టీ20 వరల్డ్ కప్-INDvsAFG: అఫ్గానిస్తాన్‌పై 66 పరుగులతో భారత్ విజయం

కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అబుదాబిలో బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 66 పరుగులతో గెలుపొందింది.

మొదట బ్యాటింగ్‌లో రాణించిన భారత్ తర్వాత బంతితోనూ ఆకట్టుకోవడంతో గెలుపు సాధ్యమైంది. టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లాడిన భారత్ రెండింట్లో పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్ ఆద్యంతం భారత్ ఆధిపత్యమే కొనసాగింది.

211 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన అఫ్గానిస్తాన్ ఏ దశలోనూ భారత్‌కు పోటీనివ్వలేకపోయింది. 10 ఓవర్లు ముగిసేసరికే భారత్ విజయం ఖాయంగా అనిపించింది. అయితే చివరి వరకు ఆలౌట్ కాకుండా పోరాడిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది.

కరీమ్ జానత్ (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ నబీ (35) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో షమీ 3, అశ్విన్‌ 2 వికెట్లు పడగొట్టారు. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (47 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు.

పంత్ (13 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. నైబ్, కరీమ్ చెరో వికెట్ తీశారు. రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్‌లో విజయంతో గ్రూప్ 2లో భారత్ నాలుగో స్థానానికి చేరింది. భారత్ నెట్ రన్‌రేట్ కూడా -1.6 నుంచి 0.073కి మెరుగైంది.

ఈ గ్రూపులో పాకిస్తాన్ 8 పాయింట్లతో (నెట్ రన్‌ రేట్ 1.065) అగ్రస్థానంలో ఉండగా... అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అప్గానిస్తాన్ నెట్ రన్ రేట్ 1.481గా ఉండగా, న్యూజీలాండ్ నెట్ రన్ రేట్ 0.816గా ఉంది.

కోహ్లీ

ఫొటో సోర్స్, Reuters

మ్యాచ్ ఎలా సాగిందంటే....

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

రోహిత్‌, కేఎల్ రాహుల్ భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ భారత తుదిజట్టులోకి వచ్చారు.

అఫ్గానిస్తాన్ జట్టులో షరాఫుద్దీన్‌కు చోటు దక్కింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

5 ఓవర్లకు భారత్ స్కోరు: 52/0

మొహమ్మద్ నబీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ చివరి బంతికి ఫోర్‌తో రోహిత్ శర్మ బౌండరీల ఖాతా తెరిచాడు.

తర్వాతి ఓవర్‌లోనే షరాఫుద్దీన్ బౌలింగ్‌లో తొలి బంతిని రోహిత్ శర్మ బౌండరీ బాదగా... చివరి రెండు బంతులకు రాహుల్ సిక్సర్, ఫోర్‌తో అలరించాడు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిత్ శర్మ

మూడో ఓవర్‌లో రోహిత్ ఒక ఫోర్ బాదడంతో 7 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో హమీద్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

నవీన్ ఉల్ హఖ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో భారత ఓపెనర్లు 17 పరుగులు రాబట్టారు. ఈ ఓవర్‌లో రోహిత్ ఒక సిక్సర్‌తో పాటు రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో 5 ఓవర్లకు భారత్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది.

10 ఓవర్లకు భారత్ స్కోరు: 85/0

పవర్‌ప్లేలో చివరిదైన ఆరో ఓవర్‌లో భారత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేయగలిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

తర్వాతి రెండు ఓవర్లలో సింగిల్స్ సహాయంతో భారత ఓపెనర్లిద్దరూ 12 పరుగులు సాధించారు.

9వ ఓవర్‌లో షరాఫుద్దీన్ బౌలింగ్‌లో రాహుల్ ఒక బౌండరీ బాదడంతో 9 పరుగులు వచ్చాయి.

పదో ఓవర్‌లో రాహుల్ మరో ఫోర్ బాదాడు. దీంతో భారత్ 85/0తో నిలిచింది.

రోహిత్, రాహుల్ అర్ధసెంచరీలు, 15 ఓవర్లకు భారత్ స్కోరు: 142/1

గుల్బదిన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రోహిత్ మరో ఫోర్ బాదడంతో 6 పరుగులు వచ్చాయి.

తర్వాతి ఓవర్‌లోనే రోహిత్ శర్మ అర్ధసెంచరీ పూర్తయింది. నవీన్ ఉల్ హఖ్ వేసిన 12వ ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించిన రోహిత్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

37 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్... ఈ ప్రపంచకప్‌లో తొలి అర్ధశతకాన్ని అందుకున్నాడు.

ఇదే ఓవర్‌ నాలుగో బంతిని రాహుల్ సిక్సర్‌గా మలచగా, చివరి బంతికి రోహిత్ మరో ఫోర్‌తో చెలరేగాడు. దీంతో ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.

13వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదిన రాహుల్ కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అతను అర్ధసెంచరీ చేయడం విశేషం. తర్వాత కూడా రాహుల్ మరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

రషీద్ ఖాన్ వేసిన 14 వ ఓవర్లో రోహిత్ శర్మ వరుస బంతుల్లో 2 సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో రషీద్‌ఖాన్ 16 పరుగులు సమర్పించుకున్నాడు.

15వ ఓవర్ బౌలింగ్ చేసిన కరీమ్ జానత్ తొలి బంతికి బౌండరీ ఇచ్చినప్పటికీ, నాలుగో బంతికి రోహిత్ శర్మ (47 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) వికెట్‌ను తీశాడు. దీంతో తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఓవర్లో 7 పరుగులే రావడంతో 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది.

