మూడ్ బాగుండాలంటే మీరు చేయాల్సిన 6 పనులివే...

ఫొటో సోర్స్, Getty Images
వ్యాయామం చెయ్యడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మూడ్‌ను ఉత్సాహపరిచే అంశాలే కావచ్చు. అయితే మూడ్‌ను ఉత్సాహపరచడానికి అవి మాత్రమే సాధనాలు కాదు.
బీబీసీ రేడియో4 కార్యక్రమం జస్ట్ వన్ థింగ్‌లో బీబీసీ జర్నలిస్ట్ డాక్టర్ అయిన మైఖేల్ మోస్లే తన అభిప్రాయాలను పంచుకున్నారు. జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు మనం ఇంకా ఎన్ని అంశాలు నేర్చుకోవచ్చు?
మీ మూడ్‌ని ఉత్సాహపరిచేందుకు అందులో కొన్ని సూచనలు ఇవి.

ఫొటో సోర్స్, Getty Images
1. రాయడం
మీ మెదడులో చాలా ఆలోచనలు ఉంటే, వాటిని పేపర్ మీద పెట్టడం ద్వారా వాటిలో ఏవి అవసరం అనేది తెలుసుకోవడం ద్వారా మీరు ఆశ్చర్యపోతారు.
“ఆలోచనల వ్యక్తీకరణ” పేరుతో కేలవం 15 నిముషాలు కేటాయించగలిగితే మీలో వ్యతిరేక ఆలోచనలు, ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. మీకు బాగా నిద్రపడుతుంది. మీ వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మీ జ్ఞాపకశక్తి కూడా అభివృద్ధి చెందుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫోన్‌ను దూరం పెట్టండి
సెల్‌ఫోన్‌ను అతిగా ఉపయోగించడం మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం మీకు తెలిసే ఉండవచ్చు. అది మీ నిద్రను, మీలోని ఉత్పాదక సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది.
ఫోన్ మీద ఆధారపడటాన్ని పూర్తిగా ఆపేయడం కష్టం కావచ్చు. ఎందుకంటే మన రోజువారీ అవసరాల్లో చాలా వరకూ ఫోన్ తోనే ముడిపడి ఉన్నాయి.
మార్పు కోసం ఏదైనా అలవాటుని మనం ఒక్కసారిగా ఉన్నట్టుండి మానేయాల్సిన అవసరం లేదు.
రోజు మొత్తంలో ఒక గంట పాటు మాత్రమే ఫోన్ వాడుతున్న వారు తక్కువ ఒత్తిడి, సంతోషకరమైన జీవితం గడుపుతున్నట్లు జర్మనీలో ఓ అధ్యయనం తేల్చింది.
ఫోన్ మీద ఆధారపడే సమయం తగ్గించుకోవాలని భావిస్తే, దాన్ని కొంత సమయం వేరే గదిలో పెట్టడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంట్లో ఉంచుకునేందుకు మొక్కలు కొనండి
ఇంట్లో పెట్టుకునే మొక్కలు రూముని అందంగా ఉంచడమే కాదు, గాలిలో నాణ్యతను పెంచుతాయి. అలాగే ఆహ్లాదాన్ని పెంచుతాయి. జ్ఞాపకశక్తి, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతాయి.
ఇంట్లో మొక్కలు ఉండటం వల్ల దీర్ఘ శ్వాస తీసుకోవచ్చు. దీని వల్ల మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అంది నిద్ర సరిగ్గా పడుతుంది. ప్రశాంతత లభిస్తుందనేందుకు ఆధారాలు ఉన్నాయి.
ఆఫీసులో మొక్కల్ని తొలగించినప్పుడు అందులో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిందని, వారి పని తీరు మందగించిందని, పని మీద శ్రద్ధ తగ్గిందని ఓ అధ్యయనంలో తేలింది.
