పాకిస్తాన్: పార్లమెంటును ఇమ్రాన్ ఖాన్ ఎందుకు రద్దు చేశారు? దీనిపై పాకిస్తానీలు ఏం అంటున్నారు?

ఫొటో సోర్స్, @IMRANKHAN
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఊహించని రీతిలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు చేశారు. దీంతో నేషనల్ అసెంబ్లీని ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు.
‘‘నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనకు పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ అంగీకారం తెలిపారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 58 (1), ఆర్టికల్ 48 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు’’అని పాక్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 3న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరీ తిరస్కరించారు. ఈ అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఈ అవిశ్వాసం నుంచి గట్టెక్కడానికి అవసరమైన ఆధిక్యం లేదు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ)కు చెందిన కొందరు ఎంపీలు కూడా విపక్షంవైపు వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, EuropaNewswire/Gado/Getty Images
342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌కు 155 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. కొన్ని పార్టీలు కూడా ఇమ్రాన్ ఖాన్ సంకీర్ణాన్ని వీడి వెళ్లిపోయాయి.
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే, విపక్షాలు పైచేయి సాధించి ఉండేవి. వారి దగ్గర ఆధిక్యానికి అవసరమైనంత మంది ఎంపీలున్నారు. మరోవైపు ఇమ్రాన్‌కు ఓటమి తప్పదని మీడియాలో విశ్లేషణలు కూడా వచ్చాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇప్పుడు పార్లమెంటును రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. 90 రోజుల్లోనే ఎన్నికలు జరిగే అవకాశముందని పాకిస్తానీ మీడియా పేర్కొంది.
అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ పాకిస్తాన్ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు.
‘‘అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడాన్ని స్వాగతిస్తున్నా. పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఎలాగైనా మార్చేయాలని విదేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వెన్నుపోటుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి కుట్రలు విజయం సాధించడాన్ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. అసెంబ్లీని రద్దు చేయాలని నేను అధ్యక్షుడికి సిఫార్సు చేశాను’’అని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Reuters
‘‘ప్రజలు ఎన్నికలకు సిద్ధం కావాలి. దీనికి కావాల్సిన ఎన్నికల ప్రక్రియలు మొదలుపెడతాం. నేడు పాకిస్తాన్ ఓ కుట్రను భగ్నం చేసింది’’అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
అయితే, పాకిస్తాన్‌లో చాలా మంది ఇమ్రాన్ ఖాన్ నిర్ణయాన్ని రాజ్యాంగ ఉల్లంఘనగా చెబుతున్నారు.
ఈ అంశంపై పాకిస్తానీ జర్నలిస్టు హమిద్ మీర్ ఒక ట్వీట్ చేశారు. ‘‘నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 కింద అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. మరోవైపు నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు. పాకిస్తాన్‌ను పీటీఐ రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టేసింది. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
నేను చివరి బంతి వరకు పోరాడతానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు, క్రికెటర్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈ విషయంపైనా హమిద్ చురకలు అంటించారు.
‘‘ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు ఆడటానికి బదులు.. తన వికెట్ తానే పట్టుకుని గ్రౌండ్ నుంచి పరిగెత్తారు’’అని హమిద్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘‘డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న పాకిస్తాన్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అసన్ భున్ వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే. ఈ విషయంలో సుప్రీం కోర్టు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలి. మాకు ప్రజాస్వామ్యం కావాలి. సైనిక చట్టాలు కాదు’’అని ఆయన అన్నారు.
మరోవైపు భారత్‌కు హైకమిషనర్‌గా కొనసాగుతున్న అబ్దుల్ బాసిత్ కూడా ఈ అంశంపై స్పందించారు. ‘‘ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం మంచిది కాదు. ఎన్నికలతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకొచ్చేమో. అన్ని పార్టీలు కూడా అదే డిమాండ్ చేస్తున్నాయి’’అని ఆయన అన్నారు.
మరోవైపు జియో న్యూస్ జర్నలిస్టు ముర్తాజా అలీ షా కూడా స్పందిస్తూ ‘‘పాకిస్తాన్ డిప్యూటీ అటార్నీ జనరల్ రాజా ఖలీద్ రాజీనామా చేశారు. ఇమ్రాన్ ఖాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ చట్ట, రాజ్యాంగ వ్యతిరేక పరిణామాలే’’అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
‘‘నేషనల్ అసెంబ్లీ రద్దు తర్వాత సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తమ నివాసానికి సమావేశం కోసం రమ్మని పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఆహ్వానించారు’’అని షా చెప్పారు.
జిన్నాపై పుస్తకం రాసిన యాసిర్ లతీఫ్ హమ్దానీ స్పందిస్తూ.. ‘‘ఇది రాజ్యంగంపై తిరుగుబాటు లాంటిది. ముషారఫ్ ఒక సైనిక నియంత. ఇమ్రాన్ ఖాన్ ఒక పౌర నియంత’’అని వ్యాఖ్యానించారు.
‘‘పాకిస్తాన్ ఒక అణ్వాయుధ దేశం. అయితే, పార్లమెంటును రద్దు చేయడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని స్తంభింపచేశారు. ఇప్పుడు కేంద్రంలో కార్యనిర్వాహక వర్గం లేదు. క్యాబినెట్ లేదు. దేశం మొత్తాన్నీ ఆయన హైజాక్ చేశారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
కొందరు మద్దతు పలుకుతున్నారు..
పాకిస్తానీ మీడియా దిగ్గజం ముర్తాజా సోలంగి కూడా స్పందిస్తూ.. ‘‘ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించేందుకు అవసరమైన సంఖ్యా బలం విపక్షాల దగ్గర ఉంది. కానీ ఈ పాకిస్తానీ ట్రంప్.. ట్రంప్ కార్డు రాజకీయాలు చేశారు. దేశాన్ని మోసం చేశారు. ఈయనే అసలైన మోసగాడు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
అయితే, కొందరు ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు పలుకుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వఖర్ యూనిస్ స్పందిస్తూ.. ‘‘కెప్టెన్.. మిమ్మల్ని చూస్తుంటే మాకు గర్వంగా ఉంది. మంచి నిర్ణయం తీసుకున్నారు’’అని వ్యాఖ్యానించారు.
ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ యుద్ధం: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయలుదేరారు... దారిలోనే రష్యా సైనికుల కాల్పుల్లో చనిపోయారు
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
- ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
- సూర్య కాశీభట్ల: నిజజీవితంలోనూ సెరెబ్రల్ పాల్సీ ఉన్న ఈ మహేశ్‌బాబు ఫ్యాన్‌కు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)