టెక్నాలజీ: మొబైల్ ఫోన్ వాడకం మన జ్ఞాపకశక్తిని చంపేస్తోందా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమండా రుగ్గేరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చాలామందిలాగే నేను నా ఫోన్‌లో ఎక్కువ సమయం మునిగిపోతాను. అందరిలా ఈ వాస్తవం నాకూ తెలుసు. ఈ విషయంలో నేను గిల్టీ ఫీలింగ్‌తో కూడా ఉంటాను.

కొన్నిసార్లు మొబైల్‌ను ఇంట్లో ఎక్కడో మూలన పడేస్తాను. తక్కువగా వాడాలన్న భావనతో కొన్నిసార్లు స్విచాఫ్ చేస్తాను.

కానీ, నిజం చెప్పాలంటే నేను ఫోన్ ద్వారా మాత్రమే చాలా పనులు ఈజీగా చేసుకోగలను. బిల్లు చెల్లింపులకు... ఫోన్.

ఫ్రెండ్‌తో కాఫీ డేట్ ప్లాన్‌కు...ఫోన్.

ఇంటికి మెసేజ్ పంపడానికి...ఫోన్.

వాతావరణాన్ని తెలుసుకోవడం, ఆలోచనను కథగా మార్చి రాయడం, ఫొటో లేదా వీడియో తీయడం, ఫొటో బుక్ క్రియేట్ చేయడం....

పాడ్‌కాస్ట్ వినడం, డ్రైవింగ్ దిశలను లోడ్ చేయడం, తొందరగా లెక్కలు చేయడం, టార్చ్ ఆన్ చేయడం వంటివి చేయాలా? ఫోన్, ఫోన్, ఫోన్.

మొబైల్ వాడకం

ఫొటో సోర్స్, Getty Images

ప్రతీ నాలుగు నిమిషాలకి ఒకసారైనా ఫోన్ చూడాల్సిందే..

అమెరికాలో (పెద్దలు) తమ మొబైల్‌ను సగటున రోజుకు 344 సార్లు అంటే ప్రతి 4 నిమిషాలకు ఒకసారి చూస్తారని ఇటీవలి రిపోర్టు ఒకటి తెలిపింది.

మొత్తంగా రోజుకు దాదాపు 3 గంటలు వాళ్లు దానితోనే గడుపుతారని చెప్పింది.

మనలో చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే ఏదైనా పని మీద మొబైల్ ఓపెన్ చేసినపుడు ఈ మెయిల్ లేదా సోషల్ మీడియా ఫీడ్‌లను చూస్తూ స్కోలింగ్ చేస్తూ సమయం గడుపుతాం.

ఇది ఒక విష వలయం. మన ఫోన్‌లు ఎంత ఉపయోగకరంగా మారితే అంత ఎక్కువగా వాటిని ఉపయోగిస్తాం.

మనం వాటిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తామంటే చేతిలో ఉన్న ఏ పనికైనా మన ఫోన్‌లను తీయడానికి దారితీసేలా నాడీ వ్యవస్థ పనిచేసేలా ఉంటుంది .

మనకు అవసరం లేనప్పుడు కూడా మన ఫోన్‌ని తనిఖీ చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.

సోషల్ మీడియా, బ్యూటీ ఫిల్టర్‌లు వంటివి పక్కన పెడితే, ఈ పరికరాలపై మనం ఆధారపడినట్లయితే అది మన మెదళ్లకు ఏం చేస్తోంది? ఇది మనకు మంచిదేనా?

మొబైల్ వాడకం

ఫొటో సోర్స్, Getty Images

మతిమరుపునకు కారణమవుతోందా?

ప్రతీ ఏడాది మొబైల్ వాడకం అనేది పెరిగిపోతూ ఉంది. పదే పదే ఫోన్‌ చెక్ చేయడం, నోటిఫికేషన్‌ని చూడటం వంటి పరధ్యానం మంచిది కాదని మనకూ తెలుసు.

ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఇది మనలోని జ్ఞాపకశక్తిని, దాని పనితీరును దెబ్బతీస్తుందనీ తెలుసు.

