టీ20 వరల్డ్ కప్ IndvsNz: భారత్‌ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం, 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ విజయం

డరెల్ మిషెల్, కేన్ విలియమ్సన్

ఫొటో సోర్స్, Michael Steele-ICC/getty images

ఫొటో క్యాప్షన్, డెరిల్ మిషెల్, కేన్ విలియమ్సన్

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో సెమీ ఫైనల్‌కు కీలకమైన మ్యాచ్‌లో న్యూజీలాండ్ భారత్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బంతుల కంటే కొట్టాల్సిన పరుగులే తక్కువ ఉండడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన న్యూజీలాండ్ సులభంగా గెలిచింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

డెరిల్ మిషెల్ 49 పరుగులు, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఇంకా 33 బంతులు మిగిలుండగానే జట్టు విజయం అందుకుంది.

న్యూజీలాండ్ 24 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో మార్టిన్ గప్తిల్(20) అవుటయ్యాడు.

తర్వాత మరో ఓపెనర్ డెరిల్ మిషెల్, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం అందించారు.

న్యూజీలాండ్ పది ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

96 పరుగుల దగ్గర డెరిల్ మిషెల్(49) వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ కూడా బుమ్రాకే దక్కింది. 13వ ఓవర్లో మిషెల్ కొట్టిన షాట్‌ను కేఎల్ రాహుల్ సులభంగా అందుకున్నాడు.

మిషెల్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. అతడు అవుటైనా కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

31 బంతుల్లో 33 పరుగులు చేసిన విలియమ్సన్, డెవాన్ కాన్వే(2) నాటౌట్‌గా నిలిచారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

సెమీ ఫైనల్ ఆశలు సంక్లిష్టం

రెండో మ్యాచ్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓటమితో భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

ఇప్పుడు భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు పూర్తిగా మిగతా జట్ల గెలుపోటములపైనే ఆధారపడ్డాయి.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గ్రూప్ 2లో నమీబియా కంటే కింద ఐదో స్థానంలో ఉన్న భారత్ నెట్ రన్ రేట్ మైనస్ 1.609 ఉంది. ఈ పట్టికలో స్కాట్లాండ్ చివర్లో ఉంది.

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ సెమీ ఫైనల్ చేరడం కష్టమే.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Alex Davidson/getty images

అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది.

న్యూజీలాండ్‌ ముందు 111 పరుగుల స్వల్ప విజయలక్ష్యం ఉంచింది.

టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఒక దశలో అభిమానులకు భారత్ వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది.

48 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది.

భారత జట్టు 35 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. తర్వాత 8 పరుగుల తేడాతో రోహిత్, కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్లు కూడా పోగొట్టుకుంది.

ఇషాన్, రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నలుగురూ భారీ షాట్ కొట్టబోయి బౌండరీ దగ్గర క్యాచ్ అవుట్ కావడం విశేషం

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

మూడో ఓవర్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్ ఇషాన్ కిషన్(4) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్‌లో డెరిల్ మిషెల్‌కు దొరికిపోయాడు.

ఇషాన్ కిషన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ ఆడిన మొదటి బంతికే అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు.

అదే ఓవర్లో రోహిత్ శర్మ కొట్టిన షాట్‌ను బౌండరీలో క్యాచ్ మిస్ అవడంతో బతికిపోయాడు.

కానీ, ఆరో ఓవర్లో దూకుడుగా ఆడుతున్న కేఎల్ రాహుల్ అవుటవడంతో భారత్‌కు మరో షాక్ తగిలింది.

16 బంతుల్లో 18 పరుగులు చేసి అభిమానుల్లో ఆశలు రేపిన రాహుల్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో డెరిల్ మిషెల్‌కే కాచ్ ఇచ్చాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

40 పరుగుల దగ్గర 8వ ఓవర్లో రోహిత్ శర్మ, మరో 8 పరుగులకే విరాట్ కోహ్లీ అవుటవడంతో భారత్ కష్టాల్లో పడిపోయింది.

1 సిక్స్, 1 ఫోర్‌తో 14 బంతుల్లో 14 పరుగులు చేసిన రోహిత్ భారీ షాట్ కొట్టబోయి ఇష్ సోధీకి క్యాచ్ ఇవ్వగా, రిషబ్ పంత్‌తో కలిసి ఆచితూచి ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇష్ సోధీ వేసిన 11వ ఓవర్లో ట్రెండ్ బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు.

