ప్రశాంత్ కిశోర్: పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసే ఈ వ్యూహకర్త బిహార్ ముఖ్యమంత్రి కాగలరా?

ప్రశాంత్ కిశోర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రశాంత్ కిశోర్ తన పార్టీ ‘జన్ సురాజ్’ తరఫున బిహార్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

మూడేళ్లగా దీనికోసం ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. బిహార్ బదలావ్ (బిహార్‌లో మార్పు) సభ ద్వారా ఆయన తన పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. ఇక్కడి ప్రజలు తనకొక అవకాశం ఇస్తారన్నది ప్రశాంత్ కిశోర్ నమ్మకం.

ఈ ఎన్నికల ఫలితాల్లో జన్ సురాజ్ ఉంటే అగ్రస్థానంలో ఉంటుందని, లేదా అట్టడుగున ఉంటుందని, మధ్యేస్థాయిలో ఫలితాలు మాత్రం రావని కలెక్టివ్ న్యూస్‌రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముఖేశ్ శర్మతో జరిగిన సంభాషణలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో పోటీ చేయడం నుంచి ముఖ్యమంత్రి కావాలనే కోరిక, నితీశ్ కుమార్ విధానాలు, తేజస్వి యాదవ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఎన్నికల సంఘానికి చేసిన సవాలు వరకు ప్రతిదాని గురించి మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్, జన్ సురాజ్ పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తుందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

మా మొదటి ప్రాధాన్యత నిరుద్యోగం, వలసలు. బిహార్‌లోని ఓ రాజకీయ సంస్థ వలసలను ఒక సమస్యగా చేయడం ఇదే మొదటిసారి.

రెండో అంశం విద్య. బిహార్‌లో చదువుకు సంబంధించిన పరిస్థితులు ఎప్పుడూ బాగా లేవు. లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యను అందించారు. నితీశ్‌ కుమార్ పాలనలో, ఈ పాఠశాలలు ప్రభుత్వ సౌకర్యాలను పంపిణీ చేసే కేంద్రాలుగా మారాయి. పాఠశాలలు విద్యాకేంద్రాలు అన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారు.

మూడో అంశం అధికారుల ఆధిపత్యం. నితీశ్ మొత్తం వ్యవస్థ నలుగురైదుగురు అధికారుల చేతుల్లో ఉంది.

ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్, బిహార్‌లో హంగ్ ఫలితాలు వస్తే తామెవరికీ మద్దతివ్వబోమని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

జన్ సురాజ్‌పై నమ్మకం అనేది తర్వాతి విషయం. బిహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేదా అనేది ప్రధానమైనది. 60 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రెండు, మూడేళ్లగా నాకర్ధమైంది.

ప్రశాంత్ కిశోర్
ప్రశాంత్ కిశోర్

మీకు నంబర్లు చెప్పలేను. కానీ మేము చేస్తున్న ప్రయత్నాలకు ఒకే ఒక ఫలితం ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. జన్ సురాజ్ ఉంటే సింహాసనంపై ఉంటుంది లేదా నేలపై ఉంటుంది. దీనికి మధ్యలో ఫలితం ఉండదు.

20, 25, 30, 40, 50 సీట్లు రావు. జన్ సురాజ్‌కు పది కంటే తక్కువ సీట్లు వస్తాయి లేదా వ్యవస్థ మార్పు సాకారమయ్యేలా ఎక్కువ సీట్లు వస్తాయి.

ఒకవేళ ఎక్కువాతక్కువా కాకుండా మధ్యలో నంబర్లు వస్తే ఏం చేస్తారు?

ప్రజలు ప్రభుత్వానికి ఓటు వేయడం మాత్రమే కాదు...ఎవరు ప్రభుత్వంలో ఉండాలో, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు వీధుల్లో ఉండాలో కూడా నిర్ణయిస్తారు. ప్రజలు మమ్మల్ని అయితే ప్రభుత్వంలోకి లేదా వీధుల్లోకి పంపుతారని నేను నమ్ముతున్నాను. మేం దానికి పూర్తి సిద్ధంగా ఉన్నాం.

ప్రజలు మమ్మల్ని వీధుల్లోకి పంపితే, ప్రతిపక్షంలో ఉండటం కంటే ఐదేళ్లు వీధుల్లో ఉండటం నాకు మంచిది. నేను ఇప్పుడు చేస్తున్న దానికంటే రెండింతలు కష్టపడి పనిచేస్తా. 10-20 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారని అనుకుందాం. ఎవరు ఏ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారో వెళ్లమని చెప్తా.

నేను వీధుల్లోనే ఉంటాను. మళ్లీ పోరాటాలు చేస్తాను. హంగ్ పరిస్థితి వస్తే మేం ఎవరికీ మద్దతివ్వబోం. మేం మంత్రులు కావాలని అనుకోవడం లేదు.

ప్రశాంత్ కిశోర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

అధికారంలోకి రావడమంటే ఉత్తర భారతదేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించినట్టే. ఓ వ్యక్తి పార్టీని స్థాపించిన రెండు-రెండున్నర సంవత్సరాలలో బిహార్ వంటి రాష్ట్రాన్ని గెలుచుకోవడం ఎప్పుడూ జరగలేదు.

