చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ పంపిన తొలి చిత్రాలివీ

చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో బుధవారం సాయంత్రం విక్రమ్ ల్యాండర్ కాలుమోపిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి పరిసరాలను విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసింది.

లైవ్ కవరేజీ

  1. రాకేశ్ శర్మ అంతరిక్షంలో ఏం చేశారు? అక్కడి నుంచి చూస్తే భారతదేశం ఎలా కనిపించింది?

  2. చెస్ ప్రపంచ కప్‌ రన్నరప్‌గా ప్రజ్ఞానంద.. ఎవరీ కుర్రాడు?

  3. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  4. చంద్రయాన్-3 విజయవంతం.. చంద్రుడిపై ‘ల్యాండర్ విక్రమ్’ను సురక్షితంగా దించిన ఇస్రో.. దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టిన తొలి దేశం ఇండియా

  5. చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ పంపిన తొలి చిత్రాలివీ

    ఇస్రో

    ఫొటో సోర్స్, ISRO

    చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ తొలి చిత్రాలను పంపించింది.

    చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో బుధవారం సాయంత్రం విక్రమ్ ల్యాండర్ కాలుమోపిన సంగతి తెలిసిందే.

    అనంతరం అక్కడి పరిసరాలను విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసింది.

    ఈ ఫోటోలను ఇస్రో ట్విటర్‌లో షేర్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. చంద్రయాన్-3: ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు కీలకమైన చివరి 15 నిమిషాల్లో ఇస్రో ఏం చేసింది?

  7. 'సైకిల్‌పై వెళ్లి చంద్రుడిపై దిగాం'.. చంద్రయాన్-3 విజయంపై నెటిజన్ల హర్షాతిరేకాలు

  8. చంద్రయాన్-3: అంతరిక్ష నౌక చుట్టూ ఉండే పసుపు పచ్చ ఫిల్మ్‌ను బంగారంతో చేస్తారా?

  9. మిజోరం: నిర్మాణంలో ఉన్న రైలు వంతెన కూలి 17మంది మృతి

    కూలిన వంతెన

    ఫొటో సోర్స్, ZoramthangaCM

    మిజోరంలోని సాయిరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైలు వంతెన కూలడంతో 17 మంది మరణించినట్లు పోలీసులు చెప్పారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    కూలిన బ్రిడ్జి శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 35-40 మంది కార్మికులు పని చేస్తున్నారు.

    ఘటనా స్థలం రాజధాని ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ‘‘శిథిలాల కింద నుంచి 17మంది శవాలను వెలికి తీశాం. కింద ఇంకా చాలామంది ఉన్నారు’’ అని పోలీసులు వెల్లడించారు.

    ప్రమాద ఘటన స్థలంలోని దృశ్యాలను మిజోరం ముఖ్యమంత్రి జోరామ్‌తాంగ ఎక్స్(ట్విటర్) ద్వారా షేర్ చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  10. మీ గుండె వయసెంత... మీ అసలు వయసు కన్నా ఎక్కువా?

  11. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద దిగడానికి ఎంత సమయం పడుతుంది?

    చంద్రయాన్-3

    ఫొటో సోర్స్, ANI

    బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు సిద్ధమవుతోంది.

    షెడ్యూల్ ప్రకారం ఈ మిషన్ జరుగుతుందని, సాయంత్రం 5:20 గం.ల నుంచి ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది.

    ల్యాండింగ్ ప్రక్రియ మొత్తం 30 నిమిషాల వరకు పట్టవచ్చని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు.

    “ల్యాండర్ మాడ్యూల్ పరిస్థితి, సిస్టమ్‌లు ఎలా పని చేస్తున్నాయి, చుట్టూ వాతావరణం ఎలా ఉంది? వంటి అనేక అంశాలపై ఇది సరిగ్గా ఎన్ని గంటలకు ల్యాండ్ అవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. ముందు నిర్ణయించిన ప్రదేశంలో దిగాలా, లేక కొత్త ప్రదేశంలో దిగాలా అన్నది కూడా అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయిస్తాం’’ అని సోమ్‌నాథ్ అన్నారు.

    విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌ విజయవతంగా చేయగలిగితే, అలా చేసిన మొదటి దేశంగా భారత్ నిలుస్తుంది.

    అలాగే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.

  12. జో బైడెన్: సెప్టెంబర్‌లో భారత పర్యటనకు అమెరికా అధ్యక్షుడు

    మోదీ

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీల మధ్య భారత్‌లో పర్యటించనున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్ వస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న అనేక సవాళ్లను ఈ సదస్సులో చర్చిస్తారని వైట్ హౌస్ నుంచి వెలువడిన ఒక ప్రకటన తెలిపింది.

    వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరిన్ జీన్‌పియర్ ఈ పర్యటనకు సంబంధించిన ఒక ప్రకటనలో...

    “ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రయత్నాలపై జీ20 సదస్సులో చర్చిస్తారు. క్లీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, యుక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఆర్థిక, సామాజిక ప్రభావాలను తగ్గించడం వంటి అంశాలు చర్చిస్తారు’’ అని పేర్కొన్నారు.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ లైవ్ పేజ్‌కు స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజ్‌ను చూడండి. నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.