15వ ఓవర్లో రిషబ్ పంత్ కూడా అవుటవడంతో భారత్ వంద పరుగులు కూడా చేయడం కష్టం అనిపించింది. 19 బంతుల్లో 12 పరుగులు చేసిన రిషబ్ మిల్నే బౌలింగ్‌లో క్లీన్ బోల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాతో కలిసి స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

కానీ, 94 పరుగుల దగ్గర భారత్ వెంటవెంటనే హార్దిక్ పాండ్య(23), శార్దూల్ ఠాకూర్(0) వికెట్లను కోల్పోయింది.

19వ ఓవర్ మొదటి బంతికి పాండ్యను పెవిలియన్ పంపిన ట్రెంట్ బౌల్ట్, నాలుగో బంతికి శార్దూల్ ఠాకూర్ వికెట్ తీశాడు. ఇద్దరూ ఇచ్చిన క్యాచ్‌లను మార్టిన్ గప్తిల్ అందుకున్నాడు.

20వ ఓవర్లో భారత్ కష్టంగా వంద పరుగుల మైలురాయిని దాటగలిగింది. 26 పరుగులు చేసి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజా జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

రవీంద్ర జడేజా 19 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 26 పరుగులు చేశాడు.

న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి పరుగులు రాబట్టడానికి తడబడిన భారత బ్యాట్స్‌మెన్ చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులే చేయగలిగారు.

ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోధీ 2 వికెట్లు తీశాడు. టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నేలకు చెరో వికెట్ దక్కింది.

నమీబియాపై అప్ఘానిస్తాన్ విజయం

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC/ICC VIA GETTY IMAGES

టీ20 వరల్డ్ కప్‌ గ్రూప్ 2లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.

161 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులే చేయగలిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

జట్టులో డేవిడ్ వీస్(26) మినహా ఎవరూ భారీ స్కోరు చేయలేదు. ఒక దశలో నమీబియా ఆలౌట్ అవుతుందేమో అనిపించింది.

11 ఓవర్లో 56 పరుగుల దగ్గర నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్(12), జేజే స్మిట్(0) వికెట్లు వెంటవెంటనే కోల్పోవడంతో నమీబియా ఓటమి దాదాపు ఖాయమైపోయింది.

రూబెన్ ట్రంపుల్‌మెన్(12) బెర్నార్డ్ స్కోల్జ్(6) మరో వికెట్ పడకుండా చివరి వరకూ క్రీజులో నిలిచినప్పటికీ నమీబియా 62 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.

అఫ్గానిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్‌, మొహమ్మద్ నబీ చెరి 3 వికెట్లు పడగొట్టగా గుల్బదిన్ నయీబ్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

దూకుడుగా ఆడిన అఫ్గానిస్తాన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.

ఓపెనర్లు తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించడంతోపాటూ అస్గర్ అఫ్గాన్(31), కెప్టెన్ మొహమ్మద్ నబీ చివర్లో చెలరేగి ఆడడంతో అఫ్గానిస్తాన్ 160 పరుగులు చేయగలిగింది.

ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో)33 పరుగులు చేయగా, మొహమ్మద్ షాజాద్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో) 45 పరుగులు చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

రహ్మతుల్లా గుర్బాజ్(4), నజీబుల్లా జద్రాన్(7) తక్కువ పరుగులకే అవుటవడంతో మధ్యల స్కోరు వేగం మందగించింది.

కానీ 19వ ఓవర్ వరకూ నిలిచిన అస్ఘర్ అఫ్గాన్(23 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 31 పరుగులు) అఫ్గానిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ (5 ఫోర్లు, 1 సిక్స్‌తో 17బంతుల్లో 32 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడడంతో అఫ్గానిస్తాన్ నమీబియాకు 161 పరుగుల విజయ లక్ష్యం ఇవ్వగలిగింది.

నమీబియా బౌలర్లలో నికోల్ లోఫ్టీ ఇటన్, రూబెన్ ట్రంపుల్‌మన్ చెరి 2 వికెట్లు పడగొట్టగా, జేజే స్మిట్‌ ఒక వికెట్ తీశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)