ఫేస్‌బుక్: మెటావర్స్‌లో మహిళ అవతార్‌పై లైంగిక దాడి

ఫొటో సోర్స్, Getty Images
ఫేస్‌బుక్‌కు చెందిన మెటా వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ ‘‘హొరైజాన్ వరల్డ్స్’’లో 21ఏళ్ల పరిశోధకురాలి అవతార్‌పై లైంగిక దాడి జరిగిందని టెక్ నిపుణులు వెల్లడించారు.
కార్పొరేట్ అకౌంటబిలిటీ గ్రూప్ ‘‘సమ్ ఆఫ్ యూస్’’ కోసం ఆమె పనిచేస్తున్నారు. ఇలాంటి వేధింపులను అరికట్టేందుకు మెటావర్స్‌లో మెరుగైన ఏర్పాట్లు అవసరమని ఈ ఘటన తేటతెల్లం చేసిందని సమ్ ఆఫ్ యూస్ వ్యాఖ్యానించింది.
మెటా షేర్‌హోల్డర్స్ సమావేశం బుధవారం జరిగింది. అందులోనూ ఈ విషయం చర్చకు వచ్చింది.
హొరైజాన్ వరల్డ్స్‌లో మెరుగైన అనుభూతి కోసం తగిన భద్రత ఏర్పాట్లు ఉన్నాయని మెటా అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు. అయితే, సమ్ఆఫ్‌యూస్ నివేదికను తాము ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదని వివరించారు.
‘‘హొరైజాన్ వరల్డ్స్‌లో భద్రతాపరమైన ఏర్పాట్లను అందరికీ అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాం. తాజా ఘటనపై మేం విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటాం’’అని మెటా అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం అమెరికా, కెనడాలలోని యూజర్లకు మాత్రమే హొరైజాన్ వరల్డ్స్ అందుబాటులో ఉంది. దీనిలోని అవతార్‌లు కార్టూన్లను పోలి ఉంటాయి.
అయితే, అవతార్‌లపై వర్చువల్‌గా దాడి జరిగినప్పుడు కూడా తీవ్రమైన వేదన అనుభవించాల్సి వస్తుందని సమ్ఆఫ్‌యూస్ పేర్కొంది.
‘‘దాడి వర్చువల్‌గా జరిగినప్పటికీ, యూజర్లపై దాని ప్రభావం ఉంటుంది’’అని గ్రూప్ డైరెక్టర్ విక్కీ వాట్.. బీబీసీతో చెప్పారు.
‘‘దాడి జరిగిన వెంటనే ఆ పరిశోధకురాలు షాక్‌కు గురయ్యారు. అయితే, ‘అది నా నిజమైన శరీరం కాదు.. అది కేవలం అవతార్ మాత్రమే’అని ఆ పరిశోధకురాలు కాస్త తనకు తాను నచ్చజెప్పుకొన్నారు. వెంటనే ఆ ఫుటేజీని ఆమె రికార్డు చేశారు’’అని వాట్ వెల్లడించారు.
ఆ ఫుటేజీలో కొంత భాగాన్ని బీబీసీ పరిశీలించింది. అక్కడ ఆ పరిశోధకురాలి అవతార్‌తోపాటు మరో రెండు పురుషుల అవతార్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి ఆమెకు చాలా దగ్గరగా వచ్చింది. ఒక వర్చువల్ డ్రింక్‌ను తాగుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.
‘‘ఇది చాలా సంక్లిష్టమైన సమస్య’’
మెటావర్స్‌కు ఒక నిర్వచనం అంటూ ఏమీలేదు. దీని అభివృద్ధి పనులు ఇంకా జరుగుతున్నాయని దీని కోసం పనిచేస్తున్న టెక్ నిపుణులు చెబుతున్నారు.
వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ లాంటి టెక్నాలజీలపై ఆధారపడుతూ మెటావర్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
దీని ఒక ‘‘సింగిల్ స్పేస్’’గా చెప్పలేం. భిన్నమైన 3డీ వర్చువల్ ఎన్విరాన్‌మెంట్లు కలిపి ఇది రూపుదిద్దుకుంటుంది. దీని సాయంతో కొత్తకొత్త గేమ్స్, వర్చువల్ ప్రపంచాలను సృష్టించొచ్చు.
ప్రస్తుతం అందుబాటులోనున్న మెటావర్స్‌లలో కొన్ని మాత్రమే ‘‘మెటా’’ కంపెనీ ఆధీనంలో ఉన్నాయి. అయితే, ఈ టెక్నాలజీపై సంస్థ కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. వేల మంది టెక్నికల్ నిపుణులను సంస్థ నియమించుకుంది.
వ్యక్తిగత హద్దులను దాటి
అవతార్‌లపై ఇదివరకు జరిగిన వర్చువల్ దాడులు, అభ్యంతరకర ప్రవర్తనల నడుమ మెటా కొన్ని సేఫ్‌గార్డ్‌లను గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది.
వీటిలో భాగంగా ‘‘పర్సనల్ బౌండరీ’’లను తీసుకొచ్చింది. రెండు అవతార్‌ల మధ్య తగిన దూరం పెట్టేందుకు వీటిలో నిబంధనలు ఉన్నాయి. అభ్యంతరకర ఘటనలను అడ్డుకోవడానికి వీటిని తీసుకొచ్చింది.
‘‘వేరొకరి అవతార్ మన వ్యక్తిగత స్పేస్‌లోకి రావాలని ప్రయత్నిస్తే, వారు ముందుకు అడుగులు వేయకుండా ఇది అడ్డుకోగలదు’’అని మెటా చెప్పింది.
దీనిలో డిఫాల్ట్ పర్సనల్ బౌండరీని నాలుగు అడుగులుగా నిర్దేశించారు. అంటే మన స్నేహితుల జాబితాలోని వ్యక్తులు ఇంతకంటే సమీపానికి రాలేరు. మరోవైపు యూజర్లను బ్లాక్ చేయడానికి, రిపోర్ట్ చేయడానికీ దీనిలో మార్గాలున్నాయి.
అయితే, తాజా ఘటనలతో ఈ పర్సనల్ బౌండరీ ఫీచర్‌ను డిసేబుల్ చేసేలా ఆమెను ఒప్పించారని సమ్ఆఫ్‌యూస్ తెలిపింది. ఆమెను వర్చువల్ గన్ హింసకు గురిచేశారని, అభ్యంతరకర పదాలతో తిట్టారని వెల్లడించింది.
ఏం చర్యలు తీసుకుంటారు?
ఇలాంటి సమస్యలకు ఒక పరిష్కారాన్ని సమ్ ఆఫ్ యూస్ ప్రతిపాదించింది. మెటావర్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ముప్పును అంచనా వేయాలని సంస్థ సూచిచస్తోంది.
మరోవైపు మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ తాజా పోస్టును సమ్‌ఆఫ్‌యూస్ తప్పుపట్టింది. ‘‘రియల్‌టైమ్ స్పీచ్ మోడరేషన్‌కు బార్ మేనేజర్‌ను మేం బాధ్యులుగా చెప్పలేం. ఎందుకంటే వారు అక్కడే ఉండి మీ సంభాషణలన్నీ వింటే మీకే నచ్చదు’’అని నిక్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సమ్‌ఆఫ్‌యూస్ విమర్శించింది.
‘‘మెటావర్స్‌ను అభివృద్ధి చేసే దిశగా వడివడిగా అడుగులు వేసే బదులు ఫేస్‌బుక్ ముందు ఇలాంటి పరిస్థితులను అడ్డుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవావాలి’’ అని వాట్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు... అసలేం జరుగుతోంది?
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలతో పాటు 21 మంది మృతి
- వరల్డ్ థైరాయిడ్ డే: ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు, కారణాలేంటి?
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













