టీ20 వరల్డ్ కప్ AFG vs NZ: అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ఎందుకు ట్వీట్ చేశాడు? ప్రశాంత్ పంచాడ ఎవరు?

రషీద్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఈరోజు జరగబోతున్న అఫ్గానిస్తాన్-న్యూజీలాండ్ మ్యాచ్ ఫలితం భారత సెమీస్ అవకాశాలకు కీలకంగా నిలిచింది.

ఈరోజు న్యూజీలాండ్‌పై అఫ్గానిస్తాన్ గెలిస్తే, నమీబియాతో ఆడే మ్యాచ్‌లో మెరుగైన రన్ రేట్‌తో భారత్ విజయం సాధిస్తే టీమిండియా సెమీ ఫైనల్లో అడుగు పెడుతుంది.

దీంతో ఇప్పుడు క్రికెట్ ప్రపంచం కళన్నీ అఫ్గానిస్తాన్-న్యూజీలాండ్ మ్యాచ్‌ మీదే ఉన్నాయి.

సరిగ్గా ఇదే సమయంలో రషీద్ ఖాన్ తెలుగు మాట ఉపయోగించి చేసిన ఒక ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది.

కానీ, రషీద్ ఖాన్ ఈ ట్వీట్‌ను నవంబర్ 4న అంటే భారత్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ గురించి అశ్విన్ చేసిన కామెంట్‌కు రిప్లైగా పెట్టాడు.

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన కామెంట్‌ను ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"మ్యాచ్‌ సరదాగా జరిగింది. అఫ్గానిస్తాన్ చాలా బాగా ఆడింది. ఆ జట్టుపై మేం చాలా ఆశలు పెట్టుకున్నాం. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అఫ్గానిస్తాన్‌కు ఆల్ ది బెస్ట్. ముజీబ్ బరిలోకి దిగేలా అఫ్గానిస్తాన్‌కు భారత ఫిజియో సపోర్ట్ అందిస్తే బావుంటుంది. మనం అది మాత్రమే ఆశించగలం" అన్నాడు.

దీనికి సమాధానంగా అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అశ్విన్ భాయ్.. డోంట్ వర్రీ.. అవర్ టీమ్ ఫిజియో ప్రశాంత్ పంచాడ 'చూసుకుంటున్నారు' అని ట్వీట్ చేశారు.

ట్వీట్ అంతా ఇంగ్లిష్‌లో రాసిన రషీద్ 'చూసుకుంటున్నారు' అని పెట్టడం తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

స్కాట్లాండ్‌-అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 3 వికెట్లు సహా మొత్తం ఐదు వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ ముజీబుర్ రహమాన్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.

తర్వాత నమీబియా, భారత్‌తో జరిగిన మ్యాచుల్లో ముజీబుర్ గాయం కారణంగా ఆడలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

కానీ, నవంబర్ 6న ఒక ట్వీట్ చేసిన ముజీబుర్ రహమాన్ మళ్లీ జిమ్‌లో ఉన్నానని, హాపీ మూడ్‌తో ఉన్నానని తను కసరత్తులు చేస్తున్న ఓక ట్వీట్ చేశాడు.

ఇప్పుడు న్యూజీలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముజీబుర్ చాలా కీలకం అని క్రీడా పండితులు అభిప్రాయ పడుతున్నారు.

అదే ఉద్దేశంతో అశ్విన్ కామెంట్ చేశాడు. ముజీబ్‌ ఫిట్‌నెస్‌ గురించి ప్రస్తావించాడు. అతడికి తమ ఫిజియో సాయం అందిస్తే బాగుంటుందని అన్నాడు.

కానీ, అశ్విన్ కామెంట్‌కు బదులిచ్చిన రషీద్ ఖాన్ హైదరాబాద్‌కు చెందిన తమ ఫిజియో ప్రశాంత్ పంచాడ తమను బాగా 'చూసుకుంటున్నార'ని సమాధానం ఇచ్చాడు.

తమ ఫిజియో తెలుగు వాడని చెప్పడంతోపాటూ, దక్షిణాది ఆటగాడైన అశ్విన్‌కు అర్థమవుతుందనే రషీద్ అలా ట్వీట్ చేసుంటాడని అభిమానులు భావిస్తున్నారు.

న్యూజీలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముజీబుర్ రహమాన్ జట్టులోకి రావడం చాలా కీలకం అని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా అభిప్రాయప్డడారు.

ప్రశాంత్ పంచాడ హైదరాబాద్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్. ఈయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెడ్ స్పోర్ట్స్ ఫిజియోగా పనిచేశారు.

వీడియో క్యాప్షన్, ఆఫ్ఘన్ క్రికెట్ లేటెస్ట్ సెన్సేషన్ రాషీద్ ఖాన్ స్పెషల్ ఇంటర్వ్యూ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)