2022లో లక్షల వ్యూస్ కొల్లగొట్టిన 6 వైరల్ వీడియోలు ఇవే...

సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే కొన్నిసార్లు చాలా సమయం, మరింత ప్రయత్నం అవసరమవుతాయి.
కానీ, ఒక్కోసారి లైవ్‌లో పొరపాటుగా వేరే వ్యక్తి మీద కేకలు వేసినా ఆ వీడియో వైరల్ అయిపోతుంది.
2022 సంవత్సరంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వినోదాంశాల్లో ఇవి రెండూ కలగలిసి కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, SCREENSHOT
1. ‘‘ఐ యామ్ మిస్టర్ మెక్‌ఆడమ్స్!’’
2022లో భారీగా వైరల్ అయిన అంశాల్లో.. ఒక న్యూస్ చానల్ లైవ్ ప్రసారంలో దొర్లిన ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ ఒకటి.
టైమ్స్ నౌ టీవీ చానల్‌లో ప్యానల్ డిస్కషన్ నిర్వహిస్తున్న న్యూస్ యాంకర్ రాహుల్ శివశంకర్.. అమెరికా విదేశాంగ విధాన వ్యాఖ్యాత డానియెల్ మెక్‌ఆడమ్స్ అనుకుని ఒక యుక్రెయిన్ జర్నలిస్ట్ మీద దాదాపు రెండు నిమిషాల పాటు కేకలు వేస్తూ విరుచుకుపడ్డారు.
రాహుల్ కేకలతో విసిగిపోయిన మెక్‌ఆడమ్స్.. ‘‘ఐ యామ్ మిస్టర్ మెక్‌ఆడమ్స్! నేను మెక్‌ఆడమ్స్‌ని.. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి నా మీద అరవటం ఆపండి’’ అని ఎదురు కేకలు వేశారు. అప్పుడు సదరు యాంకర్ తన పొరపాటును గుర్తించారు.
ఈ వాగ్వాదంతో ‘మెక్‌ఆడమ్స్’ ఇండియాలో ట్విటర్ టాప్ ట్రెండ్‌గా మారింది. తీవ్ర వాగ్వాదాలతో నడిచే టీవీ డిబేట్లను వీక్షించటానికి ఇష్టపడే ప్రేక్షకులు మెక్‌ఆడమ్స్ పరిస్థితిని చూసి సానుభూతి చూపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
2. రణ్‌వీర్ సింగ్ ఫొటోషూట్
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ జూలై నెలలో పేపర్ మేగజీన్ కోసం నగ్నంగా ఫొటోషూట్ చేయటం.. ఆన్‌లైన్‌లో మీమ్‌లు, జోక్‌ల పరంపరకు తెరతీసింది.
ఆ ఫొటోషూట్‌లో కాస్త ఎబ్బెట్టుగా ఉన్న పోజుల ఫోటోలను తీసుకుని వాటితో మీమ్స్ తయారు చేసి వదిలారు.
ఉదాహరణకు.. ఈ ఫొటోషూట్‌లోని ఒక ఫొటోను.. మైఖెలాంజెలో పెయింటింగ్ ‘ద క్రియేషన్ ఆఫ్ ఆడమ్’ మీద సూపర్‌ఇంపోజ్ చేసి మీమ్ రూపొందించారు.
ఇంకొందరు రణ్‌బీర్ ఫొటోల్లో అతడి శరీరాన్ని దుప్పట్లు, ఇతర వస్త్రాలతో కప్పేసి తమ సృజనాత్మకతకు పదునుపెట్టారు.
అయితే రణ్‌బీర్ న్యూడ్ ఫొటోషూట్ మీద ఆగ్రహం కూడా వ్యక్తమైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
3. కాలా ఛష్మా ఇంటర్నెట్‌లో మళ్లీ వైరల్
2016 నాటి బాలీవుడ్ సినిమా ‘బార్ బార్ దేఖో’ లోని హిట్ సాంగ్ ‘కాలా ఛష్మా’ పాటకు జూన్ నెలలో జరిగిన ఒక పెళ్లిలో నార్వే బృందం ‘క్విక్ స్టైల్’ నాట్యం చేసింది. ఇది వైరల్‌గా మారింది.
తమ స్నేహితుడి పెళ్లి కోసం సూట్లు ధరించిన క్విక్ స్టైల్ బృందం.. నల్లకళ్లద్దాలు ధరించి ‘కాలా ఛష్మా’ పాటతో పాటు మరికొన్ని బాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేశారు.
వారి ‘కాలా ఛష్మా’ డ్యాన్స్ వైరల్‌గా మారింది. ప్రపంచమంతటా జనం ఆ పాటకు డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లోను, టిక్‌టాక్‌లోను ఆ పాట, ఆ డ్యాన్స్ ట్రెండ్ అయింది.
