థాయ్‌లాండ్: బాణాసంచా గోదాంలో పేలుడు, 9 మంది మృతి
పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి.
లైవ్ కవరేజీ
జాన్వీ కపూర్: ‘బవాల్’లో యూదుల ఊచకోతను చిన్నది చేసి చూపించారా? హిట్లర్ ప్రస్తావన, గ్యాస్ చాంబర్ సన్నివేశాలపై వారి అభ్యంతరాలు ఏమిటి?
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
థాయ్‌లాండ్: బాణాసంచా గోదాంలో పేలుడు, 9 మంది మృతి

థాయ్‌లాండ్‌లోని బాణాసంచా గోదాంలో పేలుడు సంభవించడంతో తొమ్మిది మంది మరణించారు. మరో 115 మందికి పైగా గాయపడ్డారు.
శనివారం మధ్యాహ్నం దక్షిణ థాయ్‌లాండ్‌లోని సుంగై కలోక్ నగరంలో ఈ పేలుడు జరిగింది. వెల్డింగ్ పనుల వల్ల ఈ పేలుడు సంభవించిందని స్థానిక గవర్నర్ సనన్ పొంగక్సోర్న్ తెలిపారు.
పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, గోడలు కూలిపోయాయి.
''నీళ్లు ఇంట్లో నుంచి పోవట్లేదు.. లోపలికి పాములు వస్తున్నాయి''
మణిపుర్: నాడు సంచలన నిరసన తెలిపిన మైతేయి మహిళలు నేటి హింసపై ఏమంటున్నారు?
సమాజానికి దూరంగా ఉండాలని అడవిలో బతికేందుకు వెళ్లారు, కానీ చివరకు....
‘లవ్ బాంబింగ్’ అంటే ఏంటి, దీనికి ఎవరు ఎలా బలి అవుతారు?
మర్డర్ మిస్టరీ: ఆ 11 మంది నన్‌లు ఎలా చనిపోయారు?
తెలంగాణ వరదలు: 18 మంది మృతి. భారీగా ఆస్తి, పంట నష్టం

ఫొటో సోర్స్, UGC
తెలంగాణలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే, పలు జిల్లాల్లో వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. కుంభవృష్టి వానలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా 18 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో నీళ్లలో గల్లంతయ్యారు. మృతుల్లో చెరువుల్లో కొట్టుకుపోయిన వారితో పాటు చెట్లు, ఇళ్లు కూలి చనిపోయిన వారు ఉన్నారు.
జులై 27న ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రాంతం కొండాయి గ్రామానికి చెందిన 10 మంది వరద ఉధృతికి కొట్టుకుపోగా, వారిలో 8 మంది మృతదేహాలు మేడారం సమీపంలో జంపన్న వాగులో లభ్యమయ్యాయి.
వరంగల్, ఖమ్మం, భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, UGC
భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం నీట మునిగి సర్వం కోల్పోయారు. గ్రామస్థులు ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వరద నీరు ముంచెత్తిన గ్రామాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు.

ఫొటో సోర్స్, UGC
వరద గోదావరి:
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. గోదావరి ఉధృతితో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
కాళేశ్వరం వద్ద 12.7 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది.
ప్రమాదం నుంచి బయటపడ్డ కడెం ప్రాజెక్ట్
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ భారీ వరద ప్రమాదం నుంచి బయటపడింది. సామర్థ్యానికి మించి వరద రావడం, 4 గేట్లు మొరాయించడం ఆందోళనకు కారణమైంది. దీంతో ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల నుంచి 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వరద తగ్గడంతో నిర్వాసితులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.
కడెం ప్రాజెక్టుకు ప్రస్తుతం 6 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 7.6 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రిజర్వాయర్‌లో నీటి లెవల్‌ను అధికారులు తగ్గిస్తున్నారు.
నిన్న 20 మంది సభ్యుల కేంద్ర జల కమిషన్ బృందం కడెం ప్రాజెక్టును పరిశీలించింది. ప్రాజెక్టు భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై ఈ బృందం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది.

ఫొటో సోర్స్, UGC
భారీగా ఆస్తి, పంట నష్టం
నాలుగు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం తెలంగాణలో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా వరి, సోయాబీన్, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా.
నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వరి పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. కొన్ని ప్రాంతాల్లో నారు దశలోనే పంట కొట్టుకుపోయింది.
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వంతెనలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రమాదాలకు అవకాశం ఉన్న లోలెవల్ వంతెనలు, కాజ్ వే లపై నుంచి రాకపోకలను నిషేధించారు.
కాళేశ్వరం (మేడిగడ్డ) బ్యారేజీ నుంచి 85 గేట్ల ద్వారా 13 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువన గోదావరిలోకి వదులుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం నిన్నటి కంటే తగ్గింది. ప్రాజెక్టు సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 16 గేట్ల ద్వారా 44 వేల క్యూసెక్కులను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
వరద గుప్పిట్లోనే వరంగల్ కాలనీలు
వరంగల్, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బందం వాగు, భద్రకాళీ నాలాల నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. బీఎన్ నగర్, ఎన్ఎన్ నగర్ తో పాటు పలు కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది.
ఎన్టీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, UGC
తెలంగాణలో వర్షాలతో ఏర్పడ్డ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరదలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభావిత జిల్లాల్లో మంత్రులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు.
బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను రక్షించిన నౌకాదళం

ఫొటో సోర్స్, Indian Navy
తమిళనాడు తీరానికి 130 నాటికల్ మైళ్ల దూరంలో బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను భారత నౌకాదళం కాపాడింది.
ప్రతికూల వాతావరణం, ఇంధనం లేకపోవడం, ఇంజిన్ పాడైపోవడం వల్ల వీరు మూడు ఫిషింగ్ వెసల్స్‌లో సముద్రంలో రెండు రోజులకు పైగా చిక్కుకుపోయారు.
మత్స్యకారులను కాపాడిన అనంతరం ఈ మూడింటిని నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ ఖంజర్ ప్రతికూల పరిస్థితుల మధ్య శుక్రవారం చెన్నై తీరానికి లాక్కొని వచ్చింది. ఇందుకు 30 గంటలకు పైగా పట్టింది.
మత్స్యకారులు తమిళనాడులోని నాగపట్టిణంకు చెందినవారు.
హాయ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారా, ఆమె చివరి రోజు యుద్ధరంగంలో ఏం జరిగింది?
