టీ20 వరల్డ్ కప్: వరుసగా నాలుగో విజయంతో సెమీ ఫైనల్ చేరిన పాకిస్తాన్

ఫొటో సోర్స్, Francois Nel/getty images
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో పాకిస్తాన్ నమీబియాపై 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వరుసగా నాలుగో విజయంతో 8 పాయింట్లు సాధించిన పాకిస్తాన్ గ్రూప్ 2 నుంచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులే చేయగలింది.
రెండో ఓవర్లో 8 పరుగులకే తొలి వికెట్ పడినా.. నిలకడగా ఆడిన ఓపెనర్ స్టీఫెన్ బార్డ్, క్రెగ్ విలియమ్సన్ జట్టు స్కోరును 9వ ఓవర్లో 50 పరుగులు దాటించారు. కానీ, అదే ఓవర్లో బార్డ్ రనౌట్ అయ్యాడు.
తర్వాత ధాటిగా ఆడుతున్న క్రెగ్ విలియమ్స్, కెప్టెన్ ఎరాస్మస్‌తో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు.
దూకుడుగా ఆడిన నమీబియా పది ఓవర్లలో 2 వికెట్లకు 70 పరుగులు చేసింది. ఈ టోర్నీలో 10 ఓవర్లలో నమీబియా చేసిన అత్యధిక స్కోరు ఇదే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎరాస్మస్ ఇచ్చిన క్యాచ్‌ను షాహీన్ అఫ్రిది వదిలేశాడు. కానీ అతడు ఆ తర్వాత ఇమాద్ వసీమ్ బౌలింగ్‌లో నేరుగా షాబాద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
అతడు అవుటైన మరో పది పరుగులకే నిలకడగా ఆడుతున్న క్రెగ్ విలియమ్స్ కూడా అవుటవడంతో నమీబియా కష్టాల్లో పడిపోయింది.
37 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్‌తో 40 పరుగులు చేసిన విలియమ్స్ షాబాద్ ఖాన్ బౌలింగ్‌లో హసన్ అలీకి క్యాచ్ ఇచ్చాడు.
నమీబియా 15వ ఓవర్లో 4 వికెట్లకు వంద పరుగులు మైలురాయిని అందుకుంది. విలియమ్స్ స్థానంలో వచ్చిన జేజే స్మిట్ 2 పరుగులకే ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
తర్వాత డేవిడ్ వీస్, నికోల్ లాఫ్టీ-ఈటన్(7) నాటౌట్‌గా నిలిచారు. చివరి ఓవర్లో ఈ జంట 16 పరుగులు రాబట్టింది.
డేవిడ్ వీస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ టోర్నీలో ఇప్పటివరకూ ద్వితీయార్థంలో బౌలింగ్ చేయని పాక్‌కు తడి బంతితో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం ఒక అనుభవం లాంటిదని ఇంగ్లండ్ స్పిన్నర్ అలెక్స్ హేలీ అన్నారు.
ప్రపంచకప్‌లో మొదటిసారి ఆడిన నమీబియా మంచి పోరాట పటిమ చూపించడం, పాకిస్తాన్ లాంటి జట్టును ఎదుర్కుని 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేయడాన్ని క్రీడా పండితులు ప్రశంసించారు.
79 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మ్యాచ్ తర్వాత మాట్లాడిన రిజ్వాన్ ప్రారంభంలో తమకు కష్టంగా అనిపించిందని, పరిస్థితులు అసలు అర్థం కాలేదని చెప్పాడు. షాట్లు కొట్టడం కష్టమైందని చెప్పిన రిజ్వాన్ ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని చివర్లో దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కొనసాగిన పాక్ ఓపెనర్ల జోరు
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచుల్లో వరసగా మూడు విజయాలతో జోరు మీదున్న పాకిస్తాన్, నమీబియాపై కూడా అదే ప్రదర్సన కొనసాగించింది.
ఓపెనర్లు బాబర్ ఆజం(70), మొహమ్మద్ రిజ్వాన్(79 నాటౌట్) చెలరేగి ఆడడంతో పాకిస్తాన్ 2 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మొదటి పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసిన పాకిస్తాన్ మిగతా పది ఓవర్లలో ఏకంగా 130 పరుగులు చేయడం వారి బ్యాటింగ్ ధాటిని చాటుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నమీబియా బౌలర్లను ఎదుర్కోవడంలో మొదట తంటాలు పడింది.
