కరవు కాలంలో రైతులకు గుమ్మడి సాగు లాభాలు ఇస్తుందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రాశి గోయల్
- హోదా, బీబీసీ కోసం
గుమ్మడికాయ మనందరికీ సుపరిచితమే.
ఈ పంట ఎంతటి కరువు పరిస్థితులునైనా తట్టుకోగలదు.
అత్యధిక మొత్తంలో పోషకాలను గుమ్మడి అందిస్తుంది. దీంతో గుమ్మడికాయ రాబోయే రోజుల్లో సూపర్ ఫుడ్‌గా అవతరించనుందా అంటే అవుననే వినిపిస్తుంది.
పశ్చిమ దేశాల్లో సంప్రదాయ హాలిడే ఆహారంలో ప్రధానమైనదిగా గుమ్మడికాయ ఉంది.
గుమ్మడికాయలో పుష్కలమైన పోషకాలతోపాటు వైద్య చికిత్సకు కూడా అనువైన పదార్థాలున్నాయి.
అత్యధిక పోషకాలు, తేలిగ్గా పెరిగే స్వభావం, కరువును కూడా తట్టుకునే సామర్థ్యం ఉన్ననప్పటికీ, ఈ పంట పెద్ద ఎత్తున నిర్లక్ష్యానికి గురైంది. రైతులు నీళ్ల కొరతను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నారు.
కాలుష్య స్థాయిలు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా సరైన పోషకాహారం తీసుకోని వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
దీంతో గుమ్మడికాయ సాగు మాత్రమే ప్రస్తుతం వారికి వరంగా నిలుస్తోంది.
బంగ్లాదేశ్‌లో ఎలా సాగు చేస్తున్నారు?
బంగ్లాదేశ్‌లో మినీ ఎడారిగా చెప్పే శాండ్ బార్స్ డిజర్ట్‌లో వాతావరణ మార్పులతో, రుతుపవనాల సమయంలో ఐదు నెలల పాటు కుండపోత వర్షం కురిసి భారీ వరదలు ముంచెత్తాయి.
కలుషితమైన నదిలో అత్యంత విషపూరితమైన కారకాలు ఉన్నాయి. ఇవి భూమిని నిరూపయోగంగా మార్చాయి.
దీంతో, నదీ వరదలతో కోతకు గురైన భూములలో గుమ్మడికాయలను సాగు చేస్తున్నారు ప్రజలు.
ఆహార భద్రత, నిరుద్యోగం, పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు రైతులు గుమ్మడికాయలను పండిస్తున్నారు.
2005లో పేదరికాన్ని నిర్మూలించేందుకు గుమ్మడికాయల ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించారు.
ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలను ఉద్దేశించి కాకుండా ఆచరణ కోసం మాత్రమే తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘పంప్కిన్స్ ప్లస్’ అనే లాభాదాయక ప్రాజెక్ట్‌గా మారింది.
‘‘వెయ్యి మందికి పైగా అగ్రి వ్యాపారవేత్తలతో కలిసి పనిచేస్తున్నాం. ఖతార్, మలేషియా, సింగపూర్, ఇతర దేశాలకు గుమ్మడికాయలను ఎగుమతి చేస్తున్నాం. వాణిజ్యపరమైన వ్యవసాయం దిశగా స్థానిక ప్రజల దృష్టి మరల్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’’ అని పంప్కిన్స్ ప్లస్ ఆగ్రో ఇన్నొవేషన్ లిమిటెడ్ ఇన్నొవేటర్, ఫౌండర్ డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చౌదరి అన్నారు.
గత ఐదు నెలల కాలంలో స్థానిక ప్రజలు సగటున సుమారు 6 వేల పౌండ్లు సంపాదించారు.

ఫొటో సోర్స్, NAZMUL CHOWDHURY
ఇతర పంటల కంటే ఎక్కువ లాభాలు
కరువు ప్రభావిత ప్రాంతాల్లో, సాగు నీరు లభ్యం కానీ ప్రాంతాల్లో గుమ్మడి సాగు లాభదాయకమైన పంటగా కనిపిస్తోంది.
