కెనడా సీనియర్ దౌత్యాధికారిని 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలన్న భారత్
సిక్కు నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు, దౌత్యాధికారి పవన్ రాయ్ బహిష్కరణ నేపథ్యంలో భారత్ కూడా తీవ్రంగా స్పందించింది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
నరేంద్ర మోదీని ఆర్ఎస్‌ఎస్‌లోకి తెచ్చి గుజరాత్ సీఎం అయ్యేందుకు కారణమైన ఆ వకీల్ సాబ్ ఎవరు?
మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి... ఇది ఇన్నేళ్ళుగా ఎందుకు పెండింగ్‌లో ఉంది?
నారీ శక్తి వందన: ‘దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదిస్తాం’
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు
హైదరాబాద్ ‘మిస్సింగ్’ మహిళ మిస్టరీ: మతం మార్చుకుని, రెండో పెళ్లి చేసుకొని గోవాలో జీవనం.. ఐదేళ్ల తర్వాత ఎలా గుర్తించారు?
కెనడా సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించిన భారత్

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, భారత్‌లో కెనడా హైకమిషనర్ కామెరూన్ మెక్ కే భారత్‌లో పని చేస్తున్న ఒక సీనియర్ దౌత్యాధికారిని 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది.
కెనడాలో సిక్కు లీడర్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు భారత ప్రభుత్వానికి సంబంధం ఉందన్న ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి.
కెనడాలో భారత దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఆ దేశం ఆదేశించడంతో ఇటు భారత్ కూడా చర్యలకు దిగింది. ప్రధాని ట్రూడో వ్యాఖ్యలను ఖండించిన భారత విదేశాంగ శాఖ, దిల్లీలోని కెనడా హైకమిషనర్ కామెరూన్ మెక్‌కేను పిలిపించింది. కెనడా ప్రభుత్వ చర్యలకు నిరసనగా భారత్‌లోని కెనడా దౌత్యవేత్తను ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ఆయనకు తెలిపింది. ఒక సీనియర్ దౌత్యాధికారి 5 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా సూచించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ప్రకటించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
