ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.
దాదాపు శతాబ్ద కాలం చరిత్ర ఉన్న ప్రస్తుత పార్లమెంటులో చివరి సమావేశాలు ఈరోజు ముగిశాయి. దీంతో, ఇది పాత పార్లమెంటు భవనంగా మారిపోయింది. ఉభయసభల సమావేశాలు రేపు మధ్యాహ్నం 1.15 గంటలకు కొత్త భవనంలో ప్రారంభమవుతాయి.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.

ఫొటో సోర్స్, ANI
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు.
ప్రపంచ కప్ పోటీలకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు, విరాట్ కోహ్లీ, హార్డిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్‌లకువిశ్రాంతి ఇచ్చారు.
వారి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఆర్. అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు లభించింది.
మొదటి రెండు వన్డేలకు రోహిత్ శర్మ స్థానంలో జట్టుకు కెఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఉంటారు. రవీంద్ర జడేజాకు వై కెప్టెన్ హోదా లభించింది.
తొలి రెండు మ్యాచులు ఆడే జట్టులోని ఆటగాళ్ళు వీరే:
కేఎల్ రాహుల్ (కెప్టెన్ – వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్),శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ఆర్. అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కృష్ణ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇక మూడో వన్డే జట్టులో ఆడేది ఎవరంటే:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.
ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 22న పంజాబ్‌లని మొహాలీలో ఆడుతారు. రెండో మ్యాచ్ 24న ఇండోర్‌లో, మూడో మ్యాచ్ 27న రాజ్‌కోట్‌లో జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత పార్లమెంటు భవనం ఇప్పుడు పాత పార్లమెంటు భవనంగా మారిపోయింది. సోమవారం నాడు ఈ పార్లమెంటు భవనంలో ప్రారంభమైన ప్రత్యేక సమావేశాలు రోజంతా సాగిన సుదీర్ఘ చర్చల తరువాత ముగాయి. దాంతో, ఈ చరిత్రాత్మక భవనం పాత్ర ముగిసినట్లయింది.
పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం పార్లమెంటు దిగువ సభ మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు కొత్త పార్లమెంటు భవనంలోని లోక్‌సభ మందిరంలో జరుగుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఎగువ సభ అంటే రాజ్యసభ సమావేశం కొత్త పార్లమెంటు భవనంలోని రాజ్యసభ చాంబర్‌లో మంగళవారం 2.15 గంటలకు మొదలవుతుంది. ఉభయ సభల సమావేశాల ప్రారంభ సమయాల మధ్య ఒక గంట వ్యవధి ఉంటుంది.
ఉభయ సభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఎంపీలు అందరూ పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాలులో రేపు ఉదయం 11 నుంచి 12.30 గంటల మధ్య సమావేశమవుతారు.
అంతకన్నా ముందు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల ఫోటో సెషన్ ఉంటుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు స్పెషల్ సెషన్ మొదలైంది. ఉభయ సభల కార్యక్రమాలు రోజంతా కొనసాగాయి. ఈ చరిత్రాత్మక పార్లమెంటు భవనంలో చివరి రోజ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో గంటసేపు ప్రసంగించారు.
ఆ తరువాత కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి లోక్‌సభపై తన అభిప్రాయాలను వినిపించారు. వీరిద్దరూ మాట్లాడిన తరువాతవిభిన్న పార్టీలకు చెందిన ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు భవనం చరిత్రను గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Lok Sabha
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక అంశాలను ప్రస్తావించారు.
చంద్రయాన్ 3ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ 75 ఏళ్ల ప్రయాణంలో భాగంగా అనేక సంఘటనలను ప్రస్తావించారు. అందులో బాగంగా వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటుతో పాటు, యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ విభజనపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘2000లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఉంది. ఈ పార్లమెంట్‌లోనే అందరి ఆమోదంతో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అది కూడా ఉత్సాహ పూరిత వాతావరణంలో చేసింది. ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు చేసినప్పుడు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సంబరాలు జరుపుకున్నాయి. ఉత్తరాఖండ్ ఏర్పాటు చేసినప్పుడు యూపీ, ఉత్తరాఖండ్ ఉత్సవాలు చేసుకున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రంగా అవతరిస్తే బిహార్, ఝార్ఖండ్ కూడా వేడుకలు జరుపుకున్నాయి. ఇదీ పార్లమెంటుకున్న సామర్థ్యం. అందరి ఆమోదాన్ని కూడగట్టవచ్చు. కానీ కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి. తెలంగాణ ఏర్పాటులో అనేక సమస్యలు ఎదురయ్యాయి. రక్తం ఏరులై పారింది. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసిన తర్వాత తెలంగాణ కానీ, ఏపీ కానీ సంబరాలు చేసుకోలేదు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని సృష్టించారు. ఉత్సాహ వాతావరణంలో విభజన జరిగి ఉంటే తెలంగాణ ఇవాళ అభివృద్ధి చెంది ఉండేది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, PRALHAD JOSHI
నేటి (సోమవారం) నుంచి సెప్టెంబరు 22 వరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి.
ఈ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం అఖిలపక్ష భేటీని నిర్వహించింది. 1946 డిసెంబరు 9న తొలిసారిగా జరిగిన పార్లమెంట్ సమావేశాల నుంచి మొదలు పెట్టి ఈ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చించిఈ ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యేక సమావేశాలు తొలి రోజు పాత భవనంలోనే జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. “తొలిరోజు రాజ్యాంగ పరిషత్ నుంచి పార్లమెంట్ వరకు 75 ఏళ్ల ప్రయాణం, సాధించిన విజయాలు, అనుభవాలు, ఇంకా నేర్చుకున్న విషయాలపై చర్చ జరుగుతుంది’’ అని ఆయన ఆదివారం మీడియాతో చెప్పారు.
మంగళవారం పాత పార్లమెంటు భవనంలో ఫోటో సెషన్, ఆ తర్వాత ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ రోజు జరిగే సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి.
మంగళవారం నుంచే ప్రభుత్వ అజెండా చర్చకు రానుంది.
రాజ్యసభ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యసభలో మూడు, లోక్‌సభలో రెండు బిల్లులు చర్చకు రానున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ బిల్లుల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన బిల్లుపైనే ఎక్కువగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక ప్రక్రియలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేసే కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్నారు. కొత్త బిల్లులో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేబినెట్ మంత్రిని చేర్చనున్నట్లు సమాచారం.
రాజ్యసభలో చర్చకు రానున్న బిల్లుల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన బిల్లు కూడా ఉంది. ప్రభుత్వం అజెండాను స్పష్టం చేసినప్పటికీ, రహస్య అజెండాను ఒక్కసారిగా తెరపైకి తెచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బిల్లును ఇండియా కూటమిలోని పార్టీలు వ్యతిరేకిస్తాయని కాంగ్రెస్ చెప్పింది.
ఒక దేశం-ఒక ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కమిటి తొలి భేటీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగిసిన తర్వాత రోజు అంటే ఈ నెల 23న జరుగనుంది.
గుడ్ మార్నింగ్.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.