రష్యాలో చైనా అధ్యక్షుడు.. యుక్రెయిన్‌లో జపాన్ ప్రధాని... ఈ పర్యటనల అర్థం ఏంటి?

కిషిదా, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, PM's Office of Japan/Twitter

    • రచయిత, సైమా ఖాలిల్, గరెథ్ ఇవాన్స్
    • హోదా, టోక్యో, లండన్ బీబీసీ ప్రతినిధులు

రష్యా, యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం ఆసియాలో ఎలా ప్రతిధ్వనిస్తుందో అర్థం చేసుకోవాలంటే.. జపాన్, చైనా అధినేతల పర్యటన ద్వారా తెలుసుకోవచ్చు.

ఇద్దరు నేతలూ దౌత్యపరమైన విదేశీ పర్యటనలో ఉన్నారు. అందులోనూ ప్రత్యర్థుల యుద్ధ స్థావరాల్లో పర్యటిస్తున్నారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలోని మాస్కోకు వెళ్లగా .. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా యుక్రెయిన్ రాజధాని కీయెవ్ చేరుకున్నారు.

యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్‌స్కీ‌తో జరిగిన సమావేశంలో కిషిదా యుక్రెయిన్ పునర్నిర్మాణం, మానవతా సహాయ కార్యక్రమాల మద్దతుపై హామీ ఇచ్చారు.

అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు, మిత్రుడైన జిన్‌పింగ్‌ను పిలిచారు. తటస్థంగా ఉన్నామని చైనా చెబుతున్నా.. ప్రస్తుతం రష్యా వైపే ఆ దేశం ఎక్కువ మొగ్గు చూపుతోంది.

జిన్‌పింగ్ మాస్కో పర్యటన, కిషిదా ప్రయాణం కూడా ఒకే సమయంలో జరిగింది.

జపాన్ ప్రధాని అకస్మాత్తుగా విదేశీ పర్యటనలకు వెళ్లడం చాలా అరుదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువ సంఖ్యలో జపాన్‌కు చెందిన నాయకులు యుద్ధంలో దెబ్బతిన్న దేశానికి చేరుకోవడం మొదటిసారి.

మంగళవారం కిషిదా యుక్రెయిన్ చేరుకునే వరకు ఆయన పర్యటన గోప్యంగా ఉంచారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేశామని అధికారులు చెబుతున్నారు.

యుక్రెయిన్‌లో జపాన్ ప్రధాని

ఫొటో సోర్స్, Reuters

రష్యా అధ్యక్షుడితో చైనా అధ్యక్షుడు భేటీ

ఫొటో సోర్స్, Reuters

యుద్ధంలో దెబ్బతిన్న యుక్రెయిన్‌కు వెళ్లాలని ప్రధాన మంత్రి కిషిదాపై తన సొంత అధికార లేబర్ డెమొక్రటిక్ పార్టీ నుంచి ఒత్తిడి పెరిగింది.

ఇప్పటివరకు యుక్రెయిన్ సందర్శించని జీ-7 దేశాల ఏకైక నాయకుడు కిషిదా.

మేలో హిరోషిమాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ముందే యుక్రెయిన్‌కు వెళ్లాలని ఆయనపై ఒత్తిడి పెరిగింది.

గత వారం టోక్యోలో దక్షిణ కొరియా అధ్యక్షుడిని కలవడం ద్వారా ఆయన ఇప్పటికే దౌత్యపర విజయాన్ని సాధించారు.

అంతేకాదు జపాన్, దక్షిణ కొరియా నేతలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించడం దశాబ్ద కాలం తర్వాత ఇదే తొలిసారి.

రష్యా అధ్యక్షుడితో చైనా అధ్యక్షుడు భేటీ

ఫొటో సోర్స్, PAVEL BYRKIN/SPUTNIK/KREMLIN POOL/EPA-EFE/REX/SHUT

జపాన్ దక్షిణ కొరియాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటూ, ఇంటెలిజెన్స్‌ను పంచుకుంటోంది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా జపాన్ అమెరికాకు తన నిబద్ధతను చూపిస్తోంది.

కిషిదా యుక్రెయిన్ పర్యటనను అమెరికా స్వాగతిస్తుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటన ఉద్దేశం ప్రపంచ స్థాయిలో చైనా ప్రభావాన్ని పెంచుకోవడమే.

అలాగే, ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభ సమయంలో ఇరు దేశాలు ఒకే తాటిపై నిలుస్తున్నాయనే బలమైన సంకేతాలను యుక్రెయిన్‌లో జపనీస్ నేత పర్యటించడం ప్రతిబింబిస్తోంది.

ఇది చిన్న విషయం కాదు. జపాన్ చాలా వరకు ముఖ్యంగా చైనాతో తన సంబంధాల విషయంలో సమతుల్యత పాటిస్తూ వస్తోంది.

జపాన్ ప్రధాని

ఫొటో సోర్స్, Reuters

గత నెలలో ఇరు దేశాలు టోక్యోలో భద్రతాపరమైన చర్చలు జరిపాయి. నాలుగేళ్లలో ఇరు దేశాలు ఈ చర్చలు జరపడం ఇదే తొలిసారి. జపాన్ ఆర్మీ బలపడటంపై చైనా ఆందోళన వ్యక్తం చేయగా.. రష్యా ఆర్మీతో చైనా సంబంధాలపై జపాన్ ఫిర్యాదు చేసింది. అలాగే అనుమానిత గూడాఛార్య బెలూన్ల వాడకంపై ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా, జపాన్‌లు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. యుక్రెయిన్ యుద్ధం విషయంలో జపాన్‌ తనకంటూ కొన్ని అనుమానాలు, భయాందోళనలు ఉన్నాయి. రష్యా దాడిని, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తైవాన్‌పై చైనా దాడిని గుర్తుకు చేసుకుంటూ జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో జపాన్ కూడా కూరుకుపోతుందేమోనని భయపడుతోంది.

ప్రస్తుతం అలాంటి పరిస్థితులంటూ ఏమీ లేవు. ఇవి తలెత్తే అవకాశాలు కూడా లేవు. కానీ, మంగళవారం ఇరు నేతల పర్యటనలు చూస్తూ మాత్రం, చాలా విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)