టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన న్యూజీలాండ్, ఇంగ్లండ్‌పై 5 వికెట్లతో గెలుపు

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో న్యూజీలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ ఆరంభంలోనే 13 పరుగులకు 2 కీలక వికెట్లు కోల్పోవడం, 60 బంతుల్లో 109 పరుగులు చేయాల్సి ఉండటం, 16వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ వికెట్ తీయడంతో పాటు కేవలం 3 పరుగులే ఇవ్వడంతో ఏ దశలో చూసిన న్యూజీలాండ్ మ్యాచ్‌లో వెనుకబడినట్లే కనిపించింది.
కానీ చివర్లో డరైల్ మిచెల్‌తో పాటు, జేమ్స్ నీషమ్ మెరుపులతో పుంజుకున్న న్యూజీలాండ్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకొని ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది.
మొయిన్ అలీ (37 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా, డేవిడ్ మలాన్ (30 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు.
కివీస్ బౌలర్లలో టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ఇశ్ సోధి, జేమ్స్ నీషన్ తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని న్యూజీలాండ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్ డరైల్ మిచెల్ (47 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో జట్టును గెలిపించాడు.
డెవాన్ కాన్వే (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్), జేమ్స్ నీషమ్ (11 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు.
క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్ చెరో 2 వికెట్లు తీయగా... ఆదిల్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆరంభంలో మెల్లగా....
టీ20ల్లో న్యూజీలాండ్‌పై ఇంగ్లండ్ ఎనిమిదిసార్లు మొదట బ్యాటింగ్ చేసింది. అందులో ఆరుసార్లు గెలుపొందింది. కేవలం ఒకసారి మాత్రమే ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
టాస్ ఓడిన ఇంగ్లండ్ ఇదే ఆశావహ దృక్పథంతో బరిలోకి దిగింది.
గాయపడిన జేసన్ రాయ్ స్థానంలో స్యామ్ బిల్లింగ్స్ జట్టులోకి రాగా, బట్లర్‌తో కలిసి జానీ బెయిర్‌స్టో ఓపెనింగ్‌కు దిగాడు.
వీరిద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో సౌతీ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు.
తర్వాతి ఓవర్‌లో బట్లర్ రెండు వరుస ఫోర్లతో ఆకట్టుకోవడంతో 16 పరుగులు లభించాయి.
తర్వాత ఓ బౌండరీతో బెయిర్ స్టో కూడా టచ్‌లోకి వచ్చాడు. కానీ ఆరో ఓవర్ తొలి బంతికే మిల్నే బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి బెయిర్ స్టో (13) అవుటయ్యాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
దీంతో పవర్ ప్లేలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.
తర్వాత కాసేటికే ఇశ్ సోధి బౌలింగ్‌లో జోస్ బట్లర్ (24 బంతుల్లో 29; 4 ఫోర్లు) ఎల్బీగా వెనుదిరిగాడు. దీనిపై ఇంగ్లండ్ రివ్యూకి వెళ్లినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు.
ఆదుకున్న భాగస్వామ్యం
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మొయిన్ అలీ తోడుగా డేవిడ్ మలాన్ ఇన్నింగ్స్ నడిపించాడు.
ఇశ్ సోధీ, నీషమ్ బౌలింగ్‌లో ఒక్కో ఫోర్ బాదిన మలాన్... 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
ఆ తర్వాత ఫిలిప్స్ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో మలాన్ చెలరేగాడు.
12 నుంచి 15 ఓవర్ల మధ్య కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్ సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసింది. ఈ ఓవర్లలో కేవలం 2 బౌండరీలు మాత్రమే వచ్చాయి.
ఇక 16వ తొలి బంతికి స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదిన మలాన్ తర్వాతి బంతికే అవుటయ్యాడు.
దీంతో మూడో వికెట్‌కు 43 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
తర్వాత సోధి, మిల్నే వరుస ఓవర్లలో మొయిన్ అలీ ఒక్కో సిక్సర్ బాదగా... లివింగ్ స్టోన్ కూడా మరో సిక్సర్‌తో అలరించాడు. దీంతో 18వ ఓవర్లో 16 పరుగులు లభించాయి.
19వ ఓవర్‌లో ఒకే బౌండరీ ఇచ్చిన బౌల్ట్ ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
చివరి ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ (10 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) అవుటయ్యాడు. అదే ఓవర్‌లో బౌండరీ బాదిన మొయిన్ అలీ 36 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు.
ఆ తర్వాత మోర్గాన్ (4 నాటౌట్) సింగిల్స్, డబుల్స్‌కే పరిమితం కావడంతో ఆ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
13 పరుగులకే 2 వికెట్లు
167 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజీలాండ్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది.
ఇన్నింగ్స్ మూడో బంతికే మార్టిన్ గప్టిల్ (4) అవుట్ కాగా, మూడో ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) పెవిలియన్ చేరాడు.
వోక్స్ బౌలింగ్‌లో రషీద్‌కు క్యాచ్ ఇచ్చి విలియమ్సన్ అవుటయ్యాడు.
మరో ఓపెనర్ డరైల్ మిచెల్ ఆచితూచి ఆడగా, డెవాన్ కాన్వే దూకుడు కనబరిచాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
పవర్ ప్లే చివరి ఓవర్‌లో కాన్వే 2 బౌండరీలు బాదాడు. దీంతో 6 ఓవర్లకు జట్టు స్కోరు 36/2గా నిలిచింది.
