50 లక్షల కుటుంబాలకు అన్నం పెడుతున్న వరి వంగడం అంతరించిపోకుండా కాపాడిన ప్రొఫెసర్

పంట

ఫొటో సోర్స్, Getty Images

ఆగ్నేయాసియాలో 50 లక్షల కుటుంబాలు ఆహారంగా ఉపయోగించే అరుదైన బియ్యం రకాన్ని అంతరించిపోకుండా కాపాడారు ఒక ప్రొఫెసర్.

భారత్, పాకిస్తాన్, నేపాల్‌లోని పర్వత ప్రాంత ప్రజలకు జుమ్లీ మార్షి రకం బియ్యంతో వండే అన్నం అత్యంత పోషకమైన వాటిలో ప్రధానమైనది.

అయితే ఈ పురాతన రకం పంటకు తెగుళ్లు సోకాయి.

దీంతో ఈ జుమ్లీ మార్షిని కాపాడేందుకు బాంగోర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ విట్‌కోంబ్ ముందుకొచ్చారు.

ఈ అరుదైన రకం అంతరించిపోకుండా జన్యువు అందించి సాయపడ్డారు.

పంటలు

ఫొటో సోర్స్, Getty Images

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పోషకం

"అధిక ఎత్తులో అంటే పర్వత ప్రాంతాలలో వరి పండించే వాతావరణంలో ఈ వ్యాధి-నిరోధక 'జుమ్లీ మార్షి' రకం పంట రైతులకు గేమ్ ఛేంజర్‌గా ఉంటుంది" అని ఆయన చెప్పారు.

ఈ పంటను 550 ఏళ్ల క్రితం మొదటిసారిగా సాగు చేసినట్లు చెబుతారు.

గులాబీ రంగులో ఉండే ఈ వరిని పశ్చిమ నేపాల్‌లో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో పండిస్తారు.

ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. మధుమేహంతో బాధపడే వారు ఈ బియ్యం తినొచ్చని చెప్తారు.

అయితే.. నేపాల్‌లో ఈ రకం వరి పంటకు బ్లాస్ట్ ఫంగస్ పెద్ద ఎత్తున సోకడంతో రైతులు ఇతర రకాలకు, ఇతర పంటలకు మారాల్సి వచ్చింది.

ఈ సమస్యకు పరిష్కారం కోసం మొక్కల పెంపకం నిపుణుడు జాన్ విట్‌కాంబ్ స్వదేశీ రైతులతో కలిసి పనిచేశారు .

1980లలో ఫిలిప్పీన్స్‌లో ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి అభివృద్ధి చేసిన జన్యువును ఆయన ఇక్కడ ఉపయోగించారు.

అప్పట్లో ఈ జన్యువుతో మూడు వ్యాధి-నిరోధక జుమ్లీ మార్షి రకాలను తయారు చేశారు.

స్థానిక రకంపై నేపాల్‌లోని జుమ్లా ప్రాంత రైతులు అడుగుతున్నారని, వారు దీనిపట్ల సంతోషంగా ఉన్నారని విట్‌కాంబ్ తెలిపారు.

నేపాల్ రైతు రేషమ్ అమ్‌గాయ్‌తో కలిసి చేసిన 13 సంవత్సరాల కృషికి ఇది ఫలితమని విట్‌కోంబ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)