అధికారంలోకి వస్తే 'హెచ్1బీ వీసా లాటరీ పద్దతి' రద్దు చేస్తా: వివేక్ రామస్వామి
కుటుంబ సభ్యులుగా అమెరికా వస్తున్న వలసవాదులందరూ ఈ దేశానికి నైపుణ్యం అందించడానికి వచ్చే తెలివైన వ్యక్తులు కారని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
అధికారంలోకి వస్తే 'హెచ్1బీ వీసా లాటరీ పద్దతి' రద్దు చేస్తా: వివేక్ రామస్వామి

ఫొటో సోర్స్, VIVEK2024.COM
తాను అధికారంలోకి వస్తే హెచ్1బీ వీసా పద్దతి రద్దు చేస్తానని అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి అన్నారు.
హెచ్1బీ వీసాలు లాటరీ సిస్టంలో కాకుండా మెరిట్ ద్వారా ఇచ్చే పద్దతి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
ఇలాంటి వలసలను అమెరికా ముగించాలని ఆయన తెలిపారు.
కుటుంబ సభ్యులుగా అమెరికా వస్తున్న వలసవాదులందరూ ఈ దేశానికి నైపుణ్యం అందించడానికి వచ్చే తెలివైన వ్యక్తులు కారని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హైదరాబాద్‌లో మినీ ఆఫ్రికా: ఇక్కడ ఇంతమంది ఆఫ్రికన్లు ఎందుకున్నారు?
శ్రీలంకలో తమిళ ఎంపీ కజేంద్రన్‌పై దాడి అవమానకరం

ఫొటో సోర్స్, TWITTER
శ్రీలంకలో తమిళ ఎంపీ సెల్వరాజా కజేంద్రన్‌పై దాడి అవమానకరమని ఆ దేశ ఎంపీ శనకియన్ రాజపుతిరన్ రసమాణికం తెలిపారు.
కజేంద్రన్‌పై సింహళ మూకలు దాడి చేశారంటూ వీడియోను పోస్టు చేసిన కుమానన్ అనే నెటిజన్ ట్వీట్‌ను శనకియన్ రీట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
'ఇది శ్రీలంక ప్రజాప్రతినిధిపై జరిగిన అవమానకరమైన దాడి. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా, దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని కోరుతున్నా. వారు ఈ విధంగా శ్రీలంక జెండాను అపవిత్రం చేస్తూ ఇలా చేయడం సిగ్గుచేటు' అని శనకియన్ తెలిపారు.
అయితే ఈ దాడి పోలీసుల ఎదురుగానే జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంపీ కూడా ఇవే ఆరోపణలు చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆసియా కప్ ఫైనల్ : ‘టీ తాగి వచ్చేలోపే అంతా అయిపోయింది’
మెదడుపై ఆకలి ఎలాంటి ప్రభావం చూపుతుంది, ప్రవర్తనను ఎలా మార్చేస్తుంది?
మహమ్మద్ సిరాజ్: ఆసియా కప్ ఫైనల్‌లో చెలరేగి ఆడిన ఈ 'హైదరాబాదీ గల్లీ క్రికెటర్' జర్నీ ఎలా సాగిందంటే..
ఆసియా కప్ విజేత భారత్, ఫైనల్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యర్ధి జట్టు ఇచ్చిన 51 పరుగుల విజయలక్ష్యాన్ని భారత జట్టు అలవోకగా ఛేదించింది. ఓపెర్లు గిల్, ఇషాన్ కిషన్‌లు ఈ స్కోరును కేవలం 6.1 ఓవర్లలో చేరుకుని జట్టుకు పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు.
శుభ్‌మన్ గిల్ 27 పరుగులు, ఇషాన్ కిషన్ 23 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు.
అంతకు ముందు 15.2 ఓవర్లలో 50 పరుగులకు శ్రీలంక జట్టు ఆలౌట్ అయింది.
లంక జట్టులో 5గురు ఆటగాళ్లు అసలు పరుగులేమీ చేయకుండానే పెవీలియన్‌కు చేరుకున్నారు.
హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ కొట్టాడు. హార్దిక్ పాండ్యా 3, జస్‌ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు.
లంక జట్టులో కుశాల్ మెండిస్ ఒక్కడే 17 పరుగులు చేయగలిగాడు. దుశాన్ హిమంత 13 పరుగులు చేయగా, మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ చేయడానికి కూడా కష్టపడ్డారు.
ఆసియా కప్ ఫైనల్: 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్, 6 వికెట్లు తీసిన మహహ్మద్ సిరాజ్