ఇదిలా ఉంటే, ఉద్యోగులు తమ డెస్కు నుంచి చెట్లను చూస్తు పని చేయగలిగినప్పుడు వారి పని తీరు 19 శాతం పెరిగిందని మరో అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
4. పాటలు పాడండి
స్నానం చేస్తూ పాటలు పాడటాన్ని మీరు ఆనందిస్తూ ఉండవచ్చు లేదా కారులో ప్రయాణిస్తూ రేడియోలో వచ్చే పాటల్ని ఎంజాయ్ చెయ్యవచ్చు. దీని వల్ల మీ శరీరం నుంచి విడుదలయ్యే రసాయనాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.
ఉదాహరణకు అలా విడుదలయ్యే వాటిల్లో ఎండార్ఫిన్, డోపమైన్, సెరటోనిన్, అక్సిటోసిన్ వీటితో పాటు ఎండోకేన్నబినోయిడ్స్ లాంటి రసాయనాలు ఉంటాయి. గంజాయి మొక్కలో ఉండే రసాయన ఉత్ప్రేరకాలు అందించే ఉత్సాహాన్ని ఈ రసాయనాలు అందిస్తాయి.
అలాగే, పాటలు పాడటం వల్ల శరీరం మీద విస్తృతమైన ప్రభావం చూపిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఒంటరితనాన్ని తగ్గించి ఒత్తిడి విషయంలో సానుకూలంగా పని చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
5. ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి
మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనుల సంఖ్య పెరగడం మీపై ఒత్తిడి పెంచుతుంది.
ఒత్తిడి తగ్గించుకోవడానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం మంచిదని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయి.
మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడం ప్రారంభినప్పుడు పూర్తిగా దాని మీదనే దృష్టి పెడతారు. ఆ సమయంలో మీ దృష్టంతా ఆ పని మీదనే ఉంటుంది.
దీని వల్ల మీ మెదడు ముందు బాగం ప్రశాంతంగా ఉంటుంది. అది మీ ప్రవర్తనను విశ్లేషించుకోవడానికి, ప్రశ్నించుకోవడానికి సాయపడుతుంది. దీని వల్ల మీ చర్యల పట్ల పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
6. మీకు ఆనందం కలిగించిన పనులు ఏవి?
ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్‌గా అనిపించవచ్చు కానీ, దీని వెనుక సైంటిఫిక్ కారణం ఉంది.
ఏదైనా సాయం పొందినప్పుడు, అది ఎంత చిన్నదైనా సరే, ఇతరులకు కృతజ్ఞతలు చెప్పడం ఆనందాన్ని కలిగిస్తుంది. దీని వల్ల మీ మెదడు పునరుత్తేజం పొందుతుంది.
కృతజ్ఞతలు చెప్పడం వల్ల ఏర్పడే భావనలను అధ్యయనం చేసినప్పుడు మెదడులో క్రియాశీలత పెరగడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ఆనందాన్ని అనుభవించడానికి మీ ఆలోచనాధోరణిని నెగటివ్ నుంచి పాజిటివ్ వైపు మళ్లించే ప్రక్రియను ప్రారంభించండి.
ఈ రోజు మీకు ఆనందం కలిగించిన మూడు అంశాల గురించి ఆలోచించండి. అది ఏదైనా కావచ్చు. మీరు ఇతరులకు కృతజ్ఞులై ఉండటం లేదా ఇతరులతో సానుకూల సంభాషణలు జరపడం.
ఇవి కూడా చదవండి:
- యశస్వీ జైస్వాల్: బేస్బాల్లా క్రికెట్ బంతిని బాదేస్తూ మరో డబుల్ సెంచరీ చేసిన 'జస్బాల్'
- గుల్బదన్: ఒట్టోమాన్ సుల్తాన్‌ను ఎదిరించిన మొఘల్ యువరాణి కథ...
- అలెక్సీ నావల్నీ: పుతిన్ ఆదేశాల మేరకే ఆయనను చంపేశారా, విమర్శకులు ఏమంటున్నారు?
- తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
- కజఖ్‌స్తాన్: మీథేన్ గ్యాస్ మెగా-లీకేజి, కొన్ని నెలలుగా విస్తరిస్తున్న ప్రమాదాన్ని బయటపెట్టిన బీబీసీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















