క్రికెట్ వరల్డ్ కప్‌ 2023: హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ సహా ఇండియన్ టీమ్‌లో ఎవరెవరు... ఏ మ్యాచ్ ఎప్పుడు?

క్రికెట్ ప్రపంచ కప్

ఫొటో సోర్స్, GETTY IMAGES

క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత జట్టు తరఫున ఆడే క్రీడాకారుల పేర్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభం అవుతుంది.

15 మంది సభ్యులతో ఉన్న భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్.

వీరితో పాటు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లు భారత తరఫున ప్రపంచ కప్‌లో ఆడనున్నారు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, GETTY IMAGES

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

సంజూ శామ్సన్, తిలక్ వర్మలకు భారత జట్టులో చోటు దక్కలేదు.

సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ శ్రీలంక చేరుకుని, భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌లతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడబోయే క్రీడాకారుల పేర్లను ఖరారు చేశారు.

మహమ్మద్ సిరాజ్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, మహమ్మద్ సిరాజ్

టీమ్‌లో కేఎల్ రాహుల్‌, సిరాజ్‌లకు చోటు

క్రికెట్ ప్రపంచ కప్ జట్టులో కేఎల్ రాహుల్‌కి చోటు దక్కింది. టీమ్‌లో కేఎల్ రాహుల్‌కి చోటు దక్కదేమోనని ఊహాగానాలు వినిపించాయి.

కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆడేందుకు శ్రీలంక వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

కేఎల్ రాహుల్ ఫిట్‌నెట్ టెస్ట్‌ను సోమవారం(సెప్టెంబర్ 4న) బెంగళూరులో నిర్వహించారు. టెస్ట్ పాస్ అయిన తర్వాత రాబోయే ఆసియా కప్ మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ ఆడుతున్నారు.

అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ మొదలవుతుంది. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19న జరగనుంది.

ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చే భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియా జట్టుతో ఆడనుంది.

ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఇండియా 2023

ఫొటో సోర్స్, GETTY IMAGES

46 రోజుల పాటు జరగబోయే ఈ మ్యాచ్‌ల కోసం 10 నగరాలలోని స్టేడియాలను ఎంపిక చేశారు.

మ్యాచ్‌లు జరిగే నగరాల్లో హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, దిల్లీ, చెన్నై, లక్నో, పుణే, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈసారి ఒక్క మ్యాచ్ కూడా షెడ్యూల్ చేయలేదు.

ఈ ప్రపంచ కప్‌లో మొత్తం 10 టీమ్‌లు పాల్గొంటున్నాయి.

రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఈ ప్రపంచ కప్‌ను ఆడతారు. అంటే అన్ని జట్లు కూడా ప్రతి ఒక్క టీమ్‌తో పోటీ పడతాయి.

నాకౌట్ స్టేజీలు, సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌ల కోసం టాప్ నాలుగు జట్లు క్వాలిఫై అవుతాయి.

నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్

ఎప్పుడు, ఎవరెవరి మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి?

అక్టోబర్ 5: ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజీలాండ్.. అహ్మదాబాద్‌లో జరుగుతుంది

అక్టోబర్ 6: పాకిస్తాన్, క్వాలిఫైయింగ్ టీమ్ 1.. మ్యాచ్ హైదరాబాద్‌లో జరగనుంది.

అక్టోబర్ 7: బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. ధర్మశాల వేదికగా కానుంది.

అక్టోబర్ 7: సౌతాఫ్రికా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. దిల్లీలో ఆడతారు

అక్టోబర్ 8: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. చెన్నై వేదికగా జరుగుతుంది

అక్టోబర్ 9: న్యూజీలాండ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. హైదరాబాద్‌లో ఆడతారు

అక్టోబర్ 10: ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్.. ధర్మశాల వేదికగా జరగనుంది.

అక్టోబర్ 11: భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. దిల్లీలో జరుగుతుంది మ్యాచ్.