ఇక అత్యంత ప్రమాదకరమైన ఉదాహరణలలో డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడటమనేది ఒకటి.

ఫోన్‌లో మాట్లాడటమనేది రోడ్డుపై డ్రైవర్లు నెమ్మదిగా ప్రతిస్పందించడానికి దారితీస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది.

ఏదైనా టాస్క్ చేస్తున్నపుడు ఫోన్‌లో డింగ్ అనే నోటిఫికేషన్ శబ్దం విన్నవాళ్ల పనితీరు తక్కువగా ఉంటున్నట్లు పరిశీలనలో తేలింది. ఆ సమయంలో వాళ్లు ఫోన్ ఉపయోగించలేదు కూడా.

ఏదైనా టాస్క్ చేస్తుండగా మాట్లాడటానికి లేదా మెసేజ్ చేయడానికి ఫోన్‌ని ఉపయోగించినపుడు కూడా ఈ ప్రభావం దాదాపుగా అలాగే ఉంటోంది.

ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే కాకుండా దాని ఉనికి సైతం యూజర్లను ప్రభావితం చేస్తుంది.

మొబైల్ వాడకం

ఫొటో సోర్స్, Getty Images

ఫోన్ దగ్గరుంటే బ్రెయిన్ చురుకుగా పనిచేయదా?

ఇటీవల పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. దానిలో పార్టిసిపెంట్స్ తమ ఫోన్‌లను పక్కన పెట్టమని నిర్వాహకులు కోరారు.

అంటే మొబైల్ కనిపించేలా (డెస్క్‌పై) లేదా సమీపంలో కనిపించకుండా (బ్యాగ్ లేదా జేబులో) లేదా మరొక గదిలో ఉంచాలని సూచించారు .

పార్టిసిపెంట్స్‌కు మెమరీ పవర్, వారి సామర్థ్యం, దృష్టిని పరీక్షించడం, సమస్య-పరిష్కారాలు తదితర టాస్క్‌లు ఇచ్చారు.

ఫోన్‌లు సమీపంలో కాకుండా మరొక గదిలో ఉంచుకున్న పార్టిసిపెంట్స్ టాస్కులు మెరుగ్గా పూర్తి చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

టాస్కులు చేస్తుండగా చాలామంది పార్టిసిపెంట్స్ తమ మొబైల్స్ గురించి ఆలోచించలేదన్నదీ నిజమే.

ఫోన్‌తో ఎక్కువసేపు గడిపితే "బ్రెయిన్ డ్రెయిన్" కారణమవుతుంది.

మన ఫోన్‌ని చూడాలా? వద్దా? అని నిరంతరం దిక్కులు చూడటమనేది (నోటిఫికేషన్ కోసం వేచి ఉండటం) మన మెదడును పనిలో దృష్టి కేంద్రీకరించనివ్వదు.

ఈ దృష్టి మరల్చడం అనేది పని చేయడాన్ని కష్టతరం చేస్తుంది. మొబైల్ పూర్తిగా వేరే గదిలో ఉంచడం మాత్రమే దీనికి "పరిష్కారం" అని పరిశోధకులు కనుగొన్నారు.

చదువు

ఫొటో సోర్స్, EILEEN MCDOUGALL

రాయడం అనేది జ్ఞాపకశక్తిని పెంచుతుందా?

కాగా, డివైజ్‌లపై ఆధారపడటం అనేది కొన్ని విపరీత పోకడలకు కూడా దారితీయవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.

ఉదాహరణకు ఫోన్‌లపై ఆధారపడటం వలన మనకు జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని చాలామంది నమ్ముతారు.

అయితే ఇది అంత సులభం కాదని తాజా అధ్యయనంలో తేలింది. ఇటీవలి ఒక పరిశోధనలో వాలంటీర్లకు న్యూమరికల్ సర్కిల్స్‌తో కూడిన స్క్రీన్‌ను చూపారు.

సర్కిల్‌లో సంఖ్యలను సరైన వైపునకు తరలిస్తే వాలంటీర్‌కు డబ్బులు లభిస్తాయి.