రాహుల్ అవుట్

16వ ఓవర్‌లో రషీద్ ఖాన్ పరుగులు ఇవ్వకుండా భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ఈ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి.

తర్వాతి ఓవర్ వేసిన గుల్బదిన్, 17వ ఓవర్ మూడో బంతికి రాహుల్ (48 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా జోరు

రాహుల్ అవుటయ్యాక పంత్ జోరు పెంచాడు. అదే ఓవర్ చివరి రెండు బంతులకు రెండు సిక్సర్లతో 15 పరుగులు రాబట్టాడు.

18వ ఓవర్‌లో హార్దిక్ 3 ఫోర్లతో చెలరేగాడు. దీంతో ఈ ఓవర్‌లో కూడా 15 పరుగులు వచ్చాయి.

19వ ఓవర్ వేసిన నవీన్ ఉల్ హఖ్ 19 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్‌లో హార్దిక్ 2 సిక్సర్లు కొట్టాడు.

ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ తొలి రెండు బంతులకు పంత్ వరుసగా 4, 6 బాదగా... ఐదో బంతికి హార్దిక్ మరో బౌండరీ కొట్టాడు. హమీద్ హసన్ బౌలింగ్ చేసిన ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 210 పరుగులు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

పంత్ (13 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో వికెట్‌కు అజేయంగా 21 బంతుల్లో 63 పరుగుల్ని జోడించారు.

గుల్బదిన్ నైబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుల్బదిన్ నైబ్

కష్టాల్లో అఫ్గానిస్తాన్, 10 ఓవర్లకు స్కోరు: 61/4

భారీ లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ జట్టు తడబడుతోంది. జట్టు స్కోరు 13 పరుగుల వద్దే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది.

మూడో ఓవర్ చివరి బంతికి షమీ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి మొహమ్మద్ షహజాద్ (0) డకౌట్ అయ్యాడు. మరుసటి ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ (15 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్)ను బుమ్రా పెవిలియన్ పంపాడు.

తర్వాత రహ్మానుల్లా గుర్బాజ్ (10 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు), గుల్బదిన్ నైబ్ (20 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

వీరిద్దరూ కలిసి 35 పరుగుల్ని జోడించాక జడేజా ఈ జోడీని విడదీశాడు. జట్టు స్కోరు 48 పరుగుల వద్ద రహ్మానుల్లా అవుటయ్యాడు. కాసేపటికే నైబ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో 10 ఓవర్లకు అఫ్గానిస్తాన్ 4 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది.

15 ఓవర్లకు అఫ్గానిస్తాన్ స్కోరు: 88/5

మధ్య ఓవర్లలో అఫ్గానిస్తాన్ పరుగుల వేగం మరింత మందగించింది. శార్దుల్ ఠాకూర్ వేసిన 11వ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి.

12వ ఓవర్ బౌలింగ్ చేసిన అశ్విన్ కేవలం 4 పరుగులే ఇవ్వడంతో పాటు నజీబుల్లా జద్రాన్ (11) వికెట్‌ను తీశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

జడేజా వేసిన తర్వాత ఓవర్‌లో కరీమ్ ఒక బౌండరీ బాదడంతో 10 పరుగులు వచ్చాయి.

14వ ఓవర్‌లో మరోసారి బంతినందుకున్న అశ్విన్ కేవలం 5 పరుగులే ఇచ్చాడు. 15వ ఓవర్‌లో బుమ్రా మరింత కట్టుదిట్టంగా బంతులేయడంతో కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి అఫ్గాన్ 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులతో నిలిచింది. విజయం సాధించాలంటే అఫ్గానిస్తాన్ చివరి 30 బంతుల్లో 123 కొట్టాలి.

చివరి 30 బంతుల్లో 56 పరుగులు

చివరి ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ కాస్త దూకుడు పెంచింది. ఠాకూర్ వేసిన 16వ ఓవర్‌లో కరీమ్ సిక్సర్ బాదడంతో ఈ ఓవర్‌లో అఫ్గాన్‌కు 10 పరుగులు లభించాయి.

తర్వాతి ఓవర్‌లో బుమ్రా రెండు బౌండరీలు ఇవ్వడంతో పాటు, రెండు వైడ్ బాల్స్ వేయడంతో 11 పరుగులు వచ్చాయి.

శార్దూల్ ఠాకూర్ వేసిన 18వ ఓవర్‌లో నబీ వరుసగా ఓ సిక్సర్, ఫోర్ బాది 16 పరుగులు సాధించాడు.

మరింత వేగం పెంచే క్రమంలో అప్గానిస్తాన్ 19వ ఓవర్లో రెండు వికెట్లను కోల్పోయింది. షమీకే ఈ రెండు వికెట్లు దక్కాయి. తొలి బంతికి నబీ (32 బంతుల్లో 35;2 ఫోర్లు, 1 సిక్స్) డీప్ మిడ్ వికెట్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు.

దీంతో ఆరో వికెట్‌కు 38 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నబీ స్థానంలో వచ్చిన రషీద్ ఖాన్ (0), పాండ్యాకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

ఇక పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో కరీమ్ 4, 6 బాదడంతో 14 పరుగులు వచ్చాయి. దీంతో 66 పరుగులతో భారత్‌ విజయం సాధించింది. చివరి 30 బంతుల్లో అఫ్గానిస్తాన్ 56 పరుగులు సాధించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)