తక్కువ సాగునీరు లభ్యమవుతుండటంతో, బంగ్లాదేశ్‌లోని రైతులు ఇసుక బెల్టులలో గుమ్మడికాయలనే పండిస్తూ, ఇతర పంటల కంటే అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నారు.
తుర్కియే సెల్‌కుక్ యూనివర్సిటీ పరిశోధకులు కరువును తట్టుకునే సామర్థ్యమున్న సాగు పద్ధతులతో గుమ్మడికాయల వివిధ రకాల జాతులను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో వచ్చిన అనూహ్య వరదలతో.. చౌదరీ, ఆయన టీమ్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
భూసారం పెరుగుతుంది
నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో గుమ్మడికాయలు పండటమే కాకుండా.. ఇవి పెరిగే భూములకు కూడా లాభాదాయకతను చేకూరుస్తాయి.
స్థానిక రకాలకు చెందిన గుమ్మడికాయలను పండించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నట్లు అడ్వకసీ కోయలిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్(ఏసీఎస్ఏ) పాలసీ ఆఫీసర్ నాసునా ఫ్లోరెన్స్ తెలిపారు.
భూకోతను తగ్గించేందుకు, వాతావరణంలో నైట్రోజెన్ స్థాయులను తగ్గించేందుకు, భూసార నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్ట్ కోసం గుమ్మడికాయలను ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అంతర్జాతీయ శాస్త్రీయ సమాజం కూడా ఈ పంటపై ఆసక్తి కనబరుస్తోంది. నీటి అవసరాలు పెరుగుతోన్న ఈజిప్ట్ దేశంలో, ఆహార అభద్రతను నిర్మూలించేందుకు శాస్త్రవేత్తలు గుమ్మడికాయల విత్తనాలను కనుగొని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
యూఏఈ థ్యాంక్స్ గివింగ్ సీజన్‌లో వచ్చే డిమాండ్‌ను అందుకునేందుకు ఉష్ణోగ్రత నియంత్రణ విధానాలతో, యూరోపియన్ ఇన్నొనేషన్, టెక్నాలజీలను వాడుతూ యూఏఈలోని ఎలైట్ ఆగ్రో అనే కంపెనీ గుమ్మడికాయలను పండిస్తోంది.
గుమ్మడికాయల కోసం ఇంతగా పరిశోధనలు చేస్తున్నారంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, వీటిలో పుష్కలమైన పోషకాలుంటాయి.
గుమ్మడికాయ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ పలు కేన్సర్లను నిర్మూలించనున్నాయి.
పోషకాలు, తక్కువ కేలరీలు, విటమిన్ ఏ అత్యధికంగా లభించే కాయలు ఇవి.
బీటా కెరోటిన్, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఐరన్, ఫోలేట్ వంటివి కూడా దీనిలో ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
మలేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ పుత్రా 2021 అధ్యయనం గుమ్మడికాయలను ‘‘ఈ యుగంలో విప్లవాత్మకమైన పంట’’గా అభివర్ణించింది.
సమతులమ్యైన ఆహార వనరు, తక్కువ నేల, నీరు అవసరమయ్యే పంట ఇది.
ఇతర ప్రధాన పంటలతో పోలిస్తే, ఏ పరిస్థితుల్లోనైనా ఇది పండుతుందని తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం
గుమ్మడికాయలో పుష్కలమైన విటమిన్లు, పోషకాలు ఉండటంతో.. పోషకాహారం దొరకడం కష్టమయ్యే ప్రాంతాలకు ఈ పంట ఒక వరంగా నిలుస్తోంది.
‘‘అభివృద్ధి చెందుతోన్న దేశాల ప్రజలకు అత్యవసరమైన విటమిన్లు, మినరల్స్, ఫ్యాట్స్‌కు గుమ్మడికాయలు ప్రధాన వనరుగా ఉన్నాయి’’ అని అమెరికాలోని ఇల్లినోయిస్ అర్బనా క్యాంపెయిన్ యూనివర్సిటీ క్రాప్ సైన్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సారా హింద్ చెప్పారు.
గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శిశువు పెరుగుదలకు సహకరిస్తుంది. శరీరం కండరాలు బలోపేతం చేయడానికి, ప్రొటీన్లకు ఇది సహకరిస్తుంది.
సోయా, మిల్లెట్, బియ్యం పిండిలో వాడే గుమ్మడికాయ ఉత్పత్తులను తయారు చేయడంలో యుగాండా కంపెనీ బైఫ్ ఫుడ్స్ ప్రధానదారిగా ఉంది. నదీ తీర ప్రాంతాల్లో కోతకు గురైన భూముల్లో కంపెనీ గుమ్మడికాయలను పండిస్తోంది.
గుమ్మడికాయ ఉత్పత్తులను పిల్లల పోషక అవసరాలను తీర్చడానికి గంజిగా తినిపిస్తారు. కెన్యాలో, గుమ్మడికాయను జొన్న పిండిలో కలపడం ద్వారా పిల్లలలో విటమిన్ లోపాన్ని పరిష్కరిస్తున్నారు.

ఫొటో సోర్స్, NAZMUL CHOWDHURY
గుమ్మడి సాగులో ఇబ్బందులు ఇవీ
దక్షిణాసియా, ఆఫ్రికాకు ఇది ట్రాన్స్‌ఫర్మేటివ్ పంట అని నజ్ముల్ ఇస్లాం చౌదరి చెప్పారు.
ఉష్ణ మండలంలో ఉన్న దేశాలకు కూడా ఈ పంట సాగు అనువుగా ఉంటుంది.
దీనికి శీతల ప్రదేశంలో నిల్వ ఉండే లక్షణాలు లేకపోవడం వలన పేద దేశాలు, విద్యుత్ సదుపాయం అంతగా లేని ప్రాంతాలలో సాగుకు అనుకూలంగా ఉంటుందని ప్రిన్స్ మటోవ్ అన్నారు.
గుమ్మడి సాగులో కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి.
"గుమ్మడికాయ మొక్కల పువ్వులు పరాగసంపర్కం కోసం తేనెటీగలపై ఆధారపడతాయి, కానీ ఇతర కీటకాలు కూడా పువ్వులపై వాలి మొక్కలను పాడుచేస్తాయి" అని హింద్ చెప్పారు.
అయితే గుమ్మడిలో నష్టాల కంటే లాభాలే ఎక్కువ .
గోవా వంటి భారతదేశంలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాలలో, గుమ్మడి గింజలను కంపోస్ట్ డబ్బాలలో ఉంచి గుమ్మడికాయ తీగలను చాలా సులభంగా పెంచుతారు.
ఈ పంటలో అన్ని భాగాలు అంటే పళ్లు, గింజలు, పువ్వులు, ఆకులు, లేత కాండలను ఉపయోగిస్తారు. కాబట్టి ఈ పంట రైతుకు మరింత లాభదాయకంగా ఉంటుంది.
ఇండియా, కొన్ని ఆగ్నేయాసియా దేశాలలో గుమ్మడికాయ ఆకులను తింటారు. అలాగే పశువులు, సముద్ర జీవులకు గుమ్మడి ఆకులను ఆహారంగా ఉపయోగిస్తారు.
తీవ్ర వాతావరణం ఉన్న ప్రాంతాలలో వీటిని సులభంగా పెంచవచ్చు. ఎన్నో పోషకాలు, ప్రతి భాగం తినదగిన లక్షణం కలిగిన ఈ పంట, ఆహార లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలకు ప్రాణదాతగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- దిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పాఠశాలలు బంద్
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- తెలంగాణలో బీసీని సీఎం చేస్తామన్న బీజేపీ... తెలుగు ముఖ్యమంత్రుల్లో ఏ కులం వారు ఎందరున్నారు?
- వరల్డ్ కప్ 2023 : ద్రవిడ్ ప్రతీకారం తీర్చుకుంటారా...ఎవరి మీద, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