పోటీల్లో సగం మందికి నోట్ చేసుకోవడానికి అనుమతించారు. మిగిలిన వారు తమ జ్ఞాపకశక్తిపై ఆధారపడ్డారు.

ఊహించినట్లుగానే నోట్స్ రాసుకున్న వారు మెరుగైన పనితీరు కనబరిచారు. కానీ ఆశ్చర్యకరంగా వారు రాయనివి కూడా గుర్తుంచుకున్నారు.

దీనివల్ల రాయడం అనేది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు గుర్తించారు.

డివైజ్‌పై ఆధారపడితే మన జ్ఞానానికి దీర్ఘకాలికంగా ఏమవుతుందో తెలుసుకోవడానికి పరిశోధకులకు చాలా సంవత్సరాలు పడుతుంది.

అయితే ఈలోగా దాని దుష్ప్రభావాలను తగ్గించడానికి మనం ప్రయత్నించగల మరొక మార్గం ఉంది. మన మెదడు గురించి మనం ఎలా ఆలోచించే తీరు అది.

మొబైల్

ఫొటో సోర్స్, Getty Images

మనం ఏం నేర్చుకోవాలి?

నా మాజీ సహోద్యోగి డేవిడ్ రాబ్సన్ 'ది ఎక్స్‌పెక్టేషన్ ఎఫెక్ట్‌' అనే పుస్తకం రాశారు.

దానిలో 'ఒక పరిశోధన ప్రకారం మన సంకల్ప శక్తిని ఒక మార్గంలో ఉపయోగించి (ఉదాహరణకు మన ఫోన్‌ని చెక్ చేయడాన్ని తగ్గించడం) మరొక పనిపై దృష్టిని బలంగా కేంద్రీకరించాలని తెలిపారు.

అయితే ఇది నిజం కావచ్చు. కానీ, అది ఎక్కువగా మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది' అని ఆయన రాశారు.

మన బ్రెయిన్‌కు పరిమిత వనరులు ఉన్నాయని భావించే వ్యక్తులతో పోలిస్తే అపరిమిత వనరులున్నాయని భావించే వారు పనిపై స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు.

తదుపరి పనిపై వారికి ప్రతికూలత ప్రభావం ఉండకపోవచ్చు.

నేను దీని నుంచి ఏం నేర్చుకుంటాను?

నా ఫోన్‌ వద్దకు వెళ్లకుండా మరొక గదిలో ఉంచడం సాధన చేస్తుంటాను.

అయితే నా మెదడులో నేను అనుకున్నదానికంటే ఎక్కువ వనరులు ఉన్నాయని గుర్తు చేసుకుంటాను.

నా ఫోన్‌ని చూడాలనుకునే ఆకర్షణ నుంచి దూరం అయ్యేలా చేసుకుంటాను.

దీనిని రాసేటప్పుడు రచయిత తన ఫోన్‌ని ఒకసారి చెక్ చేయాలనుకుని కొద్దిసేపు రాయడం ఆపేశారు. నిజానికి, ఆమె ఐదు నిమిషాల పాటు స్క్రోలింగ్‌ చేసినట్లు తెలుసుకున్నారు.

మొబైల్

మొదటి సెల్‌ఫోన్ కాల్

మార్టిన్ 'మార్టీ' కూపర్ 50 సంవత్సరాల క్రితం లేత గోధుమరంగు, ఇటుక-పరిమాణం గల పరికరం నుంచి చేసిన మొట్టమొదటి ఫోన్ కాల్ గురించి బీబీసీతో మాట్లాడారు.

అది ఇప్పటి స్మార్ట్‌ఫోన్‌ల కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది.

ఆ ఫోన్ లో మెసేజ్‌లు లేవు. కెమెరా లేదు. 10 గంటల బ్యాటరీ ఛార్జింగ్ చేసిన తర్వాత కేవలం 30 నిమిషాల టాక్ టైమ్ ఉంది.

"చాలా విషయాల్లో ఫోన్ అంత మంచిదేం కాదు" అని కూపర్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)