చంద్రయాన్ 3 దిగిన ప్రదేశం పేరు శివశక్తి పాయింట్

ఇస్రో శాస్త్రవేత్తలతో నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, NarendraModi/Facebook

చంద్రయాన్ 3ని విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ చేయగలిగిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని స్వయంగా కలిసి అభినందించారు. శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో నెట్‌వర్క్ కమాండ్ సెంటర్ చేరుకున్న ప్రధాని అక్కడ శాస్త్రవేత్తలను కలిశారు.

ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ నుంచి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తన పని ప్రారంభించడంతో ప్రధాని శాస్త్రవేత్తల నుంచి దాని సమాచారం తెలుసుకున్నారు.

చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎలా జరుగుతుందో ల్యాండర్ నుంచి రోవర్ బయటకు ఎలా వస్తుందో వీడియోల ద్వారా ఇస్రో సైంటిస్టులు ఆయనకు వివరించారు.

తర్వాత ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రధానికి చంద్రయాన్ 3 మోడల్‌ను బహూకరించారు. రోవర్ తీసిన చంద్రుడి ఫొటోలను ప్రధానికి అందించారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, చంద్రయాన్ 3 పని తీరును వివరిస్తున్న సోమనాథ్

‘నా మనస్సంతా మీతోనే ఉంది’

చంద్రుడిపైన చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన పాయింట్‌ను ‘శివశక్తి’గా పిలుచుకుందామని ప్రధాని మోదీ అన్నారు.

చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి శివశక్తిగా, చంద్రయాన్-2 ల్యాండ్ అయిన ప్రాంతానికి ‘తిరంగా’గా పేరు పెట్టుకుందామని మోదీ చెప్పారు.

‘‘ఒకవైపు విక్రమ్‌పై ఉన్న నమ్మకం, మరోవైపు ప్రజ్ఞాన్‌ ధైర్యంతో మన మేధస్సు నిరంతరం చంద్రుడిపై చెరగని ముద్రలు వేస్తోంది. వివిధ కెమెరాలతో తీసిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి.’’ అన్నారు.

‘‘నేను దక్షిణాఫ్రికాలో ఉన్నా. తర్వాత గ్రీస్ వెళ్లాను. నా మనసు మాత్రం పూర్తిగా మీతోనే ఉంది. కానీ, అప్పుడప్పుడు నేను మీకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఆతృత నాకు, కష్టాలు మీకు అనిపించింది. ఇంత ఉదయాన్నే, ఈ సమయంలో మీ దగ్గరికొచ్చా, ఈ సమయంలో..కానీ, మిమ్మల్ని కలవాలని, మీకు నమస్కరించాలని మనసులో అనిపించింది. అందుకే వచ్చేశాను. మీకు ఇబ్బంది కలిగుంటుంది.

ఇస్రో నెట్‌వర్క్ కమాండ్ సెంటర్‌లో ప్రసంగించిన మోదీ

ఫొటో సోర్స్, ANI

కానీ నేను భారత్ చేరుకోగానే వీలైనంత త్వరగా మిమ్మల్ని చూడాలనుకున్నాను, మీ అందరికీ సెల్యూట్ చేయాలనుకున్నా..ఈ సెల్యూట్ మీ కష్టానికి...మీ ధైర్యానికి...మీ శ్రద్ధకు...మీ సజీవతకు.. మీ భావోద్వేగాలకు...మీరు దేశాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లారంటే. ఇది మామూలు విజయం కాదు.. ఈ అనంత అంతరిక్షంలో భారత శాస్త్రవేత్తల సామర్థ్యానికి ఇది శంఖనాదం.. ఇండియా ఈజ్ ఆన్ ద మూన్..’’ అంటూ మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

స్పేస్ మిషన్స్ టచ్ డౌన్ పాయింట్లకు ఒక పేరు పెట్టే శాస్త్రీయ పరంపర ఉంటుందన్న విషయం తెలిసిందే. చంద్రుడిపై ఏ భాగంలో చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యిందో, ఆ ప్రాంతానికి నామకరణం చేయాలని భారత్ నిర్ణయించింది. చంద్రయాన్ 3 మూన్ ల్యాండర్ దిగిందో ఆ పాయింట్‌ను ఇకమీదట శివశక్తి అనే పేరుతో పిలుస్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఇస్రో శాస్త్రవేత్తలతో మోదీ

ఫొటో సోర్స్, NarendraModi/facebook

ఆగస్ట్ 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం

‘‘ఆగస్ట్ 23న భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. ఇక ఇప్పటి నుంచి, ఈ రోజుని భారత్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుందాం’’ అని ప్రధానమంత్రి ప్రకటించారు.