క్విక్ స్టైల్ బృందం ఫుల్ పెర్ఫార్మెన్స్ వీడియోకు యూట్యూబ్‌లో 9.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
వారి ఇన్‌స్టాగ్రామ్ రీల్ సైతం బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ దృష్టిని ఆకర్షించింది. దానిపై ఆమె ఫైర్ ఎమోజీతో కామెంట్ చేశారు. సినిమాలోని కాలా ఛష్మా పాటలో ఆమె నటించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
4. కిలి, నీమా పాల్‌లతో ప్రేమలో పడిన ఇండియా
టాంజానియా అన్నచెల్లెళ్లు కిలి, నీమా పాల్‌లు.. అనేక భారతీయ భాషల్లోని పాటలకు పెర్ఫెక్ట్‌గా లిప్ సింక్ చేస్తూ రూపొందించే వీడియోలతో భారతదేశంలో వారికి చాలా మంది అభిమానులయ్యారు.
హిందీ, పంజాబీ, తమిళ భాషల్లోని పాపులర్ పాటలు కొన్నిటికి వీరిద్దరూ డ్యాన్స్ కూడా చేస్తుంటారు. ఆ వీడియోలను టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తుంటారు.
టాంజానియాలోని స్థానిక ధియేటర్లలో బాలీవుడ్ సినిమాలు చూసిన కిలి, నీమాలు.. సొంతంగా హిందీలో పాడటం కూడా నేర్చుకున్నారు.
‘‘ఆ సినిమాలు, పాటలతో నేను ప్రేమలో పడిపోయాను. మనం దేనినైనా ప్రేమించినపుడు దానిని నేర్చుకోవటం ఈజీ అవుతుంది’’ అని కిలి గత ఏడాది బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
వీరి మోస్ట్ పాపులర్ వీడియోల్లో ఒకటి.. తమిళ సినిమా ‘బీస్ట్’లోని ‘అరబిక్ కుత్తు’ పాటకు వీరు చేసిన డ్యాన్స్ వీడియో. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోకు 8 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
కిలి అక్టోబర్ నెలలో భారతదేశాన్ని సందర్శించారు. ఇండియన్ రియాలిటీ టీవీ, డ్యాన్స్ షోల్లో పాల్గొన్నారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
5. 1954 నాటి పాట మళ్లీ హిట్ అయింది
ఇక.. లతా మంగేష్కర్ పాడిన ‘మెరా దిల్ యె పుకారే ఆజా’ అనే పాట నవంబర్‌లో సోషల్ మీడియాను చుట్టేసింది. ఒక పాకిస్తానీ మహిళ.. ఒక పెళ్లిలో ఆ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావటమే దీనికి కారణం.
ఆయేషా అనే ఆ మహిళ ఆకుపచ్చని దుస్తులు ధరించి.. ఈ 1954 బాలీవుడ్ పాట రీమిక్స్‌కు డ్యాన్స్ చేశారు. దీంతో ఆ పాటకు భారతీయులు, పాకిస్తానీలు డ్యాన్స్ చేసి వీడియోలు పోస్ట్ చేయటం ఒక క్రేజ్‌గా సాగింది.
నవంబర్ 11వ తేదీన పోస్ట్ చేసినప్పటి నుంచీ ఆమె వీడియోను 1.9 కోట్ల సార్లు వీక్షించారు. అంతేకాదు.. ఆ పాటను కొత్త ఫ్యాన్లకు పరిచయం చేసింది. అదే పాటతో 20 లక్షలకు పైగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పుట్టుకొచ్చాయి.
చివరికి బాలీవుడ్ స్టార్ మాధురీ దీక్షిత్ కూడా ఆ పాటకు స్టెప్పులేసి వీడియో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
6. పల్లీల పాట
పశ్చిమ బెంగాల్‌లో పల్లీలు అమ్ముతూ ఓ స్ట్రీట్ వెండర్ పాట పాడుతున్న వీడియో.. 2022 ఆరంభంలో కొన్ని నెలల పాటు వైరల్‌గా హల్‌చల్ చేసింది.
భువన్ బాద్యాకర్ ‘కచ్చా బాదామ్’ (అంటే ‘పచ్చి పల్లీలు’) అంటూ పాడిన పాట యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హిట్టవటంతో అందరి నోటా వినిపించింది.
భువన్ ఆ తర్వాత నజ్ము రీచట్, అమిత్ ధుల్ వంటి మ్యుజీషియన్లతో కలిసి తన పాట ఆధారంగా చిన్న చిన్న పాటలతో వీడియోలు రూపొందించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- నెగ్లేరియా ఫాలెరీ: మనిషి మెదళ్లను తినే ప్రాణాంతకమైన అమీబా ఇది, ఎలా సోకుతుంది?
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలో నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- టూత్ బ్రష్ సరిగ్గా వాడడం ఎలాగో మీకు తెలుసా... దంతాల ఆరోగ్యానికి ఏం చేయాలి?
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- 2022 టాలీవుడ్ రివ్యూ: తెలుగు చిత్రసీమలో మెరుపులు ఇవీ














