ట్రోలింగ్‌పై రష్మిక మందన్న: ‘నన్ను అందరూ ఇష్టపడరని తెలుసు... ప్రతి ఒక్కరూ ప్రేమించాలని అనుకోను...’

ఫొటో సోర్స్, Rashmika Mandanna/Facebook
సినీనటి రష్మిక మందన్న తన మీద వస్తున్న ట్రోల్స్ మీద స్పందించారు.
చాలా కాలంగా ఆన్‌లైన్‌లో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ద్వేషిస్తున్నారని మంగళవారం రాసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రష్మిక అన్నారు.
ఇంత కాలం ట్రోల్స్‌ను మౌనంగా సహిస్తూ వచ్చానని, ఇప్పుడు స్పందించక తప్పడం లేదని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Rashmika Mandanna/Facebook
‘కొన్ని ఏళ్లుగా... నెలలుగా... వారాలుగా... రోజులుగా నన్ను కొన్ని విషయాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటి మీద మాట్లాడాల్సిన సమయం వచ్చింది.
నేను నా కెరియర్ ప్రారంభించిన నాటి నుంచి ద్వేషాన్ని చవి చూస్తూ వస్తున్నాను. ఎన్నో ట్రోల్స్, ఎంతో నెగిటివిటీ.
నేను ఎంచుకున్న దారిలో ముళ్లు ఉంటాయని నాకు తెలుసు. నన్ను అందరూ ఇష్టపడరని కూడా నాకు ముందే తెలుసు. ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలని నేను కోరుకోలేదు.
నేను చెప్పని విషయాలను నాకు ఆపాదించి ఇంటర్నెట్‌లో ట్రోల్స్ చేసే తీరుతో నా గుండె బద్ధలైంది.
నేను వివిధ ఇంటర్వ్యూలలో మాట్లాడిన విషయాలను బిట్లుబిట్లుగా చూపిస్తూ నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాటి వల్ల వ్యక్తిగత జీవితంలోనూ నేను పని చేసే ఫిలిం ఇండస్ట్రీలోనూ నాకు గల బంధాలు ప్రమాదంలో పడుతున్నాయి.
నిజంగా మేలు కోరి చేసే విమర్శలు మంచివే. వాటి వల్ల నన్ను నేను మెరుగుపరచుకుంటాను. కానీ ఇలా ద్వేషాన్ని చిమ్మడం ఏంటి?
ఎంతో కాలంగా వీటి మీద ఊరుకుంటూ వచ్చాను. పట్టించుకోవద్దు అనుకున్నాను. కానీ రోజురోజుకు ఇది మరింత పెరుగుతూ వస్తోంది’ అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
రష్మిక పోస్టుపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందిస్తున్నారు.
‘తెలిసిన వాళ్లు ద్వేషిస్తే బాధపడాలి కానీ నీ గురించి తెలియని వాళ్లు చేసే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
నువ్వేంటో తెలిసిన వాళ్లు ఎవరూ నిన్ను ద్వేషించరు’ అని తెలుగు సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Venky Kudumula/Instagram
‘నిన్ను ద్వేషించే వాళ్లు లోలోపల నీలాగే బతకాలని అనుకుంటారు. నువ్వు చాలా మంచి వ్యక్తివి. వాటి గురించి పట్టించుకోవద్దు. అంతకంటే నువ్వు చేయాల్సిన పెద్ద పనులు చాలా ఉన్నాయి’ అంటూ ప్రముఖ ఫొటోగ్రాఫర్ రవి కె చంద్రన్ అన్నారు.

ఫొటో సోర్స్, DOP007/Instagram
ట్విటర్‌లోనూ కొందరు రష్మికు మద్దతు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Samanta/Facebook
సెలబ్రిటీలకు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వారికి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి. ప్రధానంగా హీరోయిన్లకు ఈ ముప్పు ఎక్కువ.
సినీనటి సమంత తనను ట్రోల్ చేసే వారికి తరచూ సోషల్ మీడియా వేదికల మీద ఘాటుగా సమాధానాలు ఇస్తుంటారు. నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్నప్పుడు ఆమె మీద చాలా ట్రోలింగ్ జరిగింది.
రెండో పెళ్లి చేసుకున్నప్పుడు సింగర్ సునీత మీద కూడా ఎన్నో నెగిటివిట్ కామెంట్స్ వచ్చాయి.
ఆ మధ్య సుస్మితా సేన్, తాను ప్రేమలో ఉన్నామని లలిత్ మోదీ ప్రకటించడంతో ఆమెను కూడా బాగా ట్రోల్ చేశారు.
ఈ ట్రోలింగ్, విద్వేషపూరిత కామెంట్లను తట్టుకోలేక బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా 2020 జూన్‌లో తన ఖాతాను డీ యాక్టివేట్ చేశారు.
బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా ట్విటర్ నుంచి వైదొలగారు. ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
- ‘లోన్ రైట్ ఆఫ్’ అంటే ప్రజల సొమ్మును లూటీ చేయడమేనా?
- అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఎందుకు వస్తాయి? 5 పాయింట్లలో తెలుసుకోండి
- బ్రిటిష్ వలస పాలనలో భారతీయ మహిళలను టార్గెట్ చేసిన సబ్బులు, క్రీముల ప్రకటనలు ఎలా ఉండేవి
- ప్రతి వరల్డ్ కప్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టును ఓడిస్తున్న ఆ ‘అదృశ్య శక్తి’ ఏంటి
- ఊర్వశివో.. రాక్షసివో రివ్యూ: పెళ్లి బెటరా? సహజీవనం బెటరా? ఈ డైలమా తెరపై పండిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














