ఈ పాకిస్తాన్ సినిమా 'కలెక్షన్ల'లో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ను దాటేసిందా

ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ పోస్టర్‌తో రాజమౌళి, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్

ఫొటో సోర్స్, Facebook/RRR

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్‌ఆర్ఆర్' సినిమా మళ్లీ ట్రెండ్ అవుతోంది.

ఇటీవలే జపాన్‌లో ఈ సినిమా విడుదల కావడం ఒక కారణం అయితే ఈ ట్రెండింగ్ వెనుక మరొక ఆసక్తికర కారణం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లను ఒక పాకిస్తానీ సినిమా అధిగమించిందనే వార్తలు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఆర్ఆర్ సినిమా సుమారు రూ.1,200 కోట్లు వసూలు చేసింది.

జపాన్‌లో అక్టోబరు 21న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలైంది. తొలి వారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించిందని ఫిలిం మ్యాగజైన్ వెరైటీ రిపోర్ట్ చేసింది. తొలి వారంలో 73 మిలియన్ల జపాన్ యెన్‌లు అంటే 4.95 లక్షల డాలర్లు వసూలు చేసింది.

జపాన్‌లో ఆర్ఆర్ఆర్‌ను 44 నగరాల్లో 240 తెరల మీద రిలీజ్ చేశారు.

1998లో విడుదలైన రజినీకాంత్ సినిమా ముత్తు ఇప్పటి వరకు జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉందని వైరైటీ తెలిపింది.

పాకిస్తానీ సినిమా... ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్

ఫొటో సోర్స్, Facebook/Fawad Afzal Khan

ఫొటో క్యాప్షన్, పాకిస్తానీ సినిమా... ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్

ఆర్ఆర్ఆర్‌ వర్సెస్ ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్

పాకిస్తానీ సినిమా 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' ఇటీవల బ్రిటన్‌లో విడుదలైంది.

బ్రిటన్‌లో 'ఆర్ఆర్ఆర్' వసూలు చేసిన కలెక్షన్ల మొత్తాన్ని 17 రోజుల్లోనే తాము బీట్ చేశామని 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' బృందం ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఎంత వసూలు చేసిందనేది మాత్రం ఆ సినిమా బృందం వెల్లడించలేదు.

ఈ ఏడాది మార్చిలో బ్రిటన్‌లో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా రూ.100 కోట్లు రాబట్టినట్లు వార్తా పత్రిక మింట్ రిపోర్ట్ చేసింది.

మరొక వైపు పాకిస్తానీ సినిమా 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్'‌ను 50 కోట్ల(పాకిస్తాన్ రూపాయలు)తో నిర్మించగా ఇప్పటి వరకు 150 కోట్లు(పాకిస్తాన్ రూపాయలు) కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పాకిస్తాన్‌ మీడియా కూడా 'ఆర్ఆర్ఆర్ బ్రిటన్ కలెక్షన్లను ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ అధిగమించింది' అంటూ రిపోర్ట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

'రామ్ సేతు, థ్యాంక్ గాడ్ వెనక్కి'

దీపావళి సందర్భంగా అజయ్ దేవగణ్ నటించిన 'థ్యాంక్ గాడ్'... అక్షయ్ కుమార్, సత్యదేవ్‌లు నటించిన 'రామ్ సేతు' విడుదల అయ్యాయి.

అయితే ఈ సినిమాలు భారత్‌లోనే కాక అంతర్జాతీయంగా కూడా ఆకట్టుకోలేక పోతున్నట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రిపోర్ట్ చేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో 'థ్యాంక్ గాడ్', 'రామ్ సేత్' సినిమాలను 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' వెనక్కి నెట్టినట్లు ఆ పత్రిక తెలిపింది.

ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, Instagram/The Legend of Maula Jatt

పాకిస్తానీ-పంజాబీ సినిమా

ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ సినిమా అక్టోబరు 13న విడుదలైంది.

బిలాల్ లషారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ నటించారు.

ఈ సినిమా 'గ్లాడియేటర్' తరహాలో ఉంటుంది. గ్లాడియేటర్‌గా పోరాడే మౌలా జాట్(ఫవాద్ ఖాన్) చుట్టూ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది.

1979 నాటి పాకిస్తానీ సినిమా 'మౌలా జాట్‌' ఆధారంగా ఈ సినిమా తీశారు.

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్

ఫొటో సోర్స్, Facebook/RRR

సోషల్ మీడియాలో ట్రెండ్

భారతదేశానికి చెందిన ఆర్ఆర్ఆర్ సినిమాను బ్రిటన్‌లో పాకిస్తాన్‌కు చెందిన 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' బీట్ చేసిందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

పాకిస్తాన్‌కు చెందిన సినిమా అభిమానులు దీని మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'బ్రిటన్ బాక్సాఫీసు వద్ద #TheLegendofMaulaJatt ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ దూసుకు పోతోంది. #RRR, #Brahmastra రికార్డులను ఇది బ్రేక్ చేసింది' అంటూ ముహ్మద్ హనీఫ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

'అనేక బాలీవుడ్ సినిమాల రికార్డులను బద్ధలు కొట్టిన #TheLegendofMaulaJatt సినిమా... బ్రిటన్‌లో దక్షిణ భారత్‌కు చెందిన బ్లాక్‌బస్టర్ #RRR సినిమా రాబట్టిన వసూళ్లను అధిగమించింది. 1 మిలియన్ పౌండ్లు సాధించే దిశగా సినిమా దూసుకుపోతోంది' అంటూ ఖ్వాజిమ్ అలీ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ సినిమా బడ్జెట్ 50 కోట్ల పాకిస్తానీ రూపాయలుగా చెబుతున్నారు. పాకిస్తాన్‌ భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇదీ ఒకటి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బడ్జెట్ సుమారు రూ.550 కోట్లు.

అయితే కేజీఎఫ్-2 ‘బడ్జెట్’ అంత కూడా వసూలు చేయని సినిమా గురించి చర్చ ఎందుకు అని సర్రియల్ ఇండియన్ అనే ట్విటర్ ఖాతాదారు పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

వీడియో క్యాప్షన్, కాకినాడ సమీపంలో లారీ డ్రైవర్ల గ్రామం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)