అక్టోబర్ 12: పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. హైదరాబాద్ వేదిక కానుంది.

అక్టోబర్ 13: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా.. లక్నోలో జరుగుతుంది.

అక్టోబర్ 14: న్యూజీలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్.. చెన్నైలో ఆడతారు.

అక్టోబర్ 14: ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. దిల్లీలో ఈ మ్యాచ్ జరగనుంది.

అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది.

అక్టోబర్ 16: ఆస్ట్రేలియా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. లక్నో వేదిక కానుంది.

అక్టోబర్ 17: సౌతాఫ్రికా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. ధర్మశాలలో మ్యాచ్ జరగనుంది.

అక్టోబర్ 18: న్యూజీలాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. చెన్నైలో మ్యాచ్

అక్టోబర్ 19 భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. పుణేలో జరగనుంది ఈ మ్యాచ్.

అక్టోబర్ 20: పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్యలో.. బెంగళూరు వేదిక

అక్టోబర్ 21: ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా.. ముంబైలో ఆడతారు

అక్టోబర్ 21: క్వాలిఫైయింగ్ టీమ్ 1 వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. లక్నోలో జరుగుతుంది.

అక్టోబర్ 22: భారత్ వర్సెస్ న్యూజీలాండ్.. ధర్మశాల వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్.

అక్టోబర్ 23: పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. చెన్నై వేదిక కానుంది.

అక్టోబర్ 24: సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్‌.. ముంబైలో మ్యాచ్

అక్టోబర్ 25: ఆస్ట్రేలియా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. దిల్లీ వేదికగా జరగనుంది.

అక్టోబర్ 26: ఇంగ్లాండ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. బెంగళూరు

అక్టోబర్ 27: పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా.. చెన్నైలో జరుగుతుంది

అక్టోబర్ 28: బంగ్లాదేశ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. కోల్‌కతాలో జరుగుతుంది.

అక్టోబర్ 29: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. లక్నో వేదిక

అక్టోబర్ 30: ఆఫ్గనిస్తాన్ వర్సెస్ క్వాలిఫైయిగ్ టీమ్ 2.. పూణే వేదిక

అక్టోబర్ 31: పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్.. కోల్‌కతాలో మ్యాచ్ జరగుతుంది

నవంబర్ 1: న్యూజీలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా.. పూణేలో ఆడతారు

నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. ముంబైలో మ్యాచ్ జరగనుంది.

నవంబర్ 3: ఆఫ్గనిస్తాన్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. లక్నోలో మ్యాచ్ జరగనుంది.

నవంబర్ 4: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్.. అహ్మదాబాద్ స్టేడియంలో జరగనుంది.

నవంబర్ 4: న్యూజీలాండ్ వర్సెస్ పాకిస్తాన్.. బెంగళూరు స్టేడియంలో జరగనుంది.

నవంబర్ 5: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా.. కోల్‌కతా వేదిక కానుంది.

నవంబర్ 6: బంగ్లాదేశ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. దిల్లీ స్టేడియంలో జరగనుంది.

నవంబర్ 7: ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. ముంబై వేదిక కానుంది..

నవంబర్ 8.: ఇంగ్లాండ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. పూణేలో జరగనుంది.

నవంబర్ 9: న్యూజీలాండ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. బెంగళూరు స్టేడియంలో జరగనుంది.

నవంబర్ 10: సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. అహ్మదాబాద్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆడనున్నారు.

నవంబర్ 11: భారత్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. బెంగళూరు వేదిక

నవంబర్ 12: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్.. పూణేలో జరుగుతుంది.

నవంబర్ 12: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్.. కోల్‌కతా వేదిక కానుంది.

తొలి సెమీ ఫైనల్ - నవంబర్ 15: ముంబై

రెండో సెమీ ఫైనల్ - నవంబర్ 16: కోల్‌కతా

ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)