గెలిచిన వారు నాయకుడిని ఎన్నుకునేంత సామర్థ్యం కలిగి ఉంటారు. పార్టీ మనోజ్ భారతిని అధ్యక్షునిగా, ఉదయ్ సింగ్‌ను జాతీయ అధ్యక్షుడిగా, సుభాష్ కుష్వాహాను ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్నట్టే...వారు భవిష్యత్ నాయకుడిని కూడా ఎన్నుకుంటారు.

గెలిచిన తర్వాత, నేను ముఖ్యమంత్రిని కావడం ఇష్టం లేదని చెప్పే అవకాశం ఉంది. నా జీవిత లక్ష్యం ముఖ్యమంత్రి కావడం కాదని నేను ప్రతిరోజూ చెబుతున్నాను.

ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెబుతున్నారు. కానీ ఇది పార్టీ నిర్ణయం. జన్ సురాజ్ వ్యవస్థ అంతటినీ కోర్ కమిటీయే నడిపిస్తుంది.

ఊరికే అలా చెబుతున్నారుగానీ ప్రశాంత్ కిశోరే పార్టీని నడిపిస్తున్నారని మీరనుకోవచ్చు. కానీ అది నిజం కాదు.

ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, తేజస్వియాదవ్‌పై ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేస్తున్నారు.
ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

మా పోరాటం నేరుగా ఎన్డీఏతోనే ఉంటుంది. ఆర్జేడీకి 30 శాతం మద్దతు ఉంటే మిగిలిన 70 శాతం అంతా ఎన్డీఏనే. మేం ఎన్డీఏనే ప్రత్యర్థిగా భావిస్తాం.

ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ
ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

తేజస్వికి ఉన్న 75 సీట్ల నుంచి చిరాగ్ పాశ్వాన్ జేడీయూ పోటీచేసిన 38 సీట్లు తీసేయాలి.(ఈ సీట్లలో చిరాగ్ పాశ్వాన్ పార్టీ అభ్యర్థులు ఎన్డీఏ ఓట్లను తగ్గించడం వల్లే ఆర్జేడీ అభ్యర్థులు గెలుపొందారని భావిస్తారు.) మిగిలిన సీట్లే ఆర్జేడీ బలం. భవిష్యత్తులో కూడా ఇదే బలం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం కాదు. లోక్‌సభ ఎన్నికలే దీనికి నిదర్శనం.

తేజస్వికి 80 సీట్లు గెలుచుకునేంత ప్రజాదరణ ఉంటే, ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లే ఎందుకు వచ్చాయి?

నేను రెండు విషయాలు మాత్రమే చెప్పాను. ఆయన 9వ తరగతిలో ఫెయిల్ అయ్యారు. కొన్నిసార్లు, సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా, ఎవరైనా చదువుకోలేక పోవచ్చు. కానీ మనం మాట్లాడుతున్న వ్యక్తి తల్లిదండ్రులిద్దరూ ఇక్కడ ముఖ్యమంత్రులు.

జ్ఞాన భూమిగా పిలిచే బిహార్‌కు, చదువుపై గౌరవం లేని వ్యక్తి సరిపోరు.

ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

చాలా నిర్ణయాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇక్కడ పంచాయతీ రాజ్‌లో మహిళలు, వెనుకబడిన కులాలకిచ్చిన భాగస్వామ్యం చాలా బాగుంది.

ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నితీశ్ మరోసారి బిహార్ సీఎం కాలేరని ప్రశాంత్ కిశోర్ అంటున్నారు.
ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

అంతా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు నితీశ్ కుమార్ తన రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారు.

ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్, రాహుల్ ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పాలని ప్రశాంత్ కిశోర్ అంటున్నారు.
ప్రశాంత్ కిశోర్, బిహార్, జన్ సూరజ్, రాహుల్ గాంధీ

ఓటర్లను చేర్చడం గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. బిహార్ ఎస్ఐఆర్ ఓటర్ల పేర్ల తొలగింపుకు సంబంధించినది.

రాహుల్ గాంధీ చెప్పే చాలా విషయాలను నేను వ్యతిరేకిస్తున్నాను. కానీ ఈ విషయంలో రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చాను. ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీ అని కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకునికి ఉన్న స్థానాన్ని చూసి ఆయనకు మద్దతిస్తున్నాను. దేశంలోని 60 కోట్ల మంది ప్రజల గొంతుక ఆయన.

రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది.

ఎన్నికల కమిషన్‌కు ఇంటెన్సివ్ రివిజన్ చేసే హక్కు ఉంది, కానీ పారదర్శకంగా చేయాలి.

ఓటర్ల జాబితాను సరిదిద్దడానికే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఏడాదిన్నర క్రితం లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఎందుకు సరిదిద్దలేదు? మోదీ ఎన్నికైన ఓటర్ల జాబితా సరైనది కాదని అంగీకరించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందా?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)