ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారి వాదన ఏంటి?

భారత సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇక్బాల్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.

ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం తప్పు కాదని ప్రకటించింది. అయితే ఇది సుప్రీం కోర్టు ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పు కాదు.

ఆర్థికస్థితిగతులను ప్రాతిపదికగా చేసుకుని రిజర్వేషన్లు ఇవ్వడాన్ని న్యాయమూర్తుల్లో కొందరు వ్యతిరేకించారు.

మొత్తం అయిదుగురుతో కూడిన ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుకూలంగా ఓటు వేయగా ఇద్దరు వ్యతిరేకించారు. ఇందులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ కూడా ఒకరు.

బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఈ తీర్పును ఆహ్వానించాయి. ఇది 'ప్రధాని మోదీ విజయం' అంటూ బీజేపీ చెప్పుకోగా కాదు దానికి బీజాలు వేసింది మేమే అంటూ కాంగ్రెస్ ప్రకటించుకుంది.

డీఎంకే, ఆర్‌జేడీ వంటి పార్టీలు సుప్రీం కోర్టు తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేశాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

ఫొటో సోర్స్, Facebook/MK Stalin

ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

'సామాజిక అసమానతలను తొలగించేందుకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కానీ ఆర్థిక అసమానతలను తొలగించడానికి కాదు' అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారి మాట.

ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఒక సమస్య ఉందనేది వారి వాదన. మొత్తం రిజర్వేషన్లను 50శాతానికే పరిమితం చేసి ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం వల్ల సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుందని వారు చెబుతున్నారు.

ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మీద ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు.

ఒకవేళ రిజర్వేషన్ల పరిమితిని 50శాతం నుంచి 60శాతానికి పెంచితే అప్పుడు జనరల్ కేటగిరికి 40శాతం అవకాశాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని, ఎందుకంటే అది పేదరికాన్ని తొలగించే పథకం కాదని మహారాష్ట్ర మాజీ ఐపీఎస్ అధికారి అబ్దుర్ రెహమాన్ అన్నారు.

'ఓబీసీ లేదా వెనుకబడి ముస్లింల రిజర్వేషన్ల గురించి చర్చ వచ్చినప్పుడు... సరైన డేటా, వెనుకబాటు తనం, జనాభా శాతం వంటివి కోర్టులు అడుగుతుంటాయి. 50శాతం పరిమితిని మార్చకూడదని చెబుతుంటాయి.

కానీ ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి ఎటువంటి డేటా లేకుండానే 10శాతాన్ని ఎలా నిర్ణయించారు? 50శాతానికి మించకూడదనే నియమాన్ని ఎలా ఉల్లంఘించారు?' అని రెహమాన్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అయితే వెనుకబడిన వర్గాల కోసం తన గొంతును బలంగా వినిపించే సీనియర్ జర్నలిస్టు దిలీప్ మండల్ వంటి వారు సుప్రీం కోర్టు తీర్పును ఆహ్వానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

'ఓబీసీల రిజర్వేషన్లు 52శాతానికి పెంచేందుకు మార్గం సులభమైంది. 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వొచ్చని ఈడబ్ల్యూఎస్ కేసులో సుప్రీం కోర్టు తెలిపింది. ఇందిరా సాహ్నీ, బాలాజీ కేసుల్లో ఇచ్చిన తీర్పుల వల్ల ఇంతవరకు ఓబీసీ కోటా పెరగలేదు' అని ఆయన ట్వీట్ చేశారు.

  • రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 49.5శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు.
  • దీనికి అదనంగా ఆర్థికంగా వెనుకబడి వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించింది.
  • ఈడబ్ల్యూఎస్ కోటాను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 40 పిటీషన్లు దాఖలు అయ్యాయి.
  • సామాజిక న్యాయం చేయాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధమని ఈడబ్ల్యూఎస్ కోటాను వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు.
  • ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లో ఉంటే అందరికీ సమాన అవకాశాలు దొరకవు అని వారు కోర్టుకు తెలిపారు.
  • ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌ఆర్ సిన్హా నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. 2010లో సిన్హా కమిషన్ నివేదిక ఇచ్చింది.
  • జనరల్ కేటగిరిలో దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాల వార్షిక ఆదాయం ఆదాయపన్ను పరిమితికి లోపే ఉంటే వారిని ఆర్థికంగా వెనుకబడిన వారిగా గుర్తించాలని కమిషన్ సిఫారసు చేసింది.

సిన్హా రిపోర్టు ఆధారంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ధనిక రాష్ట్రంలో ప్రజలు ఇలా అట్టపెట్టెల మీద అన్నం ఎందుకు తినాల్సి వచ్చింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)