మణిపుర్ వైరల్ వీడియో కేసు: ఎఫ్‌ఐఆర్‌కు 14 రోజులు ఎందుకు పట్టింది? - ప్రశ్నించిన సుప్రీంకోర్టు

మణిపుర్ హింస, మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వైరల్ వీడియోపై సుప్రీం కోర్టు సోమవారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ప్రశ్నలు సంధించింది.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని వార్తలతో రేపు కలుద్దాం.

  2. ఈ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు ఇంట్లోకి రావు

  3. సాకే భారతికి ఐదు ఎకరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఇచ్చారా? ఈ వార్తలపై ఆమె ఏమన్నారు?

  4. క్వీన్ విక్టోరియా: ఏడుసార్లు హత్యాయత్నం జరిగినా ప్రజల్లో తిరిగిన రాణి.. నిజంగా ధైర్యవంతురాలేనా?

  5. విశాఖ: ‘బాత్రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి, మా అమ్మను చంపేసి వచ్చాడు'

  6. వందల మంది రష్యా సైనికులను గుట్టుచప్పుడు కాకుండా చంపేస్తున్న ‘బఖ్‌ముత్ ఘోస్ట్స్’ ఎవరు?

  7. మణిపుర్ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు 14 రోజులు ఎందుకు పట్టింది?: సుప్రీంకోర్టు

    చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్

    ఫొటో సోర్స్, ANI

    మణిపుర్ హింస, మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వైరల్ వీడియోపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది.

    మణిపుర్‌లో జరిగినట్లుగానే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని అనలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

    మణిపుర్ హింసపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

    బీబీసీ ప్రతినిధి సుచిత్రా మొహంతి అందించిన వివరాల ప్రకారం, "మణిపుర్‌లో జాతి ఘర్షణల సమయంలో మహిళలపై గతంలో ఎన్నడూ చూడని హింసను చూస్తున్నాం. ఇదే అదనుగా బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో మహిళలపై హింసను కూడా దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వేరే వ్యవహారం.మణిపుర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏం చేయాలో చెప్పండి. ఇతర చోట్ల మహిళలపై హింసను ఉదహరించడం ద్వారా మణిపుర్ కేసును సమర్థించలేం’’ అని చంద్రచూడ్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.

    సుప్రీం కోర్టు

    ఫొటో సోర్స్, ANI

    మణిపుర్‌లో ఘటన మే 4న జరిగితే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి 14 రోజుల సమయం ఎందుకు పట్టిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతాను చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. మే 4 నుంచి 18 మధ్య పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు.

    ఇద్దరు మహిళలను మూక నగ్నంగా నడిపించిన భయంకరమైన ఘటన అదొక్కటే కాదని, అలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది.

    ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించిన ఘటనకు సంబంధించి మే 4 వ తేదీన వెంటనే ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, పోలీసులకు ఉన్న సమస్య ఏంటని సొలిసిటర్ జనరల్‌ మెహతాను చీఫ్ జస్టిస్ నిలదీశారు.

    వీడియో వైరల్ అయిన 24 గంటల్లోనే ఏడుగురిని అరెస్టు చేశామని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ మెహతా తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని కోర్టు ప్రశ్నించింది.

    ఘటన తాలూకూ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటివరకు 20 ఎఫ్‌ఐఆర్‌లు, రాష్ట్రవ్యాప్తంగా 6000కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తుషార్ మెహతా బదులిచ్చారు.

    దీనికి స్పందించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్- ‘‘ఇంకో విషయం మొత్తం 6000 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని మీరు చెప్పారు.ఇందులో పెట్టిన వివిధ రకాల కేసులు ఏంటి? మహిళలపై నేరాలకు సంబంధించి ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి? ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లలో హత్యలు, దహనం, ఇళ్లు తగులబెట్టడం వంటి ఇతర తీవ్ర నేరాలు నమోదయ్యాయి? వ్యక్తులపై జరిగిన నేరాలను ఎలా విభజన చేశారు? ఆస్తులపై, ప్రార్థనా స్థలాలపై జరిగిన నేరాలను ఎలా నమోదు చేశారు’’ అని ప్రశ్నించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. భారత అత్యున్నత న్యాయస్థానంపై పెండింగ్ కేసుల భారం

    సుప్రీం కోర్టు

    ఫొటో సోర్స్, Getty Images

    2018 నవంబరు నాటికి సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్లో 40 శాతం అయిదేళ్ల కంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 8 శాతం కేసులు పదేళ్లుగా పెండింగులో ఉన్నాయి.

  9. చమురు సంపన్న దేశమైన వెనిజ్వెలా పతనానికి కారణమేంటి?

    వెనిజ్వెలా

    ఫొటో సోర్స్, Getty Images

    వెనిజ్వెలాలో శరణార్థుల సంక్షోభాన్ని అర్థం చేసుకునేందుకు బీబీసీ జర్మనీలోని బీలెఫెల్డ్ యూనివర్సిటీకి చెందిన శరణార్థుల రీసెర్చర్ మారియా గాబ్రియేలా ట్రాన్పోటెరోతో మాట్లాడింది.

    గత ఏడేళ్లుగా 73 లక్షల మంది వరకు దేశం విడిచి వెళ్లిపోయారని మారియా గాబ్రియేలా చెప్పారు.

    వీరిలో చాలా మంది ఇతర లాటిన్ అమెరికా దేశాలకు లేదా కరేబియన్ దేశాలకు వెళ్లినట్లు తెలిపారు. ఈ దేశంలో ఏం జరుగుతోంది?

  10. మణిపుర్ వైరల్ వీడియో కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధిత మహిళలు, నేడు విచారణ

    supreme court

    ఫొటో సోర్స్, Reuters

    మణిపుర్ 'లైంగిక వేధింపుల వైరల్ వీడియో' కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

    ఈ లైంగిక వేధింపుల కేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలంటూ బాధిత ఇద్దరు మహిళలు సుప్రీంను ఆశ్రయించారు.

    దీంతో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.

    అయితే, తమ గుర్తింపును బహిరంగపరచవద్దని బాధిత కుకీ మహిళలు కోర్టును అభ్యర్థించారు.

    ఈ రోజు కేసుపై విచారణ ఉంటుందని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ సుచిత్రా మొహంతికి బాధిత మహిళల తరఫు న్యాయవాది చెప్పారు.

    మణిపుర్‌లో ఇద్దరు కుకీ మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించి, లైంగిక వేధింపులకు గురి చేసిన వీడియో సోషల్ మీడియాలో జూలై 19న వెలుగులోకి వచ్చింది.

    అయితే ఈ ఘటన మే 4న జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసుపై సీబీఐ కూడా విచారణ జరుపుతోంది.

  11. జైపుర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు, నలుగురు మృతి

    తుపాకీ

    ఫొటో సోర్స్, Getty Images

    జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) జవాన్‌ జరిపిన కాల్పులలో నలుగురు మరణించారు. రైలు సోమవారం జైపూర్‌ నుంచి ముంబయి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

    నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తెలిపింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత, కదులుతున్న రైలులో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపారని పశ్చిమ రైల్వే తెలిపింది.

    ఈ ఘటనలో ఓ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు.

    కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.