బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
మరిన్ని వార్తలతో బుధవారం కలుద్దాం.
థాంక్స్!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తప్పుడు కమాండ్స్ వల్ల వాయేజర్-2 వ్యోమనౌక భూమితో సంబంధాలు కోల్పోయింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
మరిన్ని వార్తలతో బుధవారం కలుద్దాం.
థాంక్స్!

ఫొటో సోర్స్, NASA
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తప్పుడు కమాండ్స్ వల్ల వాయేజర్ -2 వ్యోమనౌక భూమితో సంబంధాలు కోల్పోయింది.
ఈ వ్యోమనౌక అంతరిక్షాన్ని అన్వేషించడానికి 46 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తోంది. గత నెల నాసా అంతరిక్ష నౌకకు తప్పుడు ఆదేశం ఇచ్చింది. దీంతో జులై 21 నుంచి అది నాసాతో కాంటాక్ట్ కోల్పోయింది. అనంతరం డేటా చేరడం ఆగిపోయింది.
ఫ్లైట్ కంట్రోలర్లు పొరపాటున సంబంధిత వాహనం యాంటెనాను పక్కకు తిప్పడంతో, వ్యోమనౌక సంబంధాలు కోల్పోయిందని ప్రాజెక్ట్ మేనేజర్ సుసాన్ డాడ్ తెలిపారు. అయితే, నాసా డీప్ స్పేస్ నెట్‌వర్క్ వాయేజర్ సిగ్నల్స్ అందుకుందని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది. అంటే ఈ వ్యోమనౌక ఇంకా పని చేస్తోంది.
వాయేజర్ -2 సిగ్నల్స్ అందడంతో తమకు ఒక నమ్మకం ఏర్పడిందని సుసాన్ తెలిపారు. దానితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, ASLAMKHAN
దిల్‌నవాజ్ పాషా
బీబీసీ ప్రతినిధి
సోమవారం హరియాణాలోని మేవాత్ ప్రాంతంలో జరిగిన మతపరమైన హింస తర్వాత, గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లో ఉన్న మసీదుకు నిప్పు పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
మసీదు నిర్వహణ కమిటీ ఛైర్మన్ బీబీసీతో మాట్లాడుతూ "ఈ ఘటనలో మసీదు ఇమామ్ మౌలానా సాద్ మరణించారు మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు." అని చెప్పారు.
ఈ వార్తను ధృవీకరించడానికి గురుగ్రామ్ పోలీసులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, వారు స్పందించలేదు.
‘‘నాకు మా అన్నయ్య ముఖం మాత్రమే కనబడింది. ప్రస్తుతం మార్చురీలో ఉంచారు. మేం ఈ విషయంలో కేసు పెడతాం. ఏడు నెలలుగా మా అన్నయ్య మసీదులో ఇమామ్‌గా పని చేస్తున్నాడు’’ అని ఇమామ్ మౌలానా సాద్ సోదరుడు షాదాబ్ అన్వర్ బీబీసీతో అన్నారు. సాద్ వయసు 22 ఏళ్లు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ విషయంపై హరియాణా అంజుమన్ ట్రస్ట్ చైర్మన్ మహ్మద్ అస్లాం ఖాన్ బీబీసీతో మాట్లాడారు. "మేవాత్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత, సోమవారం సాయంత్రం పోలీసు బృందం మా దగ్గరికి వచ్చి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది" అని అన్నారు. “మేము ప్రార్థనలు చేసి మసీదు నుండి తిరిగి వచ్చాము. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. 12 గంటల నుంచి 12.30 గంటల మధ్య హఠాత్తుగా మసీదుపై దాడి జరిగింది. ముందుగా మసీదు కెమెరాలను పగలగొట్టి, ఆపై నిప్పంటించారు’’ అని అస్లాం వెల్లడించారు.
విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సోమవారం మేవాత్‌లో యాత్రను నిర్వహించాయి. ఈ యాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
మహారాష్ట్రలోని ఠాణేలోని షాపూర్ దగ్గర మంగళవారం జరిగిన ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. మహరాష్ట్ర మంత్రి దాదాజీ భూసే ఈ ప్రమాదాన్ని ధృవీకరించినట్లు ఏబీపీ న్యూస్ వెల్లడించింది.
ఠాణేలోని షాపూర్‌లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లాంచింగ్ మెషీన్ కూలిపోవడంతో దానికింద పడి 16మంది మరణించారని ఏఎన్ఐ వెల్లడించింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని, కూలిన యంత్రం కింద ఇంకొంతమంది ఉండే అవకాశం ఉందని కూడా ఏఎన్ఐ తెలిపింది.
ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.