బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
శుక్రవారం మళ్లీ కలుద్దాం.
థాంక్స్.
పదవిలో ఉంటుండగా విడాకులు తీసుకున్న రెండో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. అంతకుముందు ఆయన తండ్రి ఎలియట్ ట్రూడో కూడా ప్రధాని పదవిలో ఉన్నప్పుడే తన భార్య మార్గరెట్ ట్రూడోతో విడిపోయారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
శుక్రవారం మళ్లీ కలుద్దాం.
థాంక్స్.

ఫొటో సోర్స్, Getty Images
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖకు అలహాబాద్ హైకోర్ట్ అనుమతి ఇచ్చింది.
ఈ విషయంలో ఇంతకుముందు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
తీర్పు అనంతరం హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ.. సర్వే వెంటనే అమలులోకి వస్తుందని చెప్పారు. దీనిపై ముస్లింల పక్షం కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తాము కూడా వెళ్తామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడేం జరిగింది..
జులై 21
జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయమైన సర్వే చేపట్టాలని వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఈ సర్వే చేపట్టాలని కోర్టు సూచించింది.
జులై 24
కోర్టు ఆదేశాలతో ఏఎస్ఐ బృందం జ్ఞాన్‌వాపి మసీదు వద్దకు చేరుకుంది. మసీదు ఇటుకలను ఈ బృందం పరిశీలించి కొలతలు తీసుకుంది. మట్టి నమూనాలు తీసుకుంది. ప్రాంగణం ఫొటోలు, వీడియోలు కూడా తీశారు.
అయితే, మసీదు కమిటీ ఈ సర్వేను బహిష్కరిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వెంటనే విచారణ జరిపిన సుప్రీంకోర్టు మధ్యాహ్నానికి సర్వేపై రెండు రోజుల స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ మసీదు కమిటీని అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
జులై 26, 27
సుప్రీంకోర్టు సూచన మేరకు మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఆదేశాలను సవాల్ చేసింది. రెండు రోజుల పాటు వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తూ.. అంతవరకు సర్వే కొనసాగించరాదనిఆదేశించింది.
ఆగస్ట్ 3
ఏఎస్ఐ జ్ఞానవాపి మసీదులో తన సర్వే కొనసాగించవచ్చంటూ అలహాబాద్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన భార్య సోఫీ తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు.
విడాకుల తరువాత కూడా ప్రేమ, గౌరవాలతో క్లోజ్ ఫ్యామిలీగానే ఉంటామని ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
ట్రూడో, సోఫీలకు 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.
కాగా విడాకుల ఒప్పందంపై ఇద్దరూ సంతకం చేసినప్పటికీ కలిసి ప్రజల్లోకి వస్తారని ట్రూడో కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అయితే, గత కొంత కాలంగా వీరిద్దరూ బహిరంగంగా కలిసి కనిపించింది తక్కువే. ఈ ఏడాది మే నెలలో కింగ్ చార్ల్స్ 3 పట్టాభిషేకానికి ఇద్దరూ కలిసివెళ్లారు.
అంతకుముందు మార్చి నెలలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటన సందర్భంగానూ ఈ దంపతులు కలసికట్టుగా ఆతిథ్యమిచ్చారు.
కాగా పదవిలో ఉంటుండగా విడాకులు తీసుకున్న రెండో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. అంతకుముందు ఆయన తండ్రి ఎలియట్ ట్రూడో కూడా ప్రధాని పదవిలో ఉన్నప్పుడే తన భార్య మార్గరెట్ ట్రూడోతో విడిపోయారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.