డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారంటూ నేరాభియోగాలు
అమెరికాను మోసగించడానికి కుట్ర పన్నడం, సాక్ష్యాలను మార్చడం, పౌర హక్కుల భగ్నానికి పాల్పడడం వంటి ఆరోపణలు మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీద నమోదు చేశారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
శిక్షపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ అఫిడవిట్

ఫొటో సోర్స్, ANI
మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో తనపై విధించిన శిక్షపై స్టే ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అభ్యర్థించారు.
ఈ కేసులో తానేమీ తప్పు చేయలేదని రాహుల్ తన అఫిడవిట్‌లో చెప్పారు. తనపై వేసిన శిక్ష తగినది కాదన్నారు.
శిక్ష తగ్గింపు కోసం ఒకవేళ క్షమాపణ కోరితే, తాను తప్పుచేసినట్లు అవుతుందని ఆయన అఫిడవిట్‌లో చెప్పారు.
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పేందుకు తిరస్కరిస్తుండటంతో, ఆయన్ను ‘అహంకారి’ అంటూ సుప్రీంకోర్టుకు ఇచ్చిన సమాధానంలో ఫిర్యాదుదారు అయిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ ఈశ్వర్‌భాయ్ మోదీ అన్నారు.
శిక్షపై స్టే విధిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కుదురుతుందని కోర్టుకు విన్నవిస్తున్నట్లు రాహుల్ తన అఫిడవిట్‌లో తెలిపారు.
మోదీ ఇంటి పేరు మీద చేసిన వ్యాఖ్యలకుగాను రాహుల్‌కు గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో, రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
సన్నగా ఉంటే హానికర కొవ్వు లేనట్టా? TOFI అంటే తెలుసా?
రోజూ ఒకే సమయానికి నిద్రపోకపోతే ఏమవుతుంది?
బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు పట్టాలి? పాలు బాగా పడాలంటే ఏం తినాలి?
పామాయిల్ రైతులు: టన్ను 23 వేలున్న ధర 13 వేలు అయ్యింది, మేం ఎలా బతకాలి?
ఎయిర్‌బస్ బెలూగా: శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన భారీ కార్గో విమానం

ఫొటో సోర్స్, RGIA/Twitter
ప్రపంచంలోని భారీ కార్గో విమానాలలో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ)లో దిగింది.
ఈ మేరకు ఆర్‌జీఐఏ ‘ఎయిర్‌బస్ బెలూగా’ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇంతకుముందు 2022 డిసెంబర్‌లో ఓసారి ఈ విమానం శంషాబాద్‌లో విమానాశ్రయంలో ఆగింది.
ఇప్పుడు రావడంతో రెండోసారి హైదరాబాద్‌కు వచ్చినట్లయింది.
ఆకారం రీత్యా డాల్ఫిన్‌తో, పరిమాణం రీత్యా తిమింగలంతో దీన్ని పోల్చుతుంటారు.
భారత్ నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోతే ప్రపంచంలో ఆహార సంక్షోభం మొదలవుతుందా?
వాయేజర్-2 : నాసాతో తిరిగి పూర్తిగా కాంటాక్ట్‌లోకి వచ్చిన స్పేస్‌క్రాఫ్ట్, ఇది ఎలా సాధ్యమైందంటే...
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారంటూ డోనల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాలు

ఫొటో సోర్స్, Getty Images
2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నించారంటూ మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై నేరాభియోగం నమోదైంది.
అమెరికాను మోసగించడానికి కుట్ర పన్నడం, సాక్ష్యాలను మార్చడం, పౌర హక్కుల భగ్నానికి కుట్రపన్నడం సహా నేరారోపణలు నమోదు చేశారు.
2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ వద్ద అల్లర్లకు సంబంధించిన పరిణామాలపై విచారణను తాజా నేరాభియోగాలు పరిమితం చేస్తాయి.
కాగా వచ్చే అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న 77 ఏళ్ల ట్రంప్ తానే తప్పు చేయలేదన్నారు. తాజా కేసులు హాస్యాస్పదమంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
కాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్‌పై ఇప్పటికే క్లాసిఫైడ్ ఫైల్స్ నిర్వహణలో తప్పులు, పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లింపులకు సంబంధించిన కేసులున్నాయి.
జో బైడెన్ విజయం, క్యాపిటల్ వద్ద అల్లర్ల మధ్య రెండు నెలల కాలంలో ట్రంప్ ఏమేం చేశారనే విషయంలో దర్యాప్తు జరుగుతోంది.
హాయ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
