అక్కడ ఏడాది అంటే భూమిపై 84 ఏళ్లు.. ఆ సుదూర గ్రహం విశేషాలు ఇవీ

ఫొటో సోర్స్, WEBBTELESCOPE.ORG
భూమిపై ఉన్న పలు నగరాలకు, దేశాలకు సమయాల్లో తేడాలున్నట్లే సౌర వ్యవస్థలోని గ్రహాల సమయాలకూ తేడా ఉంటుంది. ఓ గ్రహానికి మనకైతే ఏకంగా 84 ఏళ్ల తేడా ఉంది.
అంటే మనకు 84 ఏళ్లు గడిస్తేగానీ అక్కడ ఏడాది పూర్తవదు. అదే యురేనస్.
సౌర వ్యవస్థలోని ఆ గ్రహం చుట్టూ ఉన్న కాంతి వలయాలను ఇంతకుముందెప్పుడూ చూసి ఉండరు.
దూరం నుంచి చూసినప్పుడు ఈ గ్రహం కాంతి గుండ్రని వృత్తంలో ఉన్నట్లు కనిపిస్తుంది.
యురేనస్‌కు సంబంధించిన కొత్త చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) షేర్ చేసింది.
ఈ చిత్రాలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో తీశారు.
యురేనస్ సౌర వ్యవస్థలో ఏడో గ్రహం.
1986లో వాయేజర్ 2 అంతరిక్ష నౌక ఈ గ్రహం దగ్గరకు వెళ్లినప్పుడు, నీలం-ఆకుపచ్చ బంతిని పోలిన యురేనస్ చిత్రం కెమెరాకు చిక్కింది. అయితే అందులో కాంతి వలయాలు కనిపించలేదు.

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH
అటు సూర్యరశ్మి, ఇటు దట్టమైన చీకటి
ఇన్‌ఫ్రారెడ్ వేవ్‌లెంత్ సహాయంతో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యురేనస్ చిత్రాలను తీసినట్లు నాసా తెలిపింది. ఇది గ్రహం చుట్టూ ప్రకాశవంతమైన వలయాలు ఉన్నట్లు చూపిస్తుంది.
సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాల కంటే యురేనస్ ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది. దాదాపు 90 డిగ్రీల వంపుతో తిరిగే ఏకైక గ్రహం ఇది.
ఈ కారణంగా యురేనస్ మీద ఏ సీజన్ అయినా దాని గరిష్ట స్థాయిలో ఉంటుంది.
ధ్రువ ప్రాంతాలలో సూర్యరశ్మి ఏళ్ల తరబడి ఉంటుంది. అంతే కాలంపాటు దట్టమైన చీకటీ ఉంటుంది.
ఇక్కడ ఒక ఏడాది మనకు 84 సంవత్సరాలకు సమానం.
యురేనస్‌పై ఒక రోజును 17 గంటల 14 నిమిషాలుగా లెక్కిస్తారు. అంటే ఈ సమయంలో అది పూర్తిగా తన కక్ష్య మీద తిరుగుతుంది.
కానీ, యురేనస్ ఒక సంవత్సరం భూమిపై 30,687 రోజులకు (84 ఏళ్లకు) సమానం. అంటే, ఈ గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 84 ఏళ్లు పడుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యురేనస్ చుట్టూ 13 వలయాలు ఉన్నాయని, వీటిలో 11 వలయాలు జేమ్స్ వెబ్ తీసిన ఫొటోలో కనిపిస్తున్నాయంటూ విశ్వసిస్తారు.
దానిలో కొన్ని రింగులు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి, అవన్నీ కలిసి ఓ భారీ రింగ్‌ను సృష్టించాయి.
భవిష్యత్తులో తీయబోయే ఫొటోలలో మిగిలిన ఆ రెండు రింగులనూ చూడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రింగుల గురించిన సమాచారం 2007లో వచ్చింది.

ఫొటో సోర్స్, NASA
యురేనస్ ఉపరితలంపై మంచు
యురేనస్ ఉపరితలంపై అత్యధిక భాగం స్వల్పంగా కరిగిన మంచు ఉంది.
నెప్ట్యూన్, యురేనస్‌లను మంచు గ్రహాలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అవి ఘనీభవించిన నీరు, మీథేన్, అమ్మోనియాతో తయారయ్యాయి.
అయితే రెండూ కూడా బృహస్పతి, శని వంటి వాయు గ్రహాలే. ఈ వార్త ప్రారంభంలోని ఫొటోలో కనిపించే యురేనస్ నీలం రంగును రెండు ఫిల్టర్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా చూపించారు.
ఈ చిత్రంలో కనిపించే ప్రకాశవంతమైన ధ్రువ భాగం సూర్యుని వైపు ఉంది, దానిని పోలార్ క్యాప్ అంటారు. ఇది గ్రహానికి కుడి వైపున ఉంది.
ఈ భాగం సూర్యకాంతిలోకి వచ్చినప్పుడు ఈ క్యాప్ ఉద్భవిస్తుంది. సూర్యుడు అస్తమించినప్పుడు అదృశ్యమవుతుంది. ఇది ఎలా జరుగుతుందో ఇంకా తెలియదు.
అంతేకాకుండా ఫొటోలో గ్రహం దక్షిణ ధ్రువం చీకటిలో ఉంది. అందువల్ల కనిపించలేదు.

