సిక్కు నేత నిజ్జర్ హత్య: ఇండియా, కెనడా గొడవతో అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది?

జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జగ్‌మీత్ సింగ్‌తో జస్టిన్ ట్రూడో

భారత్, కెనడా మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి.

మొదట భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం, ఆ వెంటనే భారత్ కూడా అదే చేయడం జరిగిపోయాయి.

సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తముందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటన తర్వాత ఇరు దేశాలు ఈ చర్యలకు ఉపక్రమించాయి.

అయితే, ఈ ఆరోపణలను భారత్ తిరస్కరించింది.

ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే భారత్, కెనడా మధ్య సంబంధాల్లో నెలకొన్న సంక్షోభంపై అమెరికా, ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ వివాదంతో భారత్, కెనడా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? మాజీ దౌత్యవేత్తలు ఏమంటున్నారు? నిపుణులు ఏం చెబుతున్నారు?

జస్టిన్ ట్రూడోో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2014లో ప్రధానమంత్రి కావడానికి ముందు జస్టిన్ ట్రూడో‌తో జగ్‌మీత్ సింగ్

భారత సంతతి కెనడా మంత్రి ఏమన్నారు?

కెనడా, భారత్ మధ్య పెరుగుతున్న దూరంపై ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలశాఖ స్పందించింది. ''కెనడా ఆరోపణలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. దర్యాప్తును నిశితంగా గమనిస్తున్నాం'' అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.

''అన్ని దేశాలు చట్టాలను అనుసరించాలని, ఇతరుల సార్వభౌమాధికారాన్నిగౌరవించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మా ఆందోళనలను ఇప్పటికే సీనియర్ భారతీయ అధికారులకు తెలియజేశాం'' అని శాఖ ప్రతినిధి పెన్నీ వాంగ్ అన్నారు.

భారత సంతతికి చెందిన కెనడా మంత్రి కమల్ ఖేదా కూడా పలు ట్వీట్లు చేశారు.

“కెనడా పౌరుల భద్రతకే మా మొదటి ప్రాధాన్యం. కెనడా గడ్డపై, ఈ దేశ పౌరులపై చట్టవిరుద్ధమైన చర్యలను సహించేది లేదు'' అని ఆమె రాశారు.

''ఇంతకుముందు కంటే, ఇప్పడు మనందరం ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉంది. మన విధానాలపట్ల మనం ఏకాభిప్రాయంతో ఉండడం అవసరం'' అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

కమల్ ఖేదా ట్వీట్లపై దౌత్య వ్యవహారాల నిపుణులు సుశాంత్ సరిన్ స్పందించారు.

"కెనడియన్ పౌరుల భద్రత అంటే, అందులో ఖలిస్థాన్‌కు మద్దతు లేని ఇతర భారతీయ సంతతికి చెందిన పౌరుల భద్రత కూడా ఉందా? లేదంటే వారిపై దాడులు, బెదిరింపులు ఆమోదయోగ్యమా? అలాంటి వ్యక్తులు దేవాలయాలు, భారత హైకమిషన్లపై దాడులు చేయడం కూడా ఆమోదయోగ్యమేనా'' అని ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

"మన అంతర్గత విషయాల్లో భారత్ లేదా మరే ఇతర దేశం జోక్యాన్ని అనుమతించేది లేదు. కెనడా భూభాగంపై, కెనడియన్ పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం మా దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే'' అని వాంకోవర్ సౌత్ ఎంపీ హర్జీత్ సజ్జన్ ట్వీట్ చేశారు.

మోదీతో ట్రూడో

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జీ20 సమావేశం సందర్భంగా భారత ప్రధాని మోదీతో జస్టిన్ ట్రూడో

‘స్నేహితులూ కాదు, శత్రువులూ కాదు’

“కెనడా, భారత్ స్నేహితులు. శత్రువులు కాదు. అయితే, సిక్కు తీవ్రవాద గ్రూపుతో ట్రూడో పొత్తు కారణంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. జీ20 సదస్సు సందర్భంగా సిక్కు తీవ్రవాదులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు ట్రూడోను మోదీ హెచ్చరించారు. ట్రూడో ఇప్పుడు కెనడాలో జరిగిన తీవ్రవాద సిక్కు నేత నిజ్జర్ హత్య వెనక భారతదేశం ఉండొచ్చని అంటున్నారు'' అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానే అన్నారు.