తొలి ఓవర్ మెయిడెన్ వేసిన నమీబియా బౌలింగ్ ధాటికి పాక్ ఓపెనర్లు మొదట్లో నెమ్మదిగా ఆడారు.
ఆరు ఓవర్లకు పవర్ ప్లే ముగిసే సమయానికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది.
నెమ్మదిగా స్కోర్ పెంచిన ఓపెనర్లు డ్రింక్స్ బ్రేక్స్ తర్వాత దూకుడు పెంచారు. 12వ ఓవర్లో ఏకంగా 18 పరుగులు పిండుకున్నారు. అదే ఓవర్లో బాబర్ ఆజాం ఈ టోర్నీలో తన మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
12వ ఓవర్లో మొదటి బంతికి సిక్స్ కొట్టిన మొహమ్మద్ రిజ్వాన్, 13వ ఓవర్లో కూడా ఒక భారీ సిక్స్ కొట్టాడు. అదే ఓవర్లో పాకిస్తాన్ వంద పరుగులు కూడా పూర్తి చేసుకుంది.
కానీ, 15వ ఓవర్లో 113 పరుగుల దగ్గర పాకిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది. డేవిడ్ వీస్ వేసిన ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన కెప్టెన్ బాబర్ ఆజాం అదే ఊపులో భారీ షాట్ కొట్టబోయి జాన్ ఫ్రై లింక్‌కు క్యాచ్ ఇచ్చాడు.
బాబర్ ఆజం 49 బంతుల్లో 7 ఫోర్లతో 70 పరుగులు చేశాడు.
పాకిస్తాన్ 122 పరుగుల దగ్గర తన రెండో వికెట్ కోల్పోయింది. బాబర్ స్థానంలో వచ్చిన ఫఖర్ జమాన్(5) జాన్ ఫ్రైలింగ్ బౌలింగ్‌లో ఇఛ్చిన క్యాచ్‌ను కీపర్ జేన్ గ్రీన్ అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. ఫఖర్ జమాన్ 5 పరుగులకే పెవిలియన్ చేరాడు.
ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హఫీజ్(32 నాటౌట్) మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
19వ ఓవర్లో మొహమ్మద్ రిజ్వాన్ సిక్స్‌తో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
మొహమ్మద్ హఫీజ్ కూడా వేగంగా ఆడాడు. 16 బంతుల్లోనే 5 ఫోర్లతో 32 పరుగులు చేశాడు.
చివరి ఓవర్లో మొహమ్మద్ రిజ్వాన్ చెలరేగిపోయాడు. తొలి బంతికి ఫోర్, రెండో బంతికి సిక్స్ కొట్టిన రిజ్వాన్ ఆ తర్వాత వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. చివరి ఓవర్‌కు 2 పరుగులే రావడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది.
మొహమ్మద్ రిజ్వాన్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
రిజ్వాన్ ఐదో ఓవర్లో అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. అంపైర్ ఎల్‌బీడబ్ల్యు అయినట్లు ప్రకటించగా, రిజ్వాన్ రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ రివ్యూలో ఆ బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయినట్లు కనిపించడంతో నాటౌట్ ఇచ్చారు.
నమీబియా బౌలర్లలో డేవిడ్ వీస్, జాన్ ఫ్రైలింగ్ తలో వికెట్ తీశారు.
గ్రూప్-1లో రెండో స్థానంలో దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్ ఇంటికే..

ఫొటో సోర్స్, Gareth Copley-ICC/getty images
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 1 సూపర్ 12లో భాగంగా మంగళవారం(నవంబర్ 2) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఇప్పుడు గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో 6 పాయింట్లు సంపాదించింది.
ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కూడా సెమీ ఫైనల్లో స్థానం సంపాదించడానికి పోటీపడుతోంది.
కానీ బంగ్లాదేశ్‌పై సాధించిన విజయంతో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించింది.
