ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా... ఇక నుంచి ఇది తప్పనిసరి

ఊటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఊటీ
    • రచయిత, తంగదురై కుమార పాండియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎండలు మండుతున్నాయి. ఎండ, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం చాలామంది చల్లని ప్రదేశాలకు, కొండ ప్రాంతాలకు వెళ్తుంటారు.

తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు.

అయితే, ఇకపై ఊటీ, కొడైకెనాల్‌కు వెళ్లాలంటే ఈ-పాస్ తప్పనిసరి.

కరోనా సమయంలో అనుసరించిన ఈ-పాస్ విధానాన్ని ఇప్పుడు కూడా పాటించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ-పాస్‌ ఎలా తీసుకోవాలి? ప్రభుత్వ బస్సులలో ఆ ప్రాంతాలకు వెళ్లొచ్చా?

ఊటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఊటీ

ఈ-పాస్ విధానం ఎందుకు?

భారత్‌లో పర్యటకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న రెండవ ప్రదేశంగా తమిళనాడు ఉన్నట్లు 2023లో కేంద్ర పర్యటక విభాగం పేర్కొంది.

విదేశీ పర్యటకులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఆరో స్థానంలో ఉంది.

తమిళనాడులో కొడైకెనాల్, ఊటీ వంటి పలు పర్యటక ప్రాంతాలకు ఎక్కువ మంది వస్తుంటారు. వేసవిలో టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది.

నీలగిరి జిల్లాలోని ఊటీని క్వీన్ ఆఫ్ హిల్స్‌గా, దిండిగుల్ జిల్లాలోని కొడైకెనాల్‌ను ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్‌గా పరిగణిస్తారు.

పర్యటక ప్రాంతాల్లో పర్యవరణ పరిరక్షణ గురించి వేసిన పిటిషన్‌ను ఇటీవల విచారించిన మద్రాసు హైకోర్టు ప్రస్తుతం ఈ ప్రాంతాలకు వచ్చే వారికి ఈ-పాస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పింది.

వేసవి సెలవుల్లో ప్రతి రోజూ ఊటీకి 1,300 వ్యాన్లతో పాటు 20 వేలకు పైగా వాహనాలు వస్తుంటాయని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది.

ఇది విన్న తర్వాత, జడ్జి ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకవేళ ఒకే సమయంలో అన్ని వాహనాలు కొండ ప్రాంతాలకు వెళ్తే, పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని, స్థానిక ప్రజల రాకపోకలు సాగించలేరని, పర్యావరణం, జంతువులపై ప్రభావం పడుతుందని జడ్జి అన్నారు.

చెన్నై ఐఐటీ, బెంగళూరు ఐఐఎం సహకారంలో థిసీస్‌ను సమర్పించాలని ఆదేశించారు.

కొండ ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్యను నియంత్రించేందుకు కరోనా కాలంలో అనుసరించిన ఈ-పాస్ విధానాన్ని మే 7 నుంచి జూన్ 30 వరకు ఊటీ, కొడైకెనాల్‌లో అమలు చేయాలని నీలగిరి, దిండిగుల్ జిల్లాల కలెక్టర్లను న్యాయస్థానం ఆదేశించింది.

ఊటీ పర్యాటక ప్రదేశం

ఫొటో సోర్స్, Getty Images

ఈ-పాస్ విధానమేంటి?

ఈ-పాస్‌ నిబంధనలో భాగంగా, ఈ కొండ ప్రాంతాలకు వచ్చే వాహనాల వివరాలను సేకరిస్తారు. ఎంత మంది వస్తున్నారు? పర్యటన ఎన్ని రోజులు వంటి విషయాలను సేకరించాల్సి ఉంటుంది.

కేవలం ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించాలని కోర్టు ఆదేశించింది. స్థానిక ప్రజలకు ఈ-పాస్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో తెలిపింది.

పర్యాటక కొండ ప్రదేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఊటీ

కొండ ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ

‘‘ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలను సందర్శించే పర్యటకుల సంఖ్య చాలా ఎక్కువ. కొడైకెనాల్‌కు ఆఫ్ సీజన్ నెలల్లోనే 1000 నుంచి 2000 వాహనాలు వస్తుంటాయి. ఇక వేసవి సెలవుల్లో అయితే 20 వేల నుంచి 30 వేల వాహనాలు వస్తాయి’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని పర్యటక విభాగానికి చెందిన ఒక అధికారి బీబీసీకి చెప్పారు.

పర్యటకుల రాక ఈ కొండ ప్రాంతాలకు ఎక్కువగా ఉండటంతో పర్యావరణంపై ప్రభావం ఉంటుంది.

పర్యటకుల సంఖ్య పెరిగితే, దీనిపై ఆధారపడిన చాలా రంగాలకు ఆదాయం వస్తుంది. కానీ, ట్రాఫిక్ రద్దీ వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం కష్టమవుతుంది.

ఈ-పాస్ విధానంపై కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఇక్కడకు వచ్చే వారు తమ వివరాలను జిల్లా పరిపాలన యంత్రాంగానికి ఇవ్వాలి.

ఈ-పాస్ విధానాన్ని ఎలా అమలు చేయాలి, ఎలా క్రమబద్ధీకరించాలి అనే విషయంపై పర్యటక, పోలీసు, అటవీ విభాగాలు, జిల్లా యంత్రాంగం చర్చిస్తున్నాయి.