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ ఫైనల్‌లో ఆదివారంనాడు భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 50 పరుగులకే ఆలౌటయింది.
టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత జట్టులో బౌలర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మన్‌లు ఒక్కొక్కరే పెవీలియన్ బాటపట్టారు.
15.2 ఓవర్లలో 50 పరుగులకు శ్రీలంక జట్టు ఆలౌట్ అయింది. లంక జట్టులో 5 ఆటగాళ్లు అసలు పరుగులేమీ చేయకుండానే పెవీలియన్‌కు చేరుకున్నారు.
హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ కొట్టాడు. హార్దిక్ పాండ్యా 3, జస్‌ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు.
లంక జట్టులో కుశాల్ మెండిస్ ఒక్కడే 17 పరుగులు చేయగలిగాడు. దుశాన్ హిమంత 13 పరుగులు చేయగా, మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ చేయడానికి కూడా కష్టపడ్డారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైంది: సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్

ఫొటో సోర్స్, Screen grab
దిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఎలాంటి స్కామ్ జరుగలేదని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ అన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘జీవితంలో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నా. ఇప్పుడు ఆ గౌరవమే ప్రమాదంలో పడింది. మీకు ముందుగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ గురించి చెబుతా.
విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాం. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌తో ముందుకొచ్చింది.
40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. 2023 నాటికి 2.32 లక్షల మంది నైపుణ్యం సాధించారు. వారంతా ఉద్యోగాలు చేస్తున్నారు.
సీమెన్స్ కంపెనీకి, ఏపీస్‌ఎస్‌డీసీకి మధ్య ఒప్పందం జరిగింది. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం కుదుర్చుకున్నాం.
2018లోనే ఈ ప్రాజెక్టు నుంచి నేను బయటకు వెళ్లిపోయాను. 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ ప్రాజెక్ట్ విజయవంతమైందని గతంలో మెచ్చుకున్న ఏపీఎస్‌ఎస్‌డీసీనే ఈ ప్రాజెక్టు బోగస్ అని ఆరోపించింది. శిక్షణాకేంద్రాలు చూడకుండానే, తనిఖీలు చేయకుండానే అక్రమాలు జరిగాయంటున్నారు.
ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ. ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి జరగలేదు’’ అని సుమన్ బోస్ వ్యాఖ్యానించారు.
న్యూస్ యాంకర్ల బహిష్కరణతో 'ఇండియా' కూటమి సాధించేదేంటి?
కేసీఆర్: ‘‘పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ ప్రగతి రథ చక్రాలు దూసుకుపోతున్నాయి’’

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం దగ్గర అమరులకు కేసీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
పబ్లిక్ గార్డెన్స్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. విద్యుత్ రంగ సంక్షోభాన్ని అధిగమించి 24 గంటల పాటు వ్యవసాయానికి పూర్తిగా ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే.
పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా ఈ మధ్యే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోంది.
దేశంలో అందరూ తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుకుంటున్నారు.
తెలంగాణ ప్రగతికి అడ్డుపడాలని ప్రయత్నించే వారు పరాజయం పాలవుతారు. సమైక్యతే మన బలం. జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు అందరం కలిసి కృషి చేద్దాం’’ అని అన్నారు.
‘‘నేను శవాల్లో అందాన్ని వెదికేవాడిని’’
బ్రెజిల్: అమెజాన్ అడవుల్లో విమానం కూలి 14 మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల మధ్య ఉన్న బార్సిలోస్ నగరంలో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మరణించారు.
అమెజానాస్‌లోని మనుస్ నుంచి బార్సిలోస్‌కు వెళ్తున్న చిన్న ప్రొపెల్లర్ విమానం మార్గమధ్యంలో కూలిపోయింది.
భారీ వర్షం కారణంగా ల్యాండ్ అయ్యే క్రమంలో విమానం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా చనిపోయారు.ఇద్దరు సిబ్బందితో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఫొటో సోర్స్, MICHAEL DANTAS/AFP via Getty Images
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీజేపీ: పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం, అమిత్ షా హాజరు

ఫొటో సోర్స్, @TelanganaBJP
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.
సెప్టెంబరు 17ను పురస్కరించుకుని తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని, అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించారు.
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఫొటో సోర్స్, @TelanganaBJP
ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు భాజపా రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా నాంపల్లిలో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.
ఇదే సమయంలో అన్ని జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు ఎగురవేయనున్నారు.

ఫొటో సోర్స్, @TelanganaBJP
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