దక్షిణాఫ్రికాతో ఓటమితో బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌లకు గాను మూడు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. గురువారం జరిగే చివరి మ్యాచ్‌లో ఆ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.
దక్షిణాఫ్రికా శనివారం తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో పట్టికలో టాప్‌లో ఉన్న ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
దక్షిణాఫ్రికా సరైన సమయంలో గాడిన పడింది. క్రికెట్ టోర్నీలో అదే అవసరం అని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ అలెక్స్ హార్ట్‌లీ చెప్పారు.
"ఈ వేగం కీలకం. ఆస్ట్రేలియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. వాళ్లు ఇప్పుడు ఒత్తిడిలో ఉంటారు. ఎందుకంటే ఆ రెండు జట్ల మధ్య నెట్ రన్ రేట్ తగ్గుతుంది. ఇంగ్లండ్‌తో ఘోర పరాజయం ఆస్ట్రేలియాకు ముప్పు తెచ్చిపెట్టింది" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
6 వికెట్ల తేడాతో విజయం
కెప్టెన్ టెంబా బవుమా 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో 84 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాప్రికా ఇంకా 39 బంతులు ఉండగానే అందుకుంది. 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
కెప్టెన్‌కు అండగా నిలిచిన రసీ వాండెర్ డసెన్(22) నసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో షరీఫుల్ ఇస్లామ్ పరిగెత్తుతూ డైవ్ చేసి పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.
దక్షిణాఫ్రికా ఓపెనర్లు క్వింటన్ డికాక్(16), రీజా హెండ్రిక్స్(4) పరుగులు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
ఆరో ఓవర్లో చేజారిన బ్యాట్ స్టంప్స్ మీద పడకుండా పక్కకు పడడంతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎయిడెన్ మార్‌క్రం ఆ తర్వాత బంతికే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, మెహెదీ హసన్, నాసుమ్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
బంగ్లాదేశ్ బ్యాటింగ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ మూడు సార్లు ఒకే స్కోర్ దగ్గర వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.
క్రమం తప్పకుండా వికెట్లు పడడంతో జట్టు వంద పరుగులు చేయడం కూడా కష్టమైపోయింది.
22 పరుగుల దగ్గర జట్టు వరుస బంతులకు ఓపెనర్ మొహమ్మద్(9), సౌమ్యా సర్కార్(0) వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ తర్వాత రెండు పరుగులకే ముష్ఫికర్ రహీమ్(0) వికెట్ కూడా పోగొట్టుకుంది.
సౌమ్యా సర్కార్ ఎల్‌బీడబ్ల్యు అపీల్‌ను అంపైర్ తోసిపుచ్చడంతో దక్షిణాఫ్రికా రివ్యూకు వెళ్లింది. థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో రబడకు వరుస బంతుల్లో రెండు వికెట్లు దక్కాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
ఈ మూడు వికెట్లు కగిసో రబడకే దక్కడం విశేషం.
తర్వాత 34 పరుగుల దగ్గర బంగ్లాదేశ్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. 8వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ మహ్మదుల్లా(3), తొమ్మిదో ఓవర్ మొదటి బంతికి అఫీఫ్ హుస్సేన్(0) అవుటయ్యారు.
ఒక పక్క వరుసగా వికెట్లు పడుతుంటే మరో వైపు ఓపెనర్ లిటన్ దాస్ నెమ్మదిగా ఆడాడు. చివరికి ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
పరుగులు పెంచే క్రమంలో బంగ్లాదేశ్ అన్రిజ్ నార్ట్‌జే వేసిన 19వ ఓవర్లో కూడా పక్క పక్క బంతులకే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు చివరకు 84 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన మెహదీ హసన్ 27, ఓపెనర్ లిటన్ దాస్ 24, షమీమ్ హొస్సేన్ 11 పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ, అన్రిచ్ నార్ట్‌జే చెరి 3 వికెట్లు పడగొట్టగా, తబ్రైజ్ షంసీ 2, డ్వేన్ ప్రిటోరియస్ ఒక వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్‌లో ఒకటి తర్వాత మరొకటిగా గ్రామాలు ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి?
- భారత్‌లో పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- 'ఏపీలో విద్యుత్ కొరత లేదు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)