం కల్పించే నిబంధన లేదు. ఈ కారణంగానే సెక్యులరిజానికి విఘాతం కలుగుతోందన్న ఆరోపణలు వినిపించాయి.

ఫొటో సోర్స్, AFP
పౌరసత్వ చట్టం చరిత్ర ఏమిటి?
అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది.
చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది.
ఆ చట్టం ప్రకారం.. అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించటం చేయవచ్చు.
ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవటానికి 11 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండటం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం కానీ తప్పనిసరి అర్హతలుగా చెప్తున్న నిబంధనను కూడా ఈ బిల్లు సవరిస్తుంది.
ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు - హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే.. వారు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోగలగాలి.
అటువంటి వారు పౌరసత్వం పొందటానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పని చేసి ఉంటే చాలు.
ప్రవాస భారత పౌరులు (ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా - ఓసీఐ) కార్డులు గల వ్యక్తులు - భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవధికంగా నివసించటానికి లేదా పని చేయటానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు.. చిన్న, పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పోతారని కూడా ఈ సవరణ చెప్తోంది.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- 217 సార్లు కోవిడ్ టీకా వేయించుకున్న జర్మన్.. ఆయనకు ఏమైంది?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
- మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