శాస్త్రవేత్తలు మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని చంద్రుడిపైకి తీసుకెళ్లారని అభినందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

50 నిమిషాల పాటు ప్రసంగం

తన ప్రసంగం మధ్యమధ్యలో ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

భారత్ చంద్రయాన్ 3 మిషన్ భూమి ఎదుర్కుంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కూడా సాయం చేస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ ఇస్రో కమాండ్ సెంటర్‌లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగం చేశారు.

21వ శతాబ్దంలో ప్రపంచంలోని పెద్ద పెద్ద సమస్యలను భారత్ పరిష్కరిస్తుందని, మన సాంకేతిక, శాస్త్రీయ ఆలోచలను ప్రపంచమంతా అంగీకరిస్తుందని మోదీ అన్నారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, NarendraModi/facebook

ఫొటో క్యాప్షన్, ఇస్రోలోని మహిళా శాస్త్రవేత్తలు, సిబ్బందితో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

చంద్రయాన్ మహాభియాన్ అనేది కేవలం భారత్ విజయవంతం మాత్రమే కాదని, మొత్తం మానవాళి సాధించిన విజయంగా అభివర్ణించారు.

మన మిషన్ చేపట్టే అన్వేషణ చంద్రుడిపైకి వెళ్లేందుకు అన్ని దేశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తుందన్నారు.

కేవలం చంద్రుడి రహస్యాలు తెలుసుకోవడమే కాకుండా, భూమిపై ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది సాయం చేస్తుందని మోదీ తెలిపారు.

‘‘ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ అనేవి అంతరిక్ష రంగంలో ఉన్నతమైన బలం. నేడు దేశ పాలనకి ముడిపడి ఉన్న ప్రతి అంశానికి స్పేస్ అప్లికేషన్‌ను అనుసంధానించే కార్యక్రమం పూర్తయింది. నేను ప్రధానమంత్రి అయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో, అంతరిక్ష శాస్త్రవేత్తలతో నేను వర్క్‌షాపు నిర్వహించాను. పరిపాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు స్పేస్ రంగాన్ని గరిష్టంగా వాడుకోవాలన్నది ఈ వర్క్‌షాపు ఉద్దేశ్యం’’ అని మోదీ తెలిపారు.

చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్‌

ఫొటో సోర్స్, ANI

చంద్రయాన్-3 ల్యాండర్ ఫొటోలు తీసిన చంద్రయాన్-2 ఆర్బిటర్

చంద్రయాన్-3 ల్యాండర్‌ను చంద్రయాన్-2 ఆర్బిటర్ తీసిన చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.

‘‘నేను నీకు గూఢచారిని!’’ అంటూ చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రయాన్-3 ల్యాండర్‌ను ఫొటోషూట్ చేసిందంటూ ఇస్రో ట్వీట్ చేసింది.

చంద్రయాన్-2లో ఆర్బిటర్‌ హై రెజల్యూషన్ కెమెరా(ఓహెచ్‌ఆర్‌సీ) ఉంది.

చంద్రుడి చుట్టూ ఏది ఉన్నా ఈ కెమెరా ఫొటోలు తీసి పంపుతుంది.

బుధవారం చంద్రయాన్-3 అక్కడ ల్యాండ్ అయిన తర్వాత, దీన్ని కూడా అది గుర్తించి, ఫొటోలు తీసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

వీడియో క్యాప్షన్, చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండ్ అయ్యింది, ప్రజ్ఞాన్ దిగేసింది.. ఇవి ఏం చేస్తాయంటే?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)