పేగు సంబంధ సమస్యలు పార్కిన్సన్స్‌కు ముందస్తు సంకేతమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిషెల్ రాబర్ట్స్
- హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్
పేగు సంబంధ సమస్యలైన మలబద్దకం, ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు, కడుపులో మంట లాంటివన్నీ కొంతమంది వ్యక్తుల్లో పార్కిన్సన్స్ వ్యాధికి ముందస్తు సంకేతాలుగా భావించవచ్చని కొత్త అధ్యయనం చెబుతోంది.
గట్ అనే జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలను ప్రచురించారు.
మెదడు పనితీరుకు, పేగుల ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్పేందుకు మరిన్ని ఆధారాలను అందులో పేర్కొన్నారు.
పేగు సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసుకోవడం ద్వారా పార్కిన్సన్స్‌కు ముందుగానే చికిత్స చేయవచ్చంటున్నారు పరిశోధకులు
పార్కిన్సన్స్ తీవ్రం కావడం అంటే మెదడు అనారోగ్యం త్వరగా పెరుగుతూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పార్కిన్సన్స్ అంటే ఏమిటి?
పార్కిన్సన్స్ సోకిన వాళ్లకు మెదడులో డోపమైన్ అనే రసాయనం తగినంత ఉండదు. ఎందుకంటే దాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బ తినడం వల్ల ఇలా జరుగుతుంది.
దీని వల్ల అసంకల్పిత కదలిక లేదా వణుకు, నెమ్మదిగా కదలికలు, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పార్కిన్సన్స్‌కు ప్రస్తుతం ఎలాంటి నివారణ లేనప్పటికీ, లక్షణాలను తగ్గించడానికి, వ్యాధి ప్రభావాన్ని తట్టుకుని వీలైనంత ఎక్కువ కాలం జీవించడానికి అవసరమైన చికిత్స అందుబాటులో ఉంది.
మెదడులో కణాలు దెబ్బ తిని నాడీ సంబంధిత లక్షణాలు కనిపించకముందే వ్యాధిని త్వరగా గుర్తించడం వల్ల త్వరగా చికిత్స ప్రారంభించవచ్చు.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు అమెరికాలో పార్కిన్సన్స్ సోకిన 24,624 మంది మెడికల్ రికార్డులు పరిశీలించి పోల్చి విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
19,046 మందికి అల్జీమర్స్
23,942 మందికి మెదడులో రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టడం
24,624 మందికి మెదడు ఆరోగ్యకరంగా ఉండటం
ఇందులో వాళ్లు ఏం తెలుసుకోవాలనుకున్నారంటే..
పార్కిన్సన్స్ ఉన్న రోగులకు వారి మెదడు రుగ్మత నిర్ధరణకు ముందు ఆరేళ్లలో ఏవైనా పేగు సంబంధిత సమస్యలు ఉన్నాయా?
పేగు సమస్యలు ఉన్న వ్యక్తుల్లో పార్కిన్సన్స్ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉందా?
ఐదేళ్ల డేటా ఆధారంగా రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం లభించింది.
పేగులకు సంబంధించి నాలుగు అంశాలు.. మలబద్ధకం, ఆహారం మింగడంలో ఇబ్బంది, చిన్న పేగులో ఆహారం కదలిక మందగించే పరిస్థితి, పేగుల్లో మంట వంటివాటి వల్ల పార్కిన్సన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
అయితే అపెండిక్స్ తొలగించిన వారిలో ఇలాంటి సమస్య లేదని కొంతమంది శాస్త్రవేత్తలు ఇంతకు ముందు చెప్పి ఉన్నారు.
జీర్ణాశయ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికీ పక్షవాతం సోకుతుందని చెప్పలేమని పరిశోధకులు నొక్కి చెప్పారు. ఆయితే పేగులు, మెదడు ఆరోగ్యానికి మధ్య ఏదో సంబంధం ఉందం ఉందని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మెదడు- పేగు
జీర్ణాశయ పేగులలో ఉన్న మిలియన్ల కొద్దీ కణాలు మెదడుకు సంకేతాలు పంపిస్తుంటాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థకు చేసే చికిత్స వల్ల మెదడుకు కూడా చికిత్స అందుతుంది. అలాగే ఈ రెంటిలో ఒక వ్యవస్త అనారోగ్యం బారిన పడితే దాని ప్రభావం మరొక దానిపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పార్కిన్సన్స్ డిసీజ్ సొసైటీ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రతినిధి క్లేర్ బేల్ తాను కనుగొన్న అంశాలు పై వాదనకు మరింత బలాన్ని చేకూర్చాయంటున్నారు. పేగు సంబంధ సమస్యలు పార్కిన్సన్స్‌కు ముందస్తు సంకేతం కావచ్చన్నారాయన.
పేగు సమస్యలు, మెదడుకు సంబంధం ఉందా లేదా అని అర్థం చేసుకుని, దాన్ని రోగులకు వైద్యం చెయ్యడానికి ఉపయోగించవచ్చా అని డాక్టర్లు తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ కిమ్ బారెట్ చెప్పారు.
"గ్యాస్ట్రోఇంటెస్టినల్ పరిస్థితులు పార్కిన్సన్స్ వ్యాధి రెండూ కలిసి మరో వ్యాధికి దారి తీసే అవకాశం ఉందని అయితే అది మరణానికి దారి తీసే అవకాశం లేదని ఈ అధ్యయనం తెలిపింది.
అయితే ఈ అంశాలన్నింటికీ వైద్యపరమైన ఆధారాలేవీ లేవు. ఇంకా మరి కొంత అధ్యయనం జరగాల్సి ఉంది.
పార్కిన్సన్స్ జీవ కణాల గురించి తెలుసుకోవడానికి, ముందస్తు సంకేతాలను గుర్తించడానికి పేగు తప్పనిసరిగా కీలక లక్ష్యమే అనే దానిని ఈ అధ్యయనం స్పష్టం చేసిందని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లోని యూకే దిమెన్షియా రీసర్చ్ ఇన్‌స్టిట్‌ట్యూట్‌లో పని చేస్తున్న డాక్టర్ టిమ్ బార్లెట్స్ చెప్పారు.
పార్కిన్సన్స్‌ను ముందుగా గుర్తించడం చాలా విలువైనది. ట్రీట్‌మెంట్, ఔషధాలను వాడేందుకు చాలా ప్రభావవంతమైనదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గదర్ 2: సన్నీ దేవోల్ మూవీకి ఎందుకింత క్రేజ్? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది?
- తాడిపత్రి బిర్యానీ: దీని రుచి ఎందుకంత స్పెషల్?
- ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- లూనా-25: చంద్రుడి మీద కూలిపోయిన రష్యా స్పేస్‌క్రాఫ్ట్
- ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు బీఎడ్ చదివినవారు అనర్హులా... సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














