టీ20 ప్రపంచకప్ ఫైనల్ NZ vs AUS: న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లలో ఎవరిది పైచేయి...

న్యూజీలాండ్, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, ICC TWITTER

ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఆదివారం న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో విజేత ఎవరో తేలనుంది.

ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. ఇప్పటివరకు 44 మ్యాచ్‌లు జరిగాయి. కాగా అన్నింటి కన్నా మెరుగ్గా ఆడిన న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరాయి.

ఫైనల్‌కు చేరిన ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా వారికి ఇదే తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ అవుతుంది.

న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఇంతవరకు టీ20 వరల్డ్ కప్‌ను గెలవలేదు.

న్యూజీలాండ్ తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టగా, 2010 సీజన్‌లో ఆస్ట్రేలియా రన్నరప్‌గా నిలిచింది.

కాబట్టి ఆదివారం కొత్త విజేతను మనం చూడబోతున్నాం.

ఎవరెలా ఫైనల్ చేరారంటే...

ఆస్ట్రేలియా

లీగ్ దశ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. సఫారీలు 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 121 పరుగులు చేసి శుభారంభం చేసింది.

రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్లకు 154 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 3 వికెట్లకు 155 పరుగులు చేసింది.

వార్నర్

ఫొటో సోర్స్, ALEX DAVIDSON/GETTY IMAGES

మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మొదట ఆసీస్ 125 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో కంగారూలు నెగ్గారు. బంగ్లాదేశ్‌ను 73 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్, తర్వాత 6.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది.

ఐదో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

సెమీఫైనల్ మ్యాచ్‌లో గ్రూప్-2లో టాపర్‌గా నిలిచిన పాకిస్తాన్‌ను 5 వికెట్లతో ఓడించింది. పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

న్యూజీలాండ్

కివీస్ ఓటమితో ప్రపంచకప్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మొదటి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో 5 వికెట్లతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేయగా, పాకిస్తాన్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

రెండో మ్యాచ్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. భారత్ ఈ మ్యాచ్‌లో 110 పరుగులే చేయగా, కివీస్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.

మూడో మ్యాచ్‌లో 16 పరుగులతో స్కాట్లాండ్‌ను ఓడించింది. తొలుత న్యూజీలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.

నాలుగో మ్యాచ్‌లో 52 పరుగులతో నమీబియాను చిత్తు చేసింది. మొదట న్యూజీలాండ్ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులే చేసి ఓటమి పాలైంది.

న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఐదో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట అఫ్గాన్ 124 పరుగులు చేయగా, కివీస్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

సెమీఫైనల్ మ్యాచ్‌లో గ్రూప్-1 టాపర్ ఇంగ్లండ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. తర్వాత కివీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

సెమీఫైనల్లో ఈ రెండు జట్లు కూడా గ్రూపుల్లో టాపర్‌గా నిలిచిన జట్లను ఓడించాయి. రెండు జట్లు 19వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజీలాండ్

క్రిక్ ఇన్ఫో సమాచారం ప్రకారం, ఈ రెండు జట్లు టీ20ల్లో 14 సార్లు తలపడగా న్యూజిలాండ్ 4 సార్లు గెలుపొంది 9 సార్లు పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ టై అయింది.

2005 ఫిబ్రవరి 17న జరిగిన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరిగింది. అందులో ఆస్ట్రేలియా 44 పరుగుల తేడాతో కివీస్‌పై నెగ్గింది.

టీ20 ప్రపంచకప్‌ విషయానికి వస్తే న్యూజీలాండ్‌ది పైచేయిగా ఉంది. వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు ఒకేసారి తలపడ్డాయి. 2016లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేయగలిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

2015 వన్డే ప్రపంచకప్ టైటిల్‌పోరులో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పుడు ఆస్ట్రేలియా విజేతగా నిలిచి టైటిల్‌ను అందుకుంది.

ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ 45 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. గ్రాంట్ ఇల్లియట్ (83) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాస్ టేలర్ (40) రాణించాడు.

ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి విజేతగా నిలిచింది. డేవిడ్ వార్నర్ (45), స్టీవ్ స్మిత్ (56 నాటౌట్), మైకేల్ క్లార్క్ (74) ఆకట్టుకున్నారు.

ఐసీసీ టోర్నీల్లో అదరగొడుతోన్న న్యూజీలాండ్

ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నీల్లో న్యూజీలాండ్ చెలరేగి ఆడుతోంది. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన కివీస్, 2019లోనూ దురదృష్టవశాత్తు టైటిల్‌ను అందుకోలేకపోయింది.

ఫైనల్ మ్యాచ్‌లో స్కోర్లు (241) టై కాగా, తర్వాత నిర్వహించిన సూపర్ ఓవర్ (15 పరుగులు) కూడా టై అయింది. దీంతో బౌండరీల కౌంట్ ఆధారంగా విజేతను నిర్ణయించారు. ఫలితంగా 2019 వన్డే ప్రపంచకప్ ఇంగ్లండ్ ఖాతాలో చేరింది.