ఏ విధానంలో, ఎంత మందికి ఈ-పాస్ ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ అధికారి తెలిపారు.

దిండిగుల్ జిల్లా కలెక్టర్ పూంగోడి
ఫొటో క్యాప్షన్, దిండిగుల్ జిల్లా కలెక్టర్ పూంగోడి

ఈ-పాస్ పొందడమెలా?

‘‘ఈ-పాస్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నాం. మే 7 నుంచి కేవలం ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే కొడైకెనాల్‌లోకి అనుమతిస్తాం’’ అని దిండిగుల్ జిల్లా కలెక్టర్ పూంగోడి బీబీసీకి చెప్పారు.

వెబ్‌సైట్ అంతకుముందే అందుబాటులోకి వస్తుందని, ఈ-పాస్ తీసుకున్న తర్వాత ప్రజలు కొడైకెనాల్ వెళ్లి, చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించవచ్చు అని తెలిపారు.

‘‘రోజులో ఎన్ని వాహనాలు కొడైకెనాల్‌కు వెళ్లాలి, బస్సులో ఎంత మంది వెళ్లేలా అనుమతించాలనే విషయాలను చర్చించాం. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తాం’’ అని జిల్లా కలెక్టర్ తెలిపారు.

పర్యాటక ప్రదేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఊటీ

ఈ-పాస్ విధానంతో సమస్యలు వస్తాయా?

‘‘ఈ-పాస్ విధానంతో పర్యటకులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని టూరిజం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.

వేసవి కాలంలో ఈ కొండ ప్రాంతాలకు వచ్చే పర్యటకుల సంఖ్య నియంత్రించలేని స్థాయిలో ఉంటుందని తెలిపారు.

దీని వల్ల, పర్యటక ప్రాంతాలు జనాల రద్దీని ఎదుర్కొంటున్నాయి. కానీ, కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం అమల్లోకి వస్తున్న ఈ-పాస్ విధానం వల్ల, రద్దీ లేకుండా పలు ప్రాంతాలను సందర్శించేలా పర్యాటకులకు అనుమతించనుంది.

కొంతమంది కేవలం సెలవుల్లోనే ఈ ప్రాంతాలకు వెళ్తుంటారు. వారికి, ఈ-పాస్ విధానం కొంత ప్రాక్టికల్ సమస్యను కలిగించనుంది.

ఈ విధానం కోసం ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. ఏలగిరి, మేఘమలై వంటి ఇతర పర్యాటక ప్రదేశాలకు కూడా పర్యాటకులు వెళ్తుంటారు.

టూరిజంపై ఆధారపడ్డ వారిపై ప్రభావం..

‘‘కొడైకెనాల్‌లో పర్యటకులపై ఆధారపడి పనిచేసే హోటళ్లు, హాస్టళ్లు, చిన్న వర్తకులు, పర్యటకులను తీసుకెళ్లే డ్రైవర్లు, టూర్ గైడ్లుగా పనిచేసే చాలా మందిపై ఈ-పాస్ విధానం ప్రభావం చూపుతుంది’’ అని టూర్ గైడ్ విజయ్ బీబీసీతో అన్నారు.

కొడైకెనాల్‌కు రోజుకు పరిమితి సంఖ్యలో వాహనాలు వెళ్లనున్నాయి. దీంతో, కొడైకెనాల్‌కు ఇక పరిమిత సంఖ్యలో పర్యటకులు మాత్రమే వస్తారు. వారు కొన్ని నిర్దిష్ట ప్రదేశాలకు వెళ్తారు.

సీజను బట్టి వేలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టే చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పారు. అంతేకాక, అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.

ఫ్రంట్స్ ఆఫ్ ది ఎర్త్ సుందరరాజన్
ఫొటో క్యాప్షన్, ఫ్రంట్స్ ఆఫ్ ది ఎర్త్ సుందరరాజన్

‘సొంత వాహనాలకు నియంత్రణ తప్పనిసరి’

కొడైకెనాల్, ఊటీ నగరాలకు వాటి సామర్థ్యానికి మించి వస్తుంటారని ఫ్రంట్స్ ఆఫ్ ది ఎర్త్ సుందరరాజన్ చెప్పారు.

‘‘కొడైకెనాల్, ఊటీ లాంటి పర్యాటక కొండ ప్రదేశాలకు సామర్థ్యానికి మించి పర్యాటకులు వస్తుంటారు. మద్రాసు హైకోర్టు నిర్ణయం స్వాగతించదగినది. పర్యాటకుల రద్దీ వల్ల ప్రభావితం చెందకుండా జీవవైవిధ్యాన్ని కాపాడాల్సి ఉంది’’ అని ఆయన బీబీసీకి తెలిపారు.

ఈ పర్యాటక ప్రదేశాలకు ప్రైవేట్ వాహనాలు రాకుండా ఆంక్షలు విధించాలి. కార్మికులపై ప్రభావం చూపని విధంగా ఈ-పాస్ విధానం అమలు చేయాలని సూచించారు.

వీడియో క్యాప్షన్, ఈ ఆంధ్రా ఊటీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ గడిపితే టీబీ వ్యాధి నయమవుతుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)