ఫొటో సోర్స్, WEBBTELESCOPE.ORG
యురేనస్‌ను అర్థం చేసుకోవడానికి ఇది సరిపోతుందా?
పోలార్ క్యాప్ అంచున, అంతేకాకుండా గ్రహం ఎడమ వైపున ప్రకాశవంతమైన మేఘాలు ఉన్నాయి.
అయితే, ఈ మేఘాలు మంచు తుఫాను సంబంధితమై ఉండొచ్చు.
కెమెరా ముందు యురేనస్ 12 నిమిషాల పాటు ఉండగా ఈ చిత్రాన్నిజేమ్స్‌వెబ్ టెలిస్కోప్ తీసింది.
అయితే యురేనస్‌ను అర్థం చేసుకోవడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి అందిన సమాచారం ఇంకా తక్కువేనని నాసా భావిస్తోంది.
10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 81 వేల కోట్ల) ఖర్చుతో తయారుచేసిన ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను 2021 డిసెంబర్‌లో ప్రయోగించారు.
ఈ ప్రాజెక్ట్ అమెరికా, యూరప్, కెనడా స్పేస్ సెంటర్ల జాయింట్ వెంచర్.
ఇది ప్రసిద్ధ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంటే ఆధునికమైనదిగా భావిస్తారు.
ఆయా ప్రదేశాలను ఇది సూక్ష్మ స్థాయిలో పరిశీలించగలదు.
గ్రహాలపై ఎలాంటి అణువులు ఉన్నాయో కూడా జేమ్స్ వెబ్ చూడగలదు కాబట్టి ఇతర గ్రహాలపై జీవం ఆనవాళ్లను పరిశోధించడంలో ఇద సహాయపడుతుంది.

ఫొటో సోర్స్, NASA
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లక్ష్యాలు అవే
వెబ్ టెలిస్కోప్‌లో 6.5 మీ వెడల్పున్న గోల్డెన్ మిర్రర్లు, సూపర్ సెన్సిటివ్ ఇన్‌ఫ్రారెడ్ పరికరాలు అమర్చారు. వీటి సహాయంతో బిగ్‌బ్యాంగ్ ఏర్పడిన 600 మిలియన్ సంవత్సరాల తర్వాత ఉనికిలో ఉన్న గెలాక్సీల రెడ్ ఆర్క్‌ను గుర్తించగలిగింది.
విశ్వాన్ని జేమ్స్ వెబ్ ప్రధానంగా ఇన్ఫ్రారెడ్ కటకాలతో చూస్తుంది.
ఈ అంశంలో హబుల్ కన్నా మెరుగ్గా పనిచేస్తుంది. హబుల్ ఇన్ఫ్రారెడ్ సామర్థ్యానికి పరిమితి ఉంది.
అలాగే, హబుల్ కన్నా వెబ్‌కు పెద్ద అద్దాలు ఉన్నాయి. దానివల్ల కాలంలో మరింత వెనక్కు వెళ్లి చూడగలుగుతుంది.
హబుల్ భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలోనే ఉంది.
కానీ, వెబ్ భూమికి చాలా దూరంగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది చంద్రుడి కన్నా నాలుగు రెట్లు ఎక్కువ దూరం.
అంతరిక్షాన్ని అన్ని విధాలుగా ఇది పరీక్షిస్తుంది.
దీనికి రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి, 1,350 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో తొలిసారిగా మిణుకుమన్న నక్షత్రాలను ఫొటో తీయడం. రెండోది, ఇతర గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయో లేదో గుర్తించడం.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- ఆంధ్రప్రదేశ్: “గుండెలు పిసికేసీ తలంతా అదిమినట్లు అనిపిస్తోంది. నాకు ఇంకేమి తెలియదు” అంటూ ఆ గ్రామస్థులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?
- అల్-అక్సా మసీదు: ఇక్కడ మేకను బలి ఇవ్వడం గురించి రెండు మతాల మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతోంది
- ‘‘యుక్రెయిన్, రష్యాల యుద్ధాన్ని ఆపడానికి సాయం చేయండి’’ జిన్‌పింగ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడి వినతి
- కేరళ ఆదివాసీ యువకుడి హత్య కేసులో 5ఏళ్ల తరువాత తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