తర్వాత వీరిద్దరూ సింగిల్స్‌కే ప్రాధాన్యమిచ్చారు. పదో ఓవర్ ఐదో బంతికి కాన్వే ఒక బౌండరీ బాదాడు.
ఈ దశలో గేమ్ ప్లాన్ మార్చిన వీరిద్దరూ ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ ఉండేలా జాగ్రత్త పడ్డారు.
11వ ఓవర్ తొలి బంతికి మిచెల్ ఫోర్ బాదగా, నాలుగో బంతికి కాన్వే సిక్సర్‌తో అలరించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
ఆ తర్వాతి ఓవర్‌లో కాన్వే బౌండరీ కొట్టాడు. 13వ ఓవర్‌లో మిచెల్ లాంగాఫ్‌లో సిక్సర్ బాదాడు.
ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని కాన్వేను అవుట్ చేయడం ద్వారా లివింగ్ స్టోన్ విడదీశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 67 బంతుల్లో 82 పరుగుల్ని జోడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
విజయ లక్ష్యం 30 బంతుల్లో 60 పరుగులు
15ఓవర్లకు న్యూజీలాండ్ 107/3తో నిలిచింది. ఈ దశలో విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి ఉంది.
అయితే 16వ ఓవర్ బౌలింగ్ చేసిన లివింగ్ స్టోన్ కేవలం మూడే పరుగులిచ్చి గ్లెన్ ఫిలిప్స్ (2)ను అవుట్ చేశాడు. దీంతో రన్‌రేట్ 12 పరుగుల నుంచి 14.25 పరుగులకు పెరిగిపోయింది.
జోర్డాన్ వేసిన 17వ ఓవర్ మళ్లీ న్యూజీలాండ్ మ్యాచ్‌పై పట్టు సాధించేలా చేసింది. ఈ ఓవర్‌లో 2 వైడ్లతో కలిపి అతను మొత్తం 8 బంతులు వేశాడు.
ఇదే అదనుగా నీషమ్ చెలరేగిపోయాడు. తొలి బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదిన అతను, మూడో బంతికి ఫోర్, నాలుగో బంతికి మరో సిక్సర్‌తో 23 పరుగులు పిండుకున్నాడు.
తర్వాతి ఓవర్‌లో నీషమ్ ఒక సిక్సర్ బాదగా, మిచెల్ కూడా లాంగాన్‌లో సిక్సర్‌తో అర్ధసెంచరీని అందుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
అతను 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.
కానీ ఈ ఓవర్ చివరి బంతికి మోర్గాన్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో నీషమ్ అవుటయ్యాడు. జట్టు విజయ లక్ష్యం 12 బంతుల్లో 20 పరుగులుగా మారింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
అయితే ఏమాత్రం తడబడకుండా మరో ఓవర్ మిగిలి ఉండగానే మిచెల్ జట్టుకు విజయాన్ని అందించాడు.
19వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన వోక్స్‌ను మిచెల్ ఆడుకున్నాడు.
తొలి బంతికి 2 పరుగులు రాగా, రెండో బంతిని మిచెల్ లాంగాన్‌లో సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి బంతికే మిడ్ వికెట్ మీదుగా మరో సిక్సర్ కొట్టాడు. తర్వాతి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ రాగా, చివరి బంతికి బౌండరీ బాదిన మిచెల్ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
ఇవి కూడా చదవండి:
- టీ20 వరల్డ్‌కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- పర్యావరణాన్ని బాగు చేసే చిట్కాలు చెబుతున్న బామ్మలు
- ప్రశాంత్ పంచాడ ఎవరు? అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ఎందుకు ట్వీట్ చేశాడు
- భారత్- పాకిస్తాన్ క్రికెటర్లు ఆవేశంతో రెచ్చిపోయిన అయిదు సందర్భాలివే...
- టీ20 వరల్డ్ కప్ చరిత్రలో హ్యాట్రిక్ హీరోలెవరు? వారు మ్యాచ్‌లను ఎలా మలుపు తిప్పారు?
- అడవిలో ఒంటరిగా 40 ఏళ్లు జీవించిన ఆ వ్యక్తి గురించి బాహ్య ప్రపంచానికి ఎలా తెలిసింది?
- మహ్మద్ ఇక్బాల్: 'సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా' అన్న కవి... 'ముస్లిం హై హమ్... వతన్ హై సారా జహా హమారా' అని ఎందుకన్నారు?
- టీ20 వరల్డ్ కప్: అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్ ఆసిఫ్ బ్యాట్‌ను తుపాకీలా ఎందుకు పట్టుకున్నాడు? దానితో ధోనీకి సంబంధం ఏంటి?
- ‘పాక్‌తో మ్యాచ్‌లో బుమ్రా, భువనేశ్వర్ కూడా రాణించలేదు.. మరి షమీనే ఎందుకు టార్గెట్ చేశారు?’
- టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలుపు ఇస్లాం విజయం ఎలా అవుతుంది?
- భారత్-పాకిస్తాన్: మరపురాని అయిదు ప్రపంచ కప్ మ్యాచ్‌లు
- టీ20 వరల్డ్ కప్: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)