గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి

ఫొటో సోర్స్, Getty Images
గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం రాత్రి కాల్పుల కారణంగా మొదలైన ఉద్రిక్తతలు శనివారం ఉదయానికి కూడా కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో 10 మంది మరణించారు. ఆ తర్వాత గాజా ప్రయోగించిన కొన్ని డజన్ల రాకెట్లు గగన తలంలో మెరుస్తూ కనిపించాయి.
మృతుల్లో మిలిటెంట్ నాయకుడు తహసీర్ జబారీ కూడా ఉన్నారు. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ (పీఐజె) నుంచి పొంచి ఉన్న ప్రమాదం వల్ల వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
గాజాలో ఒక ఐదేళ్ల చిన్నారి కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అనేక మంది చిన్నారులు గాయపడ్డారు.
దాడులను ఎదుర్కొనేందుకు పీఐజె తొలుత ఇజ్రాయెల్‌పై 100 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ అడ్డుకుంది. ఇజ్రాయెల్‌లోని చాలా నగరాల్లో సైరెన్ శబ్దాలు వినిపించాయి.
ఇజ్రాయెల్ సైన్యం తిరిగి మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులను మొదలుపెట్టినట్లు చెప్పారు.
వెస్ట్ బ్యాంక్‌లో శనివారం నిర్వహించిన దాడుల్లో ఇజ్రాయెల్ పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపుకు చెందిన 19 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది.
మే 2021లో జరిగిన 11 రోజుల పోరులో 200 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని డజన్ల మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. శుక్రవారం రాత్రి ఇక్కడ చోటు చేసుకున్న హింస తిరిగి పోరును తలపిస్తోంది.
గతంలో ఇరు వర్గాలకు ఈజిప్టు మధ్యవర్తిత్వం వహించింది. ఈ పోరు మరింత ఉధృతం కాకుండా ఉండేందుకు మరోసారి చొరవ తీసుకునేందుకు సంసిద్ధత తెలుపుతోంది.
ఇందుకోసం పీఐజె ప్రతినిధులకు ఆతిధ్యం ఇచ్చేందుకు కైరో అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు ఈజిప్టు మీడియా తెలుపుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
"దేశానికి పొంచి ఉన్న తక్షణ ముప్పును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఈ చర్యకు పాల్పడింది" అంటూ ఇజ్రాయెల్ ప్రధాని యాయిర్ లాపిడ్ టెలివిజన్ ద్వారా చేసిన ప్రసంగంలో చెప్పారు.
"ఈ పరిస్థితి ఎలా పరిణమిస్తుందో మాకు తెలియదు. కానీ, కొంత సమయం పడుతుంది. ఈ పోరు దీర్ఘకాలం ఉండొచ్చు. ఇది కఠినంగా ఉండవచ్చు" అని ఇజ్రాయెల్ ఇంటీరియర్ మినిస్టర్ ఆయెలెట్ షాకెద్ చెప్పారు.
పీఐజె స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.
గాజాలో ఉన్న ఎత్తైన భవనం కూడా కాల్పులకు గురవ్వడంతో భవనం నుంచి పొగ రావడం కనిపిస్తోంది.
ఈ ఆపరేషన్ లో కనీసం 15 మంది మిలిటెంట్లు మరణించి ఉంటారు" అని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి అంచనా వేశారు.
అయితే, దాడులు మొదలైనప్పటి నుంచి నలుగురు మిలిటెంట్లు మరణించారని స్థానిక వైద్యాధికారులు చెబుతున్నారు.
తాయిసీర్ జబారీ పీఐజె లో అత్యున్నత స్థాయి కమాండర్ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెబుతున్నాయి. ఆయన ఇజ్రాయెల్ పౌరుల పై అనేక మిలిటెంట్ దాడులు నిర్వహించారని ఆరోపిస్తోంది.
ఈ దాడుల్లో ఐదేళ్ల అలా కద్దుమ్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మరో 79 మంది మరణించినట్లు ఏఎఫ్ పీ వార్తా సంస్థ పేర్కొంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
"ఈ దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఈ పోరాటంలో మేము గెలుస్తాం" అని అంటూ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పర్యటనలో ఉన్న పీఐజె సెక్రెటరీ జనరల్ జియాద్-అల్-నఖాలా అన్నారు.
"ఈ యుద్ధానికి సరిహద్దు రేఖలు లేవు. ఈ పోరులో ప్రయోగించిన రాకెట్లతో టెల్ అవీవ్ నిండిపోతుంది" అని అన్నారు.
ఈ పోరులో సాయుధ దళాలు సమైక్యంగా ఉన్నాయని, మౌనం వహించే ప్రసక్తి లేదని గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న హమాస్ ప్రకటించింది.
సోమవారం వెస్ట్ బ్యాంక్‌లో పీఐజె అధినేత బస్సీమ్ సాదీని ఇజ్రాయెల్ అరెస్టు చేసిన తర్వాత ఈ పోరు మొదలయింది.
జెనిన్ ప్రాంతంలో కొనసాగుతున్న అరెస్టు కార్యకలాపాల్లో భాగంగా ఈయనను అరెస్ట్ చేశారు. ఇజ్రాయెల్‌లోని అరబ్బులు, పాలస్తీనీయులు చేసిన దాడుల్లో 17 మంది ఇజ్రాయెల్ పౌరులు, ఇద్దరు యుక్రెయిన్ పౌరులు మరణించారు. దాడులు నిర్వహించిన వారిలో ఇద్దరు జెనిన్ జిల్లాకు చెందిన వారు.

బస్సీమ్ సాదీ అరెస్టుకు ప్రతీకారంగా పీఐజె ఇజ్రాయెల్ పౌరుల పై దాడులు చేయవచ్చని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
దీంతో, గాజా సరిహద్దుల్లో భద్రతను పెంచింది.
గాజాలో పీఐజె ఒక శక్తివంతమైన మిలిటెంట్ గ్రూపు. వీరికి ఇరాన్ మద్దతు ఉంది. ఈ గ్రూపుకు సిరియా రాజధాని డమాస్కస్‌లో ప్రధాన కేంద్రం ఉంది.
ఈ గ్రూపు ఇజ్రాయెల్‌లో జరిగిన రాకెట్ దాడులు, కాల్పులు మాత్రమే కాకుండా చాలా దాడులకు బాధ్యత వహించింది.
నవంబర్ 2019లో ఇజ్రాయెల్ పీఐజె కమాండర్‌ను హతమార్చిన తర్వాత, పీఐజె, ఇజ్రాయెల్ మధ్య ఐదు రోజుల పాటు పోరు జరిగింది. ఆయన ఇజ్రాయెల్ పై దాడికి ప్రణాళిక చేస్తుందని ఆరోపించింది.
ఈ హింసలో 34 మంది పాలస్తీనా పౌరులు మరణించగా, 111 మంది గాయపడ్డారు. 63 మందికి చికిత్స అవసరమైంది.
పాలస్తీనాలో మరణించిన వారిలో 25 మంది మిలిటెంట్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- చీతా: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ వస్తోంది
- పాము, కప్ప: ప్రపంచానికి 1,39,087 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని కలిగించిన రెండు జీవులు..
- క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











