ఆసియా క్రీడలు: గుర్రపు స్వారీలో 41 ఏళ్ల తర్వాత భారత్‌కు గోల్డ్ మెడల్, ప్రశంసించిన మోదీ

ఫొటో సోర్స్, ANI
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత అరుదైన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత హార్స్ రైడింగ్‌లో దేశానికి గోల్డ్ మెడల్ లభించింది.
అనూష అగర్వాల, హృద్యా విపుల చద్దా, దివ్యకృతి సింగ్, సుదీప్తి హజేలాలతో కూడిన భారత ఈక్వెస్ట్రియన్ డ్రస్సేజ్ ఈవెంట్ మిక్స్‌డ్ టీం విభాగంలో 209.205 పాయింట్లతో విజేతగా నిలిచింది.
23 ఏళ్ల అనూష అగర్వాల అత్యధికంగా 71.088 పాయింట్లు సాధించింది.
ఈ పోటీల్లో చైనా రజత పతకం, హాంగ్‌కాంగ్ కాంస్య పతకం సాధించాయి.
భారత బృందం విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
“దశాబ్దాల తర్వాత భారత ఈక్వస్ట్రియన్ టీం గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో గర్వకారణం. అంతర్జాతీయ వేదికపై హృదయా చద్దా, అనూష అగర్వాల, సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్ లు తమ అసామాన్య నైపుణ్యాలు, అద్భుతమైన ప్రదర్శనలతో దేశం గర్వపడేలా చేశారు. చరిత్రాత్మక విజయాన్ని సాధించిన బృందానికి హృదయపూర్వక అభినందనలు” అని ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మూడో రోజు మూడు పతకాలు
ఆసియా క్రీడల్లో మూడో రోజు మంగళవారం మొత్తం మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.
గుర్రపు స్వారీలో గోల్డ్ మెడల్ రాగా, మరో రెండు విభాగాల్లో రజత, కాంస్య పతకాలు దక్కాయి.
సెయిలింగ్ పోటీల్లో 17 ఏళ్ల నేహా ఠాకూర్ 27 పాయింట్లు స్కోర్ సాధించి, రేస్‌లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు.
ప్రధాని మోదీ నేహా ఠాకూర్ విజయాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఎబాద్ అలీ మెన్స్ విండ్ సర్ఫర్ విభాగంలో 52 పాయింట్లతో కాంస్య పతకం సాధించారు. మోదీ అలీ విజయాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, getty
పతకాల వేటలో..
బాక్సింగ్‌లో 57 కేజీల విభాగంలో సచిన్ సివచ్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.
92+ కేజీల విభాగంలో నరేంద్ర బెర్వల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరారు.
మరోవైపు స్క్వాష్‌లో పూల్ ఏ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-0 తేడాతో ఖతార్ జట్టును ఓడించింది.
టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో సుమిత్ నగల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. కజకిస్థాన్‌కు చెందిన బెబిట్ జుకెవ్‌ను 7-6, 6,-4 తేడాతో ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో అంకిత్ రైనా, యుకీ భంబ్రీల జట్టు పాకిస్తాన్ కు చెందిన సారా ఖాన్, అఖీల్ ఖాన్‌ల జట్టును రెండో రౌండ్‌లో 6-0, 6-0 తేడాతో ఓడించారు.
హాకీలో పూల్ ఏ టీంలో భారత పురుషుల జట్టు సింగపూర్ జట్టుపై 16-1 తేడాతో విజయం సాధించింది.
తొలి స్థానంలో చైనా
మొత్తంగా ఏషియన్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ 14 పతకాలతో ఆరో స్థానంలో ఉంది.
95 పతకాలు (53 స్వర్ణ, 29 వెండి, 13 కాంస్య) సాధించిన చైనా తొలిస్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఏషియన్ గేమ్స్: అరుణాచల్‌ప్రదేశ్ అథ్లెట్లకు చైనా వేరే వీసాలు ఎందుకు ఇచ్చింది? వివాదమేంటి?
- కెనడా పార్లమెంట్ స్పీకర్ ఎందుకు క్షమాపణలు చెప్పారు?
- ఏఐతో టీనేజ్ అమ్మాయిల నగ్న చిత్రాలను తయారుచేసి, సోషల్ మీడియాలో పెట్టారు.. షాక్ అయిన పట్టణ ప్రజలు
- క్రిప్టో కరెన్సీలో సునీల్ కావూరి పెట్టిన రూ.17 కోట్లు క్షణాల్లో ఎలా మాయమయ్యాయి? అవి తిరిగి వస్తాయా?
- తల్లి 27 ఏళ్లు దాచిన రహస్యం డీఎన్ఏ పరీక్షతో బయటపడింది, అప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