తాజాగా ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో కివీస్ సత్తా చాటింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌పై 8 వికెట్లతో గెలుపొంది ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను అందుకుంది. ఇప్పుడు అదే జోరుతో టీ20 ప్రపంచకప్‌ను అందుకునేందుకు సిద్ధమైంది.

బలాబలాలు

ఈ టోర్నీ ఆసాంతం న్యూజీలాండ్ క్రమశిక్షణగా ఆడుతోంది. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఓటమి తర్వాత పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తూ ఫైనల్‌కు వచ్చింది.

న్యూజీలాండ్ బౌలింగ్ దళం అద్భుతంగా రాణిస్తోంది. బౌలింగ్ పరంగా ఈ టోర్నీలో కివీస్‌ను మెరుగైన జట్టుగా భావించవచ్చు. అందుబాటులో ఉన్న బౌలర్లను వాడుకుంటూ కెప్టెన్ కేన్ విలియమ్సన్ విజయాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ కీలక సమయంలో వికెట్లు తీస్తున్నారు.

బ్యాటింగ్‌లోనూ సమష్టిగా రాణిస్తున్నారు. విజయం కోసం ఏ ఒక్కరి బ్యాటింగ్‌పైనో ఆధారపడే పరిస్థితి లేదు. పరిస్థితులకు అనుగుణంగా, కీలక సమయంలో తలా ఒక్కరు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ముఖ్యంగా డెత్ ఓవర్ల నుంచి మంచి ప్రయోజనం పొందుతున్నారు.

సెమీస్‌లో గప్టిల్, విలియమ్సన్ విఫలం కాగా డరైల్ మిచెల్, డేవాన్ కాన్వే, జేమ్స్ నీషమ్ అదరగొట్టారు.

అంతకుముందు మ్యాచ్‌ల్లో విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, మార్టిన్ గప్టిల్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.

మరీ ముఖ్యంగా డరైల్ మిచెల్ వారికి స్టార్ పెర్ఫార్మర్‌గా మారాడు. 'పవర్‌ ప్లే' పరిస్థితులను చక్కగా వినియోగించుకుంటూ ఆడే అతను కివీస్‌కు మంచి స్కోరును అందిస్తున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో 49 పరుగులు చేసిన అతను సెమీస్‌లో 47 బంతుల్లోనే 72 పరుగులతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 197 పరుగులు చేసిన మిచెల్ కివీస్ జట్టులో టాప్ స్కోరర్. ఇదే ఆత్మవిశ్వాసంతో అతను ఫైనల్లోనూ ఆడే అవకాశాలున్నాయి.

వార్నర్ కీలకం

మరోవైపు ఆస్ట్రేలియా బ్యాటింగ్ బారాన్ని టాపార్డర్ మోస్తోంది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ఆ జట్టుకు కీలకంగా మారాడు. సెమీస్‌లో 49 పరుగులు చేసిన అతను, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 89 (నాటౌట్) పరుగులతో అదరగొట్టాడు.

ఒంటి చేత్తో విజయాలు అందించగల సమర్థుడు వార్నర్. ఇప్పటివరకు 47.20 సగటుతో మొత్తం 236 పరుగులు చేసిన అతను అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో రెండు అర్ధసెంచరీలు సాధించాడు. వార్నర్ పాటు కెప్టెన్ ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్‌లపైనే బ్యాటింగ్ బారం ఉంది. గత రెండు మ్యాచ్‌లతో ఈ ముగ్గురు ఫామ్‌లోకి వచ్చారు. వేడ్‌పై కూడా అందరి దృష్టి ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

మిడిలార్డర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్ వావ్ అనిపించే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఇంకా ఈ టోర్నీలో ఆడలేదు. మార్కస్ స్టొయినిస్ సెమీఫైనల్‌లో జట్టు విజయంలో సహాయ పాత్ర పోషించాడు. ఫైనల్లో వీరిలో ఏ ఒక్కరు వారి స్థాయికి తగ్గట్లు ఆడినా భారీ స్కోరు ఖాయం.

స్పిన్నర్ ఆడమ్ జంపా 12 వికెట్లతో టోర్నీలో రెండో అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజెల్‌వుడ్ కూడా రాణిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

రిజర్వ్ డే

ఈ ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే' అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా అవాంతరాలు వచ్చి షెడ్యూల్ ప్రకారం ఆదివారం మ్యాచ్ పూర్తి చేయలేని పక్షంలో, సోమవారం కూడా మ్యాచ్‌ను కొనసాగిస్తారు.

ఒకవేళ మ్యాచ్ టై అయిన పక్షంలో సూపర్ ఓవర్‌ను ఆడిస్తారు. సూపర్ ఓవర్ కూడా సమమైతే, విజేత తేలేవరకు సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)