''సిక్కు నేత హత్య జరిగి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎవరిపైనా అభియోగాలు నమోదు చేయలేదు. ఆ హత్యకు తన ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారో ట్రూడో చెప్పలేదు. ట్రూడో నిరాధార ఆరోపణలు, పరస్పర ఎదురుదాడులతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా క్షీణించాయి'' అని ఆయన రాశారు.

జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాపై ప్రభావం పడనుందా?

భారత్, కెనడా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం అమెరికాపైనా ప్రభావం చూపనుందా?

ఇండియా, కెనడా సంబంధాలు దెబ్బతినడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అమెరికా తెలిపింది.

రాండ్ కార్పొరేషన్‌లో జాతీయ భద్రత, ఇండో-పసిఫిక్ నిపుణులు డెరెక్ జె. గ్రాస్మెన్ ఈ వ్యవహారంపై ట్వీట్లు చేశారు.

పాకిస్తాన్, కెనడా ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్నాయని భారత్ విశ్వసిస్తోందని గ్రాస్మెన్ అభిప్రాయపడ్డారు.

''భారత్ - కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి. జూన్‌లో సిక్కు నేత నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో చెప్పారు.

అది నిజమని తేలితే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ను కలవడానికి, జూన్‌లో ప్రధాని మోదీ వైట్‌హౌస్ పర్యటనకు మధ్య తేడా ఉండదు. అది అబద్ధం కావాలని ఆశిస్తున్నాం'' అని గ్రాస్మెన్ ట్వీట్ చేశారు.

బైడెన్ జులై 2022లో యువరాజు సల్మాన్‌తో భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి నాలుగు వారాల ముందు వరకూ తాను సల్మాన్‌ను కలవబోనని బైడెన్ చెప్పారు.

తుర్కియా(టర్కీ) గడ్డపై సౌదీ అరేబియా జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య కేసులో సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బైడెన్ ఈ వ్యవహారంపై వ్యాఖ్యలు కూడా చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

భారత్, అమెరికా సంబంధాలకు సవాల్

అలాంటి పరిస్థితుల్లో సల్మాన్‌ని బైడెన్ కలవడంతో జనాలు ఆశ్చర్యపోయారు.

"కెనడా, భారత్ సంబంధాలు దెబ్బతినడం బైడెన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కెనడాకు అమెరికా మద్దతిస్తే భారత్‌ పట్ల ఆ దేశం వైఖరి గురించి ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకవేళ భారత్‌కు మద్దతిస్తే, అది నాటో నిబంధనలకు విరుద్ధం. కెనడా ఆరోపణలతో 2000 సంవత్సరం తర్వాత భారత్, అమెరికా సంబంధాలు పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నాయి'' అని గ్రాస్మెన్ ట్వీట్ చేశారు. చైనాకు వ్యతిరేకంగా భారత్‌కు మద్దతు ఇచ్చే విషయంలో అమెరికా దూరం పాటించే అవకాశం ఉందన్నారు.

"దర్యాప్తు ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేసినట్టుగా ఉంది. ఆ ఆరోపణలు నిజమని రుజువైనప్పటికీ, ఒక ప్రధానమంత్రి బహిరంగంగా మిత్రదేశం పేరు చెప్పడం, దౌత్యవేత్తను బహిష్కరించడం అసాధారణమైన విషయం. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తెలియజేస్తోంది.

కెనడాలో సిక్కు తీవ్రవాదుల కార్యకలాపాల గురించి, జగ్మీత్ సింగ్ మద్దతుతో నడుస్తున్న ట్రూడో ప్రభుత్వం ముందు భారత్ ఇటీవల లేవనెత్తింది. దానితో పాటు, కెనడాలో ఇందిరా గాంధీ హత్యను కూడా ప్రదర్శించారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఇప్పటికే ఉద్రిక్తత నెలకొని ఉంది'' అని ఇంగ్లిష్ న్యూస్‌పేపర్ ద హిందూ ఇంటర్నేషనల్ ఎడిటర్ స్టాన్లీ జానీ రాశారు.

"జీ20కి ముందు రెండు విషయాలు జరిగాయి. మొదటిది, భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలను కెనడా రద్దు చేసింది. ఈ ఒప్పందం ఈ ఏడాదే కుదురుతుందని అంతా భావించారు. విదేశీ జోక్యంపై కెనడియన్ న్యాయమూర్తి దర్యాప్తు ప్రారంభించడం రెండోది. భారత్ వైఖరి పరిశీలనలో ఉందని ట్రూడో ప్రభుత్వం తెలిపింది'' అని స్టాన్లీ అన్నారు.

కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ

ఫొటో సోర్స్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ

ఫొటో క్యాప్షన్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ

పరిస్థితులు బాగా దిగజారాయి: కేసీ సింగ్

'ది ఇండియన్ ప్రెసిడెంట్' పుస్తక రచయిత, మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించారు.

''భారత దౌత్యవేత్తను బహిష్కరించడంతో పాటు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చాయి. ఎందుకంటే, ఈ అంశం రెండు దేశాల అంతర్గత రాజకీయాల్లోనూ కీలకం.

ఒక సీనియర్ దౌత్యవేత్తపై ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా అరుదైన ఘటన. ఏ జీ7, లేదా నాటో సభ్య దేశం కూడా ఇలా చేయలేదు. భారత్‌కు ఈ విషయం ముందే తెలిసి ఉండాల్సింది. భారత పర్యటనలో ట్రూడోని విస్మరించే బదులు ఆ విషయం గురించి మాట్లాడి ఉండాల్సింది'' అని కేసీ సింగ్ రాశారు.

పరిస్థితులు బాగా దిగజారాయని, ఇక వెనక్కిరావడం కష్టమని కేసీ సింగ్ అన్నారు.

వాషింగ్టన్ డీసీకి చెందిన సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విల్సన్ సెంటర్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మాన్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. "భారత్‌కు పాశ్యాత్య దేశాల్లో కెనడా కీలకమైన భాగస్వామి. ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత, భారత దౌత్యవేత్తను బహిష్కరించడం ఆశ్చర్యకరం. సాధారణంగా ఇలా జరగదు.

కెనడా ప్రధాని చేస్తున్న ఆరోపణలు బలమైన సాక్ష్యాలతో చేసినట్టుగానే ఉన్నాయి. లేదంటే భారత్‌తో సత్సంబంధాలు దెబ్బతినేలా ఎందుకు వ్యవహరిస్తారు'' అని అన్నారు. ట్రూడో ఆరోపణల తీవ్రత ఏంటో ఆయనకు తెలుసని విశ్వసిస్తున్నానని కుగెల్‌మాన్ అన్నారు.

''వేర్పాటువాద నేత హత్య జరిగిన మూడు నెలల తర్వాత ఇలాంటి భారీ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. కెనడియన్లు కూడా షాకయ్యారు. 30-32 ఏళ్ల క్రితం జరిగిన ఎయిర్ ఇండియా బాంబు పేలుళ్లపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. దాని దర్యాప్తు ఇప్పటికీ పూర్తి కాకపోతే, ఈ కేసు దర్యాప్తు మాత్రం మూడు నెలల్లో ఎలా పూర్తయింది? అనూహ్యంగా ప్రధాన మంత్రి పార్లమెంట్‌లో ఈ ప్రకటన చేశారు. పూర్తి నిజమేంటో తెలుసుకునేందుకు కెనడియన్లం ఎదురుచూస్తున్నాం" అని కెనడాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అస్లాం గోరా అన్నారు.

జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, EPA

కెనడా , భారత్ ఏమంటున్నాయి?

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని ఓ గురుద్వార బయట జూన్ 18న నిజ్జర్‌ను కాల్చి చంపేశారు.

''నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉండొచ్చని కెనడియన్ ఏజెన్సీలు నిర్ధరించాయి'' అని కెనడా ప్రధాన మంత్రి ట్రూడో సోమవారం పార్లమెంట్‌లో చెప్పారు.

ఇదే విషయాన్ని జీ20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ వద్ద లేవనెత్తినట్లు ఆయన తెలిపారు.

''మన గడ్డపై మన దేశ పౌరుడి హత్య వెనక విదేశీ ప్రభుత్వం ఉండడం ఆమోదయోగ్యం కాదు. అది మన సార్వభౌమాదికారాన్ని ఉల్లంఘించడమే'' అని ట్రూడో అన్నారు.

ఆ ప్రకటన వచ్చిన 24 గంటల్లోనే భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. ఆ తర్వాత కెనడా దౌత్యవేత్తను భారత్ బహిష్కరించింది.

కెనడా ఆరోపణలను ఇండియా తోసిపుచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)