టీ20 వరల్డ్ కప్ PAKvsAUS: వరుసగా మూడు సిక్స్‌లు కొట్టిన మాథ్యూ వేడ్.. పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Alex Davidson/GETTY IMAGES
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ వరుస విజయాలకు తెరపడింది. సెమీస్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాక్‌కు ఆస్ట్రేలియా షాకిచ్చింది.
177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట తడబడ్డా.. చివర్లో మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ చెలరేగిపోవడంతో ఇంకా 6 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆస్ట్రేలియా ఈ విజయంతో నవంబర్ 14న జరిగే ఫైనల్లో న్యూజీలాండ్‌ను ఢీకొంటుంది.
చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ 19వ ఓవర్లో పూర్తిగా ఆస్ట్రేలియా చేతిలోకి వచ్చేసింది.
షహీన్ అఫ్రిదీ వేసిన ఆ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా ఫైనల్ చేరడానికి దారులు వేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
18 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 155 పరుగుల స్కోరుతో ఉన్న ఆస్ట్రేలియా 19వ ఓవర్లో విజయానికి అవసరమైన 22 పరుగులు పిండుకుంది.
మాథ్యూ వేడ్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41, మార్కస్ స్టోయినిస్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
టీ20 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో సెమీస్ వరకూ వచ్చిన పాకిస్తాన్ ఓటమి స్టేడియంలో ఉన్న అభిమానులకు షాక్ ఇచ్చింది.
చివరి వరకూ విజయంపై ధీమాగా ఉన్న అభిమానులు 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లతో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో షాక్ అయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ షాబాద్ ఖాన్ టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసినా ఆస్ట్రేలియా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
1 పరుగుకే తొలి వికెట్
బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 89 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో 1 పరుగుకే కెప్టెన్ ఆరాన్ ఫించ్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది.
ఓపెనింగ్ దిగిన కెప్టెన్ ఆరాన్ ఫించ్ షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు.
తర్వాత వేగంగా ఆడిన డేవిడ్ వార్నర్, మెచెల్ మార్ష్ స్కోరును 50 పరుగుల మార్కు దాటించారు.
ఆస్ట్రేలియా 52 పరుగుల దగ్గర రెండో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్(28) షాదాబ్ ఖాన్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
77 పరుగుల దగ్గర స్టీవ్ స్మిత్ వికెట్ పడింది. 5 పరుగులు చేసిన స్మిత్ కూడా షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఫకర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మరోవైపు ధాటిగా ఆడుతూ స్కోరు పెంచిన డేవిడ్ వార్నర్ 89 పరుగుల దగ్గర షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసిన వార్నర్ కీపర్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
13వ ఓవర్లో గ్లెన్ మాక్స్‌వెల్(7) కూడా అవుటవడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడిపోయింది. ఇది షాదాబ్ ఖాన్ నాలుగో వికెట్.
కానీ, తర్వాత మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ మరో వికెట్ పడకుండా జట్టుకు విజయం అందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
అడపాదడపా షాట్లు కొడుతూ వచ్చిన ఇద్దరూ 16వ ఓవర్ తర్వాత జోరు పెంచారు. 17వ ఓవర్లో స్టోయినిస్ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టగా, 18వ ఓవర్లో మాథ్యూ వేడ్ కూడా ఒక ఫోర్, సిక్స్ బాదాడు.
18వ ఓవర్లో ఇద్దరి 50 పరుగుల భాగస్వామ్యంతోపాటూ జట్టు 150 మైలురాయి కూడా దాటింది. దీంతో విజయానికి ఆసీస్‌కు చివరి 12 బంతుల్లో 24 పరుగులు అవసరం అయ్యాయి.
షాహీన్ అఫ్రిదీ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ పట్టలేకపోవడంతో పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
అదే ఓవర్ చివరి మూడు బంతులను మాథ్యూ వేడ్ బౌండరీ అవతలకు తరలించడంతో పాకిస్తాన్ ఫైనల్ ఆశలకు తెరపడింది.
ఆసీస్‌కు విజయం అందించిన మాథ్యూ వేడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా, షాహీన్ అఫ్రిదీ ఒక వికెట్ తీశాడు.

ఫొటో సోర్స్, Reuters
రిజ్వాన్, ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీలు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజం, మొహమ్మద్ రిజ్వాన్ మొదటి నుంచీ దూకుడుగా ఆడారు.
వ్యక్తిగత స్కోరు జీరో ఉన్నప్పుడు మహమ్మద్ రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను డేవిడ్ వార్నర్ వదిలేశాడు.
