ఇండియా కాదు, భారత్? - ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరిట జీ-20 ఆహ్వానాలు పంపారంటూ కాంగ్రెస్, ఆప్ విమర్శలు

ఫొటో సోర్స్, Twitter/Raghav Chadha
జీ-20 సదస్సులో పాల్గొనే దేశాధినేతలకు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందుకు ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ పేరిట ఆహ్వానాలు పంపారంటూ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేసింది.
‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ అని రాశారంటూ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
రాష్ట్రపతి భవన్‌లో సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు హాజరు కావాల్సిందిగా జీ-20 దేశాధినేతలకు ఆహ్వానాలు వెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
సాధారణంగా రాష్ట్రపతి నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ పేరిట వస్తాయని, తాజాగా ఆహ్వాన పత్రికల్లో ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ అని పేర్కొన్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ ట్వీట్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
దేశ చరిత్రను వక్రీకరించడం, దేశాన్ని విభజించడాన్ని ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారని ఆయన ట్వీట్‌లో ఆరోపించారు.
‘‘ఈ వార్త నిజమే. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందుకు హాజరు కావాల్సిందిగా జీ-20 దేశాధినేతలకు ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ పేరిట ఆహ్వానాలు పంపారు. సాధారణంగా ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ పేరిట ఆహ్వానాలు వెళ్తాయి.
ఇప్పుడిక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ను ‘‘భారత్, ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్’’ అంటూ చదవాలేమో’’ అని ట్వీట్‌లో జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయంలో ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా కూడా విమర్శలు చేశారు. ప్రభుత్వం చేసిన పని ప్రజలకు విస్మయం కలిగించిందని చెప్పారు.
‘ఇండియా’ అనే పేరును ప్రభుత్వం ఎలా తొలగిస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఈ దేశం కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందినది కాదని, 135 కోట్ల భారతీయులందరి దేశమని రాఘవ్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇష్టానుసారంగా మార్చడానికి మన జాతీయ గుర్తింపు అనేది బీజేపీ వ్యక్తిగత సొత్తు కాదని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రతీ భారతీయుడు గర్వించే క్షణం: ఉత్తరాఖండ్ సీఎం
‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ పేరిట ఆహ్వానాలు పంపడం సరికాదంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విమర్శలు చేస్తుండగా, ఈ ఆహ్వానానికి అనుకూలంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్యలు చేశారు.
ఆహ్వాన పత్రికపై ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ అని రాయడం ప్రతీ భారతీయుడు గర్వించదగిన అంశమని ఆయన ట్వీట్ చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇవి కూడా చదవండి:
- ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- ఆంధ్రప్రదేశ్: 'ట్రాన్స్‌జెండర్ మహిళగా సర్జరీ చేయించుకున్నా... ఇప్పుడు జీవితం ఎలా ఉందంటే... ' -
- మదనపల్లె భానుభారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)