ఆరో ఓవర్లో మొహమ్మద్‌కు మరో లైఫ్ వచ్చింది. పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అతడు కొట్టిన షాట్ ఆడం జంపా చేతుల్లో పడి జారిపోయింది.
ఆరు ఓవర్లు ముగిసేసరికి పాక్ 47 పరుగులు చేసింది.. ఏడో ఓవర్లో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు పూర్తి చేసింది..
మిచెల్ మార్ష్ వేసిన 8వ ఓవర్లో బాబర్ ఆజం టీ20ల్లో 2500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
10 ఓవర్లో 71 పరుగుల దగ్గర పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
34 బంతుల్లో 39 పరుగులు చేసిన ఓపెనర్, కెప్టెన్ బాబర్ ఆజం.. ఆడం జంపా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.
తర్వాత మొహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్ ధాటిగా ఆడారు. 16వ ఓవర్లో 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
14వ ఓవర్లో మహమ్మద్ రిజ్వాన్ సిక్స్‌తో పాకిస్తాన్ 100 పరుగులు పూర్తయ్యాయి. ఆ తర్వాత బంతికే రిజ్వాన్ తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.
జట్టు స్కోర్ 158 పరుగుల దగ్గర పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ వికెట్ కూడా కోల్పోయింది.
52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసిన రిజ్వాన్ స్కోర్ పెంచే ప్రయత్నంలో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ వికెట్ మిచెల్ స్టార్క్‌కు దక్కింది.
రిజ్వాన్ అవుట్ అవడంతో స్కోరు పెంచే బాధ్యత తీసుకున్న ఫకర్ జమాన్ దూకుడుగా ఆడాడు.
19వ ఓవర్ మొదటి బంతికి ఆసిఫ్ అలీ, 20 వ రెండో బంతికి షోయబ్ మలిక్(1) అవుట్ అయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
చివరి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫకర్ జమాన్ 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
జమాన్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్‌కు 2, పాట్ కమిన్స్, ఆడం జంపా చెరో వికెట్ పడగొట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లూ మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
మొదట బ్యాటింగ్‌కు దిగుతున్న తాము వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని అకుంటున్నట్టు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పాడు. టాలెంట్ ఉన్న జట్టును లీడ్ చేయడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. తన జట్టు యూఏఈలో చాలా మ్యాచ్‌లు ఆడిందని, ఆ అనుభవాన్ని మ్యాచ్‌లో ఉపయోగించుకోడానికి ప్రయత్నిస్తామని అన్నారు. గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపాడు.
దుబయి వికెట్ బాగుందని, అది పెద్దగా మారదని అనిపిస్తోందని ఆసీస్ కెప్టెన్ ఆరాన్ ఫించ్ చెప్పాడు. బరిలోకి దిగగానే ఒత్తిడి ఉంటుందని, కానీ దానికి తాము సిద్ధంగానే ఉన్నామని అన్నాడు. పవర్ ప్లే ఓవర్లు రెండు జట్లకూ కీలకం కాబోతున్నాయన్న ఫించ్ తాము కూడా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతున్నామన్నాడు.

ఫొటో సోర్స్, Michael Steele-ICC/GETTY IMAGES
మ్యాచ్ ఫేవరెట్ పాకిస్తాన్
ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఒక్క ఓటమి కూడా రుచిచూడని పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఫేవరెట్‌గా నిలిచింది.
మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగినా సెమీ ఫైనల్ చేరడానికే నానా తంటాలూ పడిన ఆస్ట్రేలియా బలమైన పాకిస్తాన్ జట్టును ఎదుర్కోబోతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 13
గ్రూప్ 1లో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌తో ఓడిపోవడంతోపాటూ, దక్షిణాఫ్రికాపై విజయానికి చివరి ఓవర్ వరకూ పోరాడాల్సి వచ్చింది.
చివరికి రన్ రేట్ పుణ్యమా అని సెమీ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై విజయం సాధించి తొలి టీ20 వరల్డ్ కప్ సాధించాలని కలలు కంటోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 14
జట్టులో కీలకమైన కొంతమంది ప్లేయర్లు సమయానికి ఫాంలోకి రావడంతో ఆ జట్టు విజయంపై ధీమాగా ఉంది.
ఇప్పటివరకూ బాగానే ఆడిన కంగారూలు ఇప్పుడు ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకుని అది ఈ మ్యాచ్‌లో ఎలా విజయం సొంతం చేసుకుంటుంది అనేదే మిగిలింది.
సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించడం వాళ్లకు అంత సులువుగా అయ్యేది కాదు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ అపజయం ఎరుగని పాకిస్తాన్ జట్టు ఇప్పుడు ఏకంగా టైటిల్ ఫేవరెట్‌గా ఆవిర్భవించింది.
చెప్పాలంటే, పాకిస్తాన్ నిలకడగా ఆడడంలో అందరి అంచనాలను మించిపోయింది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అన్ని జట్ల కంటే అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తోంది.
కెప్టెన్ బాబర్ ఆజం నేతృత్వంలో పాకిస్తాన్ జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకూ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలే దానికి కారణం.
నిలకడగా ఆడే ఓపెనర్లు, అనుభవజ్ఞులైన మిడిలార్డర్, క్వాలిటీ స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో జట్టు సమతూకంగా ఉంది.
జట్టులోని ఆటగాళ్లందరూ ఇప్పటికే సత్తా చాటడంతో పాకిస్తాన్ మరోసారి తమ ప్లేయింగ్ లెవన్‌తోనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC/GETTY IMAGES
ఇప్పటివరకు ఎన్ని
ఇప్పటివరకు జరిగిన ఆరు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ ఆరు మ్యాచుల్లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా మూడుసార్లు, పాకిస్తాన్ మూడుసార్లు గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి.
పాకిస్తాన్ మీద ఆస్ట్రేలియా అత్యధిక స్కోరు 197 కాగా, పాకిస్తాన్ ఆస్ట్రేలియా మీద చేసిన అత్యధిక స్కోరు 191.
2007లో గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2010లో వెస్టిండీస్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అదే టోర్నీలో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తర్వాత 2012 సూపర్ 8లో, 2014లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పాక్ ఆస్ట్రేలియా మీద వరుసగా 32, 12 పరుగుల తేడాతో గెలిచింది.
2016లో జరిగిన గత టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ మీద 21 పరుగుల తేడాతో గెలిచింది.
చెరి 3 మ్యాచుల విజయంతో సమానంగా ఉన్న రెండు జట్లు ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో చోటు సంపాదించాలని చూస్తున్నాయి.

ఫొటో సోర్స్, FRANCOIS NEL
పాకిస్తాన్‌దే పైచేయి
ఈ రెండు జట్ల మధ్య జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయానికి వస్తే పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది.
రెండూ మొత్తం 23 టీ20 మ్యాచుల్లో తలపడగా.. పాకిస్తాన్ 13 మ్యాచుల్లో, ఆస్ట్రేలియా 9 మ్యాచుల్లో విజయం సాధించింది.
ఐదుసార్లు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అందని కలగా ఉన్న టీ20 వరల్డ్ కప్ గెలవడానికి ఇది ఒక మంచి అవకాశం. కానీ బలమైన పాకిస్తాన్ ఇప్పుడు ఆ జట్టుకు అడ్డుగా నిలుస్తోంది.

ఫొటో సోర్స్, FRANCOIS NEL
పాక్ గెలుస్తుందన్న లారా
బ్రయాన్ లారా లాంటి క్రికెట్ దిగ్గజాలు ఇప్పుడు ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 15
"ఆస్ట్రేలియా చాలా ప్రమాదకరమైన టీమ్. వాళ్లకు ఎవరినైనా ఓడించగలిగే స్ట్రాంగ్ లైనప్ ఉంది. కానీ వాళ్లను అడ్డుకోడానికి, ఫైనల్ చేరడానికి పాకిస్తాన్ దగ్గర బలమైన బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలు ఉన్నాయి" అన్నారు.
లారా బుధవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు కూడా ఇంగ్లండ్ మీద న్యూజీలాండ్ గెలుస్తుందని ఊహించారు. చివరికి అదే జరిగింది.
మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా కూడా ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 16
పాకిస్తాన్ గెలుస్తుందని తాను ఆశిస్తున్నానని, దీనికి ఫ్యాన్స్ మద్దతు చాలా కీలకమని ఆయన అన్నారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ పాకిస్తాన్‌కు బ్యాటింగ్ కోచ్‌గా ఉండడం కూడా ఆ జట్టుకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు.
పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగే సెమీ ఫైనల్లో గెలిచిన జట్టు ఆదివారం (నవంబర్ 14) జరిగే ఫైనల్లో న్యూజీలాండ్‌ను ఢీకొంటుంది.
ఇవి కూడా చదవండి:
- సవ్యసాచి: ‘ఇది కండోమ్ ప్రకటనా? నగల ప్రకటనా?’- ఈ బ్రాండ్‌ను ఎందుకు నిషేధించమంటున్నారు
- వాట్సాప్ స్కాములతో జాగ్రత్త
- ‘పాతాళానికి ద్వారాలు’.. భారతదేశంలో మెట్ల బావులు
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పళ్లు ఎంతసేపు తోముకోవాలి? రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సముద్రం మింగేస్